Andhra Pradesh: కన్నా లక్ష్మీనారాయణ దారెటు? ఏపీ బీజేపీలో ఏం జరుగుతోంది?
ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ దారెటు? పార్టీ మారుతారా? ఏలూరులో పార్టీ రాష్ట్రకార్యవర్గ సమావేశాలు జరుగుతుంటే ఆయన హైదరాబాద్‌లో ఎందుకున్నారు?
ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ దారెటు? పార్టీ మారుతారా? ఏలూరులో పార్టీ రాష్ట్రకార్యవర్గ సమావేశాలు జరుగుతుంటే ఆయన హైదరాబాద్‌లో ఎందుకున్నారు? అదే టైమ్‌లో ఆయన వర్గమంతా రాజీనామాల అస్త్రం ఎందుకు ప్రయోగించింది? ఏపీ బీజేపీలో ఏం జరుగుతోంది? ఇంట్రస్టింగ్ స్టోరీ మీకోసం..
కన్నా లక్ష్మీనారాయణ పార్టీ మారుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈనెల 26న ఆయన జనసేన తీర్థం పుచ్చుకుంటారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. దానికి తోడు ఆయన రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి హాజరు కాకపోవడం కూడా కొంత అనుమానాలకు తావిస్తోంది. అయితే తాను వ్యక్తిగత కారణాల వల్లే.. హైదరాబాద్ లో ఉన్నాననీ.. సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు చెబుతానంటూ ఆ సస్పెన్స్‌ను కంటిన్యూ చేస్తున్నారు కన్నా. అయితే కన్నా పార్టీ మారే విషయంపై ఆచితూచి స్పందించారు పవన్. ఇక కన్నా పార్టీ మారుతారనే వార్తలను ఏపీ బీజేపీ ఖండించింది. కేవలం ఆయన వ్యక్తిగత కారణాలతో హైదరాబాద్ లో ఉన్నారనీ.. ఈ కారణం వల్లే కార్యవర్గ సమావేశాలకు దూరంగా ఉన్నరని చెబుతున్నారు నేతలు.
అటు ఏపీ కమలంలో ముసలం ముదురుతోంది. రచ్చ పీక్ స్టేజ్‌కు చేరినట్లే కనిపిస్తోంది. సోమువీర్రాజు వర్సెస్ కన్నా లక్ష్మీనారాయణ అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి. ఇప్పటికే నేతలు రెండుగా విడిపోయారు. పల్నాడు జిల్లా పెదకూరపాడులో ప్రత్యేకంగా సమావేశమైన కన్నా వర్గం.. సోము తీరుపై సంచలన ఆరోపణలు చేసింది..మొత్తం 120 మంది నేతలు, కార్యకర్తలు పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన వారిలో.. బీజేపీ పల్నాడు జిల్లా మాజీ అధ్యక్షుడు కర్ణా సైదారావు, పెదకూరపాడు ఇంఛార్జ్ గంధం కోటేశ్వరరావు ఉన్నారు.
సోము బీజేపీని వైసీపీకి తాకట్టు పెట్టారని ఆరోపించింది కన్నా వర్గం. కన్నా వర్గమనే తమను రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు కూడా పిలువలేదని ఆరోపించారు. ఆస్తులను పెంచుకోవడమే లక్ష్యంగా సోము పనిచేస్తున్నారని ఆరోపించారు. మిత్రపక్షమైన జనసేన అధినేత చిత్ర పటానికి పూల మాలలు వేసినా వ్యతిరేకించారని విమర్శించారు. పార్టీలోని పరిణామాలను సునీల్ ధియోదర్ దృష్టికి తీసుకెళ్లినా.. ఎలాంటి చర్యలు తీసుకోలేదనన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..