Minister Jogi Ramesh: తెలుగు రాష్ట్రాల్లో జోరుగా కూల్చివేతలపై రాజకీయాలు.. కేసీఆర్ కేంద్రపై ఆరోపణలు.. మాకు సమాచారం లేదంటున్న వైసీపీ నేతలు
కేంద్ర ప్రభుత్వం ఏపీలో జగన్ సర్కార్ ను కూల్చివేసే దిశగా పావులు పడుపుతోందంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఇదే విషయపై ఆంధ్రప్రదేశ్ మంత్రి జోగి రమేష్ స్పందిస్తూ.. తమ కూల్చివేతపై ఎటువంటి సమాచారం లేదని.. ఒకవేళ ఏదైనా అటువంటి ప్రయత్నాలు జరుగుత్న్నట్లు తెలిస్తే,, తాము బహిరంగంగా ప్రకటిస్తామని పేర్కొన్నారు.
అసెంబ్లీ ఎన్నికలు ఏడాది ముందుగానే తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు వేడెక్కాయి. అధికార ప్రతిపక్షాల నేతలు మాటల యుద్ధాన్ని ఓ రేంజ్ లో చేసుకుంటున్నారు. అగ్గికి ఆజ్యం పోసినట్లు ఇప్పడు తెలంగాణ సీఎం కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాన్ని కూల్చివేసే దిశగా కేంద్ర పావులు కదుపుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఇదే విషయంపై ఆంధ్రప్రదేశ్ మంత్రి జోగి రమేష్ స్పందించారు. మాకు ఇప్పటి వరకూ ఎటువంటి సమాచారం అందలేని.. ఒకవేళ కూల్చివేతపై సమాచారం అందిస్తే.. అందరికీ తెలుపుతామని చెప్పారు. అంతేకాదు తాజాగా ఇప్పటం గ్రామంలో కూల్చివేతలపై కూడా కూడా వైసీపీ నేతలు స్పందించారు.
ఇప్పటంలో ఒక్క ఇల్లూ కూల్చలేదు
చంద్రబాబు- పవన్ కల్యాణ్ కుట్ర రాజకీయాల్లో భాగంగానే రెక్కీ అంటూ డైలీ సీరియల్ రాజకీయాలు నడుపుతున్నారని మంత్రి జోగి రమేష్ తీవ్ర విమర్శలు చేశారు. అసలు ఇప్పటం గ్రామంలో అసలు ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది అనే దానిపై రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలియచేయాల్సిన బాధ్యత మా మీద ఉందన్నారు. ఇప్పటం గ్రామంలో రహదారి మొదటి విడత విస్తరణ పనులు కూడా ఏప్రిల్-మే నెలల్లోనే ప్రారంభించారని స్వయంగా ఆ గ్రామస్థులు చెప్పారని పేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకూ ఇప్పటం గ్రామంలో ఒక్క ఇల్లును కూడా కూల్చిన దాఖలాలు లేనేలేవు. ఆ గ్రామంలో రోడ్డు విస్తరణలో, డ్రైనేజ్ పనుల్లో భాగంగా అడ్డం వచ్చిన చిన్నచిన్న ఆక్రమణలను, ప్రహరీ గోడలను తొలగించడం జరిగిందన్నారు. రోడ్డు విస్తరణ వల్ల తమ గ్రామం అభివృద్ధి చెందుతోందని, తమ ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయని గ్రామస్తులంతా ఆనందంగా, సంతోషంగా ఉన్నారని చెప్పారు.
మళ్ళీ విగ్రహాలు ప్రతిష్టిస్తాం:
ఇప్పటంలోని మహాత్మగాంధీ, ఇందిరాగాంధీ విగ్రహాలను భద్రపరిచి మళ్లీ ప్రతిష్టిస్తామని తెలిపారు. ఆక్రమణల తొలగింపులో భాగంగా రాజశేఖర రెడ్డి విగ్రహం దిమ్మెను కూడా పగులగొట్టారు. వాస్తవాలను వక్రీకరిస్తూ పవన్ కల్యాణ్, చంద్రబాబు దుష్ప్రచారాలు చేస్తున్నారు. ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని తెలిపారు.
పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు
గతం మరచి బాబు మాట్లాడుతున్నారని.. అసలు పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో పోటీచేసిన భీమవరం, గాజువాకల్లో రెండుచోట్ల గెలవలేదు.. ఎమ్మెల్యే సీటు కూడా దక్కించుకోని వ్యక్తి.. ఇప్పడు ప్రభుత్వంపై సవాల్ చేయడం విడ్డురం అంటూ ఎద్దేవా చేశారు. ఇప్పటంలో అన్నివర్గాల ప్రజలు ప్రభుత్వానికి సహకరిస్తున్నారు.. వారిని రెచ్చగొట్టవద్దంటూ ప్రతిపక్ష నేతలకు హితవు పలికారు. పవన్ పై అసలు రెక్కీనే జరగలేదని తెలంగాణ పోలీసులే తేల్చి చెప్పారు.. వారం మొదట్లో హైదరాబాద్ లో సినిమాలు చేసుకుంటూ.. వీకెండ్స్ లో ఆంధ్రాకు వచ్చి ప్రజలను రెచ్చగొట్టే రాజకీయాలు చేస్తారని ఎద్దేవా చేశారు మంత్రి జోగి రమేష్.
నెక్స్ట్ ఎన్నికలల్లో గెలుపు మాదే అంటూ ధీమా
జగన్ గారి ప్రభుత్వాన్ని ఇంచి కూడా కదిలించలేరు.. మళ్ళీ సీఎం జగన్ రాసిపెట్టుకోమన్నారు. తెలుగుదేశం జనసేన పార్టీలు రహస్యంగా పొత్తు పెట్టుకున్నారని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను విఘాతం కలిగించేలా పవన్ ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రజా సమస్యలపై పోరాడితే మంచిదే కానీ, మా ప్రభుత్వాన్ని, మా జగన్ ప్రజల నుంచి ఎవరూ వేరు చేయలేరని .. పవన్ భరతం పట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని.. ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్న వ్యక్తిని ఎదుర్కొవాలంటే పవన్ , చంద్రబాబు తలకిందులుగా తపస్సు చేసినా సాధ్యపడదని తేల్చి చెప్పేశారు. టీడీపీ, జనసేన రెండు పార్టీలు కలిసి వచ్చినా, విడివిడిగా పోటీ చేసినా నెక్స్ట్ సీఎం జగన్ అని.. పవన్ కళ్యాణ్ మళ్ళీ ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు మంత్రి జోగి రమేష్.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..