Ravichandran Ashwin: సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్‌లో నిరాశ పర్చిన రవిచంద్రన్‌ అశ్విన్‌!

మరికొద్ది రోజుల్లో వెస్టిండీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌ మొదలు కానుంది. అది మొదలవ్వగానే దక్షిణాఫ్రికాతో ఇటీవల ముగిసిన టెస్ట్‌ సిరీస్‌ గురించి అందరూ మర్చిపోతారు. కానీ సౌతాఫ్రికాలో మనవాళ్ల ఆట తీరు గురించి తప్పనిసరిగా చర్చించవలసిందే!

Ravichandran Ashwin: సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్‌లో నిరాశ పర్చిన రవిచంద్రన్‌ అశ్విన్‌!
Ravichandran Ashwin
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Feb 02, 2022 | 3:33 PM

India-South Africa Tour: మరికొద్ది రోజుల్లో వెస్టిండీస్‌(West Indies)తో పరిమిత ఓవర్ల సిరీస్‌ మొదలు కానుంది. అది మొదలవ్వగానే దక్షిణాఫ్రికాతో ఇటీవల ముగిసిన టెస్ట్‌ సిరీస్‌ గురించి అందరూ మర్చిపోతారు. కానీ సౌతాఫ్రికా(South Africa)లో మనవాళ్ల ఆట తీరు గురించి తప్పనిసరిగా చర్చించవలసిందే! మరీ ముఖ్యంగా రవిచంద్రన్‌ అశ్విన్‌(Ravichandran Ashwin) గురించి చెప్పుకోవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ సిరీస్‌లో అశ్విన్‌ పెద్దగా రాణించింది లేదు. ఆరు ఇన్నింగ్స్‌లలో అతడు తీసిన వికెట్లు కేవలం మూడంటే మూడే! ఇది చాలు విదేశాల్లో అశ్విన్‌ బంతిని ఏ మేరకు తిప్పగలడని చెప్పడానికి! భారత ఉపఖండపు పిచ్‌లపై అశ్విన్‌ కచ్చితంగా మ్యాచ్‌ విన్నరే! అందులో ఎలాంటి సందేహమూ లేదు.

ఇండియన్‌ పిచ్‌లు స్పిన్‌కు అనుకూలంగా ఉంటాయి. పైగా మొదటి రోజు నుంచి బంతి తిగరడం మొదలుపెడుతుంది. అందులోనూ పిచ్‌ అయిన బాల్‌ తక్కువ ఎత్తులో వస్తుంది.. భారత ఉపఖండం వెలుపల మాత్రం అశ్విన్‌ అంతగా రాణించడం లేదు. అందుకు కారణం విదేశీ పిచ్‌లు ఎక్కువగా ఫాస్ట్ బౌలింగ్‌కు అనుకూలిస్తాయి కాబట్టి.. ఇండియాలో 300 వికెట్లు సాధించిన అశ్విన్‌ విదేశాల్లో మాత్రం 130 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. అశ్విన్‌ సంగతి అలా ఉంచితే 103 టెస్ట్‌ మ్యాచ్‌లలో 417 వికెట్లు తీసిన ఆఫ్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి నిష్క్రమించడం కొంచెం బాధాకరమే! ఇండియాలో 265 వికెట్లు తీసిన హర్భజన్‌ విదేశీ పిచ్‌లపై 152 వికెట్లు తీశాడు. ఇన్నింగ్స్‌లో అయిదు, అంతకంటే ఎక్కువ వికెట్లను 19 సార్లు సాధించగలిగాడు. స్వదేశంలో 12 సార్లు ఈ ఫీట్‌ చేస్తే, విదేశాల్లో ఏడు సార్లు ఈ ఘనత పొందాడు.

ఈ గణాంకాలు ఏమి చెబుతున్నట్టు? ఇండియన్‌ పిచ్‌లపై బంతిని అవలీలగా తిప్పగలిగే ఈ ఇద్దరు ఆఫ్‌ స్పిన్నర్లు విదేశాల్లో ఎందుకు అంతగా రాణించలేకపోయారు. క్వాలిటీ స్పిన్నర్లు మనకు కరువయ్యారని అనుకోవాలా? పాత తరం స్పిన్నర్లు కూడా ఇలాగే స్వదేశంలో విజృంభించేసి విదేశాల్లో చేతులెత్తేశారా? ఇంచుమించు 46 ఏళ్ల కిందట జరిగిన ఓ సంఘటనను ఈ సందర్భంగా ప్రస్తావించుకోవాలి. 1976 జనవరిలో నెలలో ఆక్లాండ్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టెస్ట్‌ మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో ఎర్రపల్లి ప్రసన్న 76 పరుగులిచ్చి ఎనిమిది వికెట్లు తీసుకున్నాడు. విదేశీ గడ్డపై భారత స్పిన్నర్‌ సాధించిన అత్యుత్తమ బౌలింగ్‌ ప్రదర్శన ఇదే! ఇప్పటికీ ఈ రికార్డు అలాగే ఉంది.

Cricket

Cricket

నిజానికి ఇన్నింగ్స్‌లో ఎనిమిది, లేదా అంతకంటేఎక్కువ వికెట్లు తీసుకున్న మరో ఇద్దరు భారతీయ బౌలర్లు ఉన్నారు. కపిల్‌దేవ్‌ ఈ ఫీట్‌ను రెండుసార్లు చేశాడు. 1983లో పాకిస్తాన్‌తో లాహోర్‌లో జరిగిన మ్యాచ్‌లో కపిల్‌దేవ్‌ 85 పరుగులిచ్చి ఎనిమిది వికెట్లు తీసుకున్నాడు. 1885లో ఆస్ట్రేలియాతో అడిలైడ్‌లో జరిగిన మ్యాచ్‌లో 106 పరుగులకు ఎనిమిది వికెట్లు సాధించాడు. 2004లో ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరిగిన మ్యాచ్‌లో అనిల్‌కుంబ్లే 141 పరుగులకు ఎనిమిది వికెట్లు తీసుకున్నాడు. వీరితో పోలిస్తే కచ్చితంగా ప్రసన్నదే అత్యుత్తమ బౌలింగ్‌.

న్యూజిలాండ్‌లో పర్యటించడం ప్రసన్నకు అది రెండో సారి. 1968లో మన్సూర్‌ అలీఖాన్‌ పటౌడి నేతృత్వంలో న్యూజిలాండ్‌లో పర్యటించిన టీమిండియాలో ప్రస్నన్‌ సభ్యుడు. నాలుగు టెస్ట్‌ల సిరీస్‌ను ఇండియా 3-1 తేడాతో గెల్చుకుంది. ఈ విజయాలలో ప్రసన్నదే కీలక పాత్ర. ఆ సిరీస్‌లో మొత్తం 24 వికెట్లు తీసుకున్నాడు ప్రసన్న. ఇతడికి లెఫ్టార్మ్‌ స్పిన్‌ బౌలర్‌ బిషన్‌ సింగ్‌ బేడి సహకారం బాగా లభించింది. వీరిద్దరు బంతిని అనూహ్యంగా తిప్పుతుంటే న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మన్‌ చేష్టలుడిగి చూశారు. విదేశీగడ్డపై భారత్ సాధించిన తొలి సిరీస్‌ విజయంలో ప్రసన్నదే కీలక పాత్ర. ప్రసన్న కెరీర్‌ స్టాటిటిక్స్‌ పరిశీలిస్తుంటే ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. మొత్తం 17 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్‌ జీవితంలో ప్రసన్న 49 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. మొత్తం 189 వికెట్లు తీసుకున్నాడు. ఇందులో స్వదేశంలో సాధించినవి 95 వికెట్లు అయితే, విదేశాల్లో తీసుకున్నవి 94 వికెట్లు. టెస్ట్‌ల్లో పది వికెట్లను రెండు సార్లు సాధించాడు. ఇందులో కూడా స్వదేశంలో ఓసారి, విదేశాల్లో మరోసారి.. ఇన్నింగ్స్‌లో అయిదు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లను పది సార్లు సాధించాడు ప్రసన్న. స్వదేశంలో అయిదుసార్లు, విదేశాల్లో అయిదు సార్లు ఈ ఫీట్‌ సాధించాడు. అంటే స్వదేశంలో ఎంత గొప్పగా రాణించాడో, విదేశాల్లోనూ అంతే గొప్పగా రాణించాడు ప్రసన్న.

Crickeerst

Crickeerst

ప్రసన్న అంతర్జాతీయ క్రికెట్‌ ఆడుతున్న కాలంలో మరో ముగ్గురు స్పిన్నర్లు ఉండేవారు. ఈ నలుగురిని స్పిన్‌ చతుష్టయం అనేవాళ్లు. ఆ ముగ్గరు స్పిన్నర్లు కూడా తక్కువవారేం కాదు.. ఆ త్రయం కూడా స్వదేశంలో రాణించినట్టుగానే విదేశాల్లోనూ రాణించాడు. ఇందులో మొదటివాడు బిషన్‌సింగ్‌ బేడి. ఈయన 67 టెస్ట్‌ మ్యాచ్‌ల్లో 266 వికెట్లు తీసుకున్నాడు. ఇందులో స్వదేశంలో సాధించినవి 139 వికెట్లు అయితే, విదేశాల్లో తీసుకున్నవి 127 వికెట్లు. రెండో వాడు భగవత్‌ చంద్రశేఖర్‌.. ఈయన 58 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. మొత్తం 242 వికెట్లు తీసుకున్నాడు. ఇందులో స్వదేశంలో 142 వికెట్లు అయితే, విదేశాల్లో వంద వికెట్లు ఉన్నాయి. ఇక మూడో బౌలర్‌ శ్రీనివాస్‌ వెంకటరాఘవన్‌. ఈయన 57 టెస్ట్ మ్యాచ్‌ల్లో 156 వికెట్లు తీసుకున్నాడు. ఇండియాలో 94 వికెట్లు తీసుకుంటే, విదేశాల్లో 62 వికెట్లు తీసుకున్నాడు. బేడి టెస్ట్‌ల్లో పది వికెట్లు తీసుకోవడమన్నది ఒకేసారి జరిగింది. అది కూడా విదేశాల్లోనే కావడం గమనార్హం. అలాగే చంద్రశేఖర్‌ ఇన్నింగ్స్‌లో అయిదు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లను 16 సార్లు సాధించాడు. స్వదేశంలో ఎనిమిది సార్లు, విదేశాల్లో ఎనిమిది సార్లు ఈ ఘనత సాధించాడు. టెస్ట్‌ల్లో పది వికెట్లను ఓసారి స్వదేశంలో, మరోసారి విదేశాల్లో తీసుకున్నాడు.

అంటే ఆనాడు టీమిండియా విజయాలలో ప్రధాన భూమికను పోషించిన స్పిన్‌ చతుష్టయం స్వదేశంలోనే కాదు విదేశాల్లో కూడా సత్తా చూపారని తెలుస్తోంది. ఆరు, ఏడు దశకాల్లో టీమిండియాలో ఈ నలుగురు కీలక సభ్యులు.. స్పిన్‌కు అంతగా అనుకూలించని పిచ్‌లపై కూడా బంతిని అవలీలగా తిప్పేసేవారు. అలాగే మ్యాచ్‌ను కూడా! ప్రసన్న ఇటు స్వదేశంలో, అటు విదేశాల్లో ఇంచుమించు సమాన వికెట్లను తీసుకోగలిగాడు. బేడి కూడా అంతే. చంద్రశేఖర్‌, వెంకట్రాఘవన్‌లు విదేశాల్లో కంటే స్వదేశంలో ఎక్కువ వికెట్లు తీసుకున్నప్పటికీ విదేశీ పిచ్‌లపై వారు కనబర్చిన ప్రతిభ అద్భుతం. 1971లో ఇంగ్లాండ్‌తో ఓవల్‌లో జరిగిన మ్యాచ్‌ను ఓసారి గుర్తుకు తెచ్చుకుందాం. ఆ మ్యాచ్‌లో చంద్రశేఖర్‌ అద్భుతమైన బౌలింగ్‌ను ప్రదర్శించాడు. ఇంగ్లాండ్‌లో టీమిండియా సాధించిన తొలి విజయం అదే! అలాగే 1977లో ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్‌లో జరిగిన మ్యాచ్‌లో కూడా అంతే! ఆసీస్‌ గడ్డపై టీమిండియా సాధించిన తొలి విజయం అదే! వెస్టిండీస్‌లోని కఠినమైన పిచ్‌లపై కూడా వెంకట్రాఘవన్‌ చక్కటి బౌలింగ్‌ను ప్రద్శించాడు. సాధారణంగా వెస్టిండీస్‌ పిచ్‌లు బౌన్సీగా ఉంటాయి. ఫాస్ట్‌ బౌలింగ్‌కు ఎక్కువగా అనుకూలిస్తాయి. అలాంటి చోట కూడా వెంకట్రాఘవన్‌ బంతిని స్పిన్‌ చేయగలిగాడు. వెస్టిండీస్‌లో పర్యటించిన మూడు సార్లు వెంకట్‌ మ్యాజిక్‌ చేశాడు.

ప్రస్తుతం క్రికెట్‌ స్వరూప స్వభావాలు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడంతా స్పీడ్‌.. అందుకే ప్రస్తుత క్రికెటర్లను పాతతరం క్రికెటర్లతో పోల్చడం సరికాదు. లిమిటెడ్‌ ఓవర్ల మ్యాచ్‌లు వచ్చిన తర్వాత ఆ ప్రభావం టెస్ట్‌ క్రికెట్‌పై బాగా పడింది. వన్డే ఇంటర్నేషనల్‌ మ్యాచ్‌ల కంటే ఇప్పుడు టీ-20 మ్యాచ్‌లకే క్రేజ్‌! ఎర్రపల్లి ప్రసన్నకు వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌ ఆడిన అనుభవం అసలు లేదు. చంద్రశేఖర్‌ ఆడింది ఒకే ఒక్క వన్డే. బిషన్‌ సింగ్‌ బేడి 10 వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాడు. వీరందరి కంటే వెంకట్రాఘవనే కాస్త నయం. వెంకట్‌ 15 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. 1975,1979లలో జరిగిన ప్రపంచ కప్‌ పోటీలకు టీమిండియాను లీడ్‌ చేసింది వెంకట్రాఘవనే! బేడి, వెంకట్‌లు వన్డే మ్యాచ్‌లు ఆడినప్పటికీ వాటికి అనుగుణంగా తమ బౌలింగ్‌ స్టయిల్‌ను మార్చుకోవలసిన అవసరం ఏర్పడలేదు. అప్పట్లో టీమిండియాలో స్పిన్నర్లదే ముఖ్య భూమిక. వికెట్లను తీసుకునేది కూడా వారే! ఎందుకంటే మన మీడియం ఫాస్ట్‌ బౌలింగ్‌ చాలా బలహీనంగా ఉండేది. ఇప్పుడు పరిస్థితి మారింది. పిచ్‌ స్వభావాన్ని బట్టి తుది జట్టు ఎంపిక జరుగుతోంది. ఒకప్పుడైతే సిరీస్‌కు సిరీస్‌కు మధ్య బోలెడంత గ్యాప్‌ ఉండేది. క్రికెటర్లకు కావాల్సినంత విరామం లభించేది. కానీ ఇప్పుడలా కాదు. ఏడాది పొడవునా క్రికెట్‌ ఆడాల్సిన అవసరం ఏర్పడింది. ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడం ఆటగాళ్లకు పరీక్షగా మారింది. పైగా ఫీల్డింగ్‌ అనేది ఇప్పుడు ఆటలో అత్యంత కీలకమయ్యింది. ఒకప్పుడంటే బౌలర్ల బాధ్యత కేవలం బౌలింగ్‌ వరకే ఉండేది. వారి నుంచి పరుగులను ఆశించేవారు కాదు.. ఇంతకు ముందు చెప్పిన స్పిన్‌ చతుష్టయంలో ఒక్క బేడికి మాత్రమే ఆఫ్‌ సెంచరీ ఉంది. మరి ఈ తరం బౌలర్లు అయిన అశ్విన్‌, హర్భజన్‌లకు టెస్ట్‌ల్లో సెంచరీలు ఉన్నాయి. మంచి బ్యాట్స్‌మన్‌ అన్న పేరు కూడా ఉంది. మొత్తం మీద ప్రస్తుత స్పిన్నర్లతో పోలిస్తే ఒకప్పటి స్పిన్నర్లు విదేశాల్లో కూడా మెరుగైన ప్రతిభను ప్రదర్శించారు. ఇండియాకు ఎన్నో విజయాలను అందించారు. ప్రస్తుత స్పిన్నర్లు విదేశీ పిచ్‌లపై కూడా రాటుదేలాల్సిన అవసరం ఎంతైనా ఉంది.!

Read Also….  PM Modi: బ్యాంకుల మాదిరిగానే పోస్టాఫీసు ఖాతాల్లోనూ ఆన్‌లైన్ ఫండ్ ట్రాన్స్‌ఫర్: ప్రధాని మోడీ

సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్
కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో