Andhra Pradesh: పొత్తులపై పవన్‌ నోట న్యూ ఆప్షన్‌.. కొత్త పొత్తు అంటే ఆ పార్టీతోనేనా?

రాజకీయ మిత్రులు. కొత్త కొత్త ఆప్షన్లు. ఏపీలో జనసేన, బీజేపీ వ్యూహాలు పొలిటికల్‌ కాక రేపుతున్నాయి. జనంతోనే పొత్తు ఉంటుందని బీజేపీ నిర్ణయిస్తే, అవసరమైతే కొత్త పొత్తు పెట్టుకుంటామని ప్రకటించారు

Andhra Pradesh: పొత్తులపై పవన్‌ నోట న్యూ ఆప్షన్‌.. కొత్త పొత్తు అంటే ఆ పార్టీతోనేనా?
Janasena Pawan Kalyan
Follow us
Shiva Prajapati

|

Updated on: Jan 24, 2023 | 9:08 PM

రాజకీయ మిత్రులు. కొత్త కొత్త ఆప్షన్లు. ఏపీలో జనసేన, బీజేపీ వ్యూహాలు పొలిటికల్‌ కాక రేపుతున్నాయి. జనంతోనే పొత్తు ఉంటుందని బీజేపీ నిర్ణయిస్తే, అవసరమైతే కొత్త పొత్తు పెట్టుకుంటామని ప్రకటించారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌. ఇప్పటికీ మిత్రులుగానే ఉన్న బీజేపీ, జనసేన భిన్నమైన ప్రకటనలు కొత్త పొత్తులకు దారితీస్తాయా.

ఏపీలో పొత్తు రాజకీయం మహారంజుగా సాగుతోంది. కొండగట్టు అంజన్న సాక్షిగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలు, భీమవరంలో బీజేపీ రాజకీయ తీర్మానం పూర్తి భిన్నంగా ఉండటం పొలిటికల్‌ హైటెన్షన్‌ను క్రియేట్‌ చేస్తోంది. బీజేపీ కాదంటే ఒంటరి పోరు, అదీ కాకపోతే కొత్త పొత్తు అంటూ టీవీ9తో ఎక్స్‌క్లూజివ్‌గా చెప్పారు పవన్‌ కల్యాణ్‌. గతంలో చెప్పిన ఆప్షన్లకు భిన్నంగా సరికొత్త ఆప్షన్‌ను ప్రకటించారాయన.

గతంలోనే మూడు ఆప్షన్లు ఇచ్చారు పవన్‌. బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయడం లేదంటే జనసేన ఒంటరి పోరు, అదీ కాకపోతే 2014 తరహాలో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని ఆప్షన్లు ఇచ్చారు. ఇప్పుడు మాత్రం ఆ ఆప్షన్లకు భిన్నంగా ప్రకటన చేశారు.

ఇవి కూడా చదవండి

కొండగట్టులో పవన్‌ ఆసక్తికర ప్రకటన చేస్తే భీమవరంలో బీజేపీ చేసిన రాజకీయ తీర్మానం మరింత కాక రేపుతోంది. పార్టీ కార్యకవర్గ సమావేశాల్లో పెట్టిన రాజకీయ తీర్మానంలో ఎక్కడా జనసేన పేరు లేదు. వైసీపీ, టీడీపీ అవినీతి, వారసత్వ రాజకీయాలకు దూరంగా ఉండాలని రాజకీయ తీర్మానం పెట్టారు. ఆ రెండు పార్టీలు కాకుండా భావసారూప్యత ఉన్న పార్టీలతో మాత్రమే ముందుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. జనసేనతో పొత్తు ఉంటుందని, ఆ పార్టీతో కలిసి వెళ్తామని ఎక్కడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు సోము వీర్రాజు. మరోవైపు రాజకీయాల్లో బలవంతపు పొత్తులు ఉండవన్నారు ఎంపీ జీవీఎల్‌. బీజేపీ ప్రకటన ఇలా ఉంటే గతానికి భిన్నంగా కొత్త పొత్తు అంటూ పవన్‌ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి. అంటే టీడీపీతో పొత్తు పెట్టుకుంటారా? అనేది ఆసక్తిగా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..