ICC T20 Rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ విడుదల.. నాలుగో స్థానంలో భారత ఓపెనర్..
ఐసీసీ బుధవారం విడుదల చేసిన టీ 20 బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో భారత క్రికెట్ జట్టు ఓపెనర్ కేఎల్ రాహుల్ ఒక స్థానం ఎగబాకి 4స్థానంలో నిలిచాడు...
ఐసీసీ బుధవారం విడుదల చేసిన టీ 20 బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో భారత క్రికెట్ జట్టు ఓపెనర్ కేఎల్ రాహుల్(kl Rahul) ఒక స్థానం ఎగబాకి 4స్థానంలో నిలిచాడు. అదే సమయంలో మాజీ కెప్టెన్, వెటరన్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ(virat kohli) 10వ స్థానంలో కొనసాగుతుండగా, టీమిండియా కొత్త వన్డే-టీ20 కెప్టెన్ రోహిత్ శర్మ(rohith sharma) 11వ స్థానంలో కొనసాగుతున్నాడు. మరోవైపు భారత బౌలర్లు భువనేశ్వర్ కుమార్ 20వ స్థానంలో ఉన్నాడు. ఇది భారత బౌలర్లలో ప్రస్తుత ర్యాంకింగ్‌లో అత్యధిక స్థానం.
ఆల్‌రౌండర్ల విషయానికొస్తే.. టాప్-10లో భారతీయులెవరూ లేరు. భారత్ ఇటీవల టీ20 మ్యాచ్‌లు ఆడలేదు. వెస్టిండీస్ ఇటీవల ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇంగ్లండ్‌ను ఓడించింది. దీంతో లెఫ్టార్మ్ స్పిన్నర్ అకిల్ హొస్సేన్, పేసర్ జెస్ హోల్డర్ తమ కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంకింగ్స్ సాధించారు. ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో మ్యాచ్‌లో 17 పరుగుల తేడాతో వెస్టిండీస్‌ను గెలిపించడంలో వీరిద్దరూ కీలక పాత్ర పోషించారు.
హుస్సేన్ 15 స్థానాలు ఎగబాకి 18వ స్థానానికి చేరుకున్నాడు. మూడు మ్యాచ్‌ల్లో ఆరు వికెట్లు తీశాడు. వెస్టిండీస్ మాజీ కెప్టెన్ హోల్డర్.. చివరి మ్యాచ్ చివరి ఓవర్‌లో వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో అతను మొత్తం ఐదు వికెట్లు పడగొట్టాడు. దీంతో అతని వికెట్ల సంఖ్య తొమ్మిదికి చేరుకుంది. మూడు స్థానాలు ఎగబాకి 23వ స్థానానికి చేరుకున్నాడు.
షెల్డన్ కాట్రెల్ 10 స్థానాలు ఎగబాకి 31వ స్థానానికి చేరుకున్నాడు. మరోవైపు ఇంగ్లండ్ స్పిన్నర్ మొయిన్ అలీ మూడు స్థానాలు ఎగబాకి 32వ స్థానానికి చేరుకున్నాడు. లియామ్ లివింగ్‌స్టోన్ 33 స్థానాలు ఎగబాకి 68వ స్థానానికి చేరుకున్నాడు. బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో కూడా విండీస్ బ్యాట్స్‌మెన్ నికోలస్ పూరన్ ఎనిమిది స్థానాలు ఎగబాకి 18వ స్థానానికి చేరుకున్నాడు. బ్రెండన్ కింగ్ 25 స్థానాలు ఎగబాకి 58వ స్థానానికి చేరుకున్నాడు. వెస్టిండీస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ 15 స్థానాలు ఎగబాకి 60వ ర్యాంక్‌కు చేరుకున్నాడు.
నాలుగో మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికైన మొయిన్ అలీ 30 స్థానాలు ఎగబాకాడు. మూడు మ్యాచ్‌ల్లో 73 పరుగులు చేసి 67వ స్థానానికి చేరుకున్నాడు. రెండు వికెట్లు కూడా తీశాడు. ఈ కారణంగానే ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి చేరుకున్నాడు.
Read Also.. MS Dhoni: ప్రశాంతంగా టెన్నిస్ ఆడుతున్న ఎంఎస్ ధోనీ.. వైరల్ అయిన ఫొటోలు..