Andhra pradesh: ‘దావోస్ సదస్సుపై టీడీపీది తప్పుడు ప్రచారం’.. అసలు విషయం చెప్పిన ఏపీ ఐటీ శాఖ మంత్రి.
దావోస్‌లో జరుగుతోన్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ తరపున ఎవరూ హాజరుకాకపోవడం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఈ సదస్సుకు ఏపీకి ఆహ్వానం రాలేదని, ఇది ముమ్మాటికీ వైసీపీ అసమర్థతకు నిదర్శనమి టీడీపీ నాయకులు ఓ రేంజ్‌లో..

దావోస్‌లో జరుగుతోన్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ తరపున ఎవరూ హాజరుకాకపోవడం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఈ సదస్సుకు ఏపీకి ఆహ్వానం రాలేదని, ఇది ముమ్మాటికీ వైసీపీ అసమర్థతకు నిదర్శనమి టీడీపీ నాయకులు ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. దీంతో దావోస్ సదస్సుపై అధికార, విపక్షాల మధ్య మాటల మంటలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ నేతల విమర్శలకు తాజాగా ఏపీ ఐటీ శాఖ మంత్రి అమర్‌నాథ్ కౌంటర్ ఇచ్చారు.
వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సుకు వెళ్లకపోవడంపై టీడీపీ చేస్తున్న విమర్శలకు సమాధానం ఇచ్చారు. నవంబర్ 25నే వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుంచి ఆహ్వానం అందిందన్న మంత్రి.. దీనిపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఈ విషయంలో బోండా ఉమ చేసిన విమర్శలపై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి అమర్‌నాథ్. మార్చిలో విశాఖ వేదికగా బిజినెస్ గ్లోబల్ సమ్మిట్ ఉండటం వల్లే అక్కడికి వెళ్లలేదని టీడీపీ కౌంటర్లపై క్లారిటీ ఇచ్చారు మంత్రి.
చంద్రబాబు ప్రభుత్వంలో ఐదేళ్లలో ఐదుసార్లు దావోస్ వెళ్లిన బాబు ఏం తెచ్చారని ప్రశ్నించారు. గతంలో చంద్రబాబు చేసిన బిల్డప్ చూసి జనం ఆశ్చర్యపోయారంటూ సెటైర్లు వేశారు మంత్రి అమర్‌నాథ్. ఇదిలా ఉంటే దావోస్ సమావేశాల్లో ఏపీ బృందం హాజరుకాకపోవడంపై టీడీపీ నాయకుడు బోండా ఉమ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రానికి పెట్టుబడులు రావని జగన్‌కు అర్థంకావడంతోనే వెళ్లలేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ మంత్రి కేటీఆర్, దావోస్‌లో వేలకోట్ల పెట్టుబడులు ఆకర్షిస్తుంటే, ఏపీమంత్రి అమర్ నాథ్ కోడిపందాలు, రికార్డింగ్ డ్యాన్సుల్లో మునిగితేలుతున్నాడని కామెంట్ చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..







