Andhra Pradesh: మునుగోడులో ఆ అభ్యర్థిలా పవన్ కళ్యాణ్ వైఖరి.. జనసేనానిపై ఘాటు వ్యాఖ్యలు చేసిన కొడాలి నాని

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ, జనసేన మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా గుంటూరు జిల్లాలోని ఇప్పటం గ్రామంలో రహదారి విస్తరణ పేరుతో ఇళ్లను కూల్చడం ఈ రెండు పార్టీల మధ్య మరింత రాజకీయ రాచ్చను రాజేసింది. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్వయంగా ఇప్పటం గ్రామం వెళ్లి..

Andhra Pradesh: మునుగోడులో ఆ అభ్యర్థిలా పవన్ కళ్యాణ్ వైఖరి.. జనసేనానిపై ఘాటు వ్యాఖ్యలు చేసిన కొడాలి నాని
Kodali Nani
Follow us

|

Updated on: Nov 05, 2022 | 5:46 PM

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ, జనసేన మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా గుంటూరు జిల్లాలోని ఇప్పటం గ్రామంలో రహదారి విస్తరణ పేరుతో ఇళ్లను కూల్చడం ఈ రెండు పార్టీల మధ్య మరింత రాజకీయ రాచ్చను రాజేసింది. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్వయంగా ఇప్పటం గ్రామం వెళ్లి బాధితులను పరామర్శించారు. దీంతో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర సీనియర్ నేతలు పవన్ కళ్యాణ్ పై మండిపడ్డారు. ఇప్పటం గ్రామ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటుంటే పవన్ కళ్యాణ్ అడ్డుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) గుడివాడలో మీడియాతో మాట్లాడుతూ.. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పొలిటికల్ టూరిస్టులుగా తయారయ్యారన్నారు. ప్రజల తరపున పోరాడటానికి సమస్యలు ఏమి లేక తమ సొంత సమస్యలను ఎత్తి చూపుతూ ఇద్దరు నాయకులు రాజకీయ ప్రయోజనం పొందాలనుకుంటున్నారని ఆరోపించారు. మునుగోడులో ప్రజాశాంతి పార్టీ అభ్యర్థి కేఏ పాల్ మాదిరి, ఇప్పటంలో పవన్ కళ్యాణ్ కామెడీ చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. విమానం దిగి ఉరుకులు పరుగుల మీద ఇప్పటం వచ్చిన పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయోజనాల కోసం అల్లరి చేశారని విమర్శించారు. 90 శాతం ఇప్పటం గ్రామస్తులు గ్రామ అభివృద్ధిని కోరుకుంటున్నారని కొడాలి నాని పేర్కొన్నారు. 600 ఇళ్లు ఉన్న గ్రామానికి 120 అడుగుల రోడ్లు ఎందుకుని ప్రశ్నిస్తున్నారని, అభివృద్ధిని అడ్డుకోవడమే ఆ ఇద్దరికి తెలిసిన విద్య అని అన్నారు. ఇద్దరు వ్యక్తులు తాగి న్యూసెన్స్ చేస్తే రెక్కిగా భావించి రాద్దాంతం చేశారని, రాజకీయంగా జగన్ ను ఎదుర్కోలేక పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కలిసి నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు.

గతంలో పవన్ కళ్యాణ్ విశాఖపట్టణంలో నానా హంగామా చేశారుని, ఇప్పుడు ఇప్పటం వెళ్లి మరోసారి పవన్‌ హంగామా చేశారని కొడాలి నాని విమర్శించారు. ఏదైనా సమస్య ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. రాష్ట్రంలో సంక్షేమ పాలన కొనసాగుతుంటే టీడీపీకి నిద్రపట్టడం లేదన్నారు. మునుగోడులో కేఏ పాల్ పరుగులు పెట్టినట్లు ఇప్పటంలో పవన్ పరుగులు తీశారన్నారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలు లేవన్నారు. లేని సమస్యలను పవన్‌ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు సృష్టిస్తున్నారని కొడాలి నాని విమర్శించారు. వారిద్దరూ వాళ్ల సమస్యలతోనే సతమతమవుతున్నారని ఆరోపించారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిసి మాట్లాడుతున్నారో, తెలియక మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. డీజిల్, గ్యాస్ రేట్లను రాష్ట్ర ప్రభుత్వం పెంచుతుందా అన్ని ప్రశ్నించారు. ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తూ.. ప్రజలను చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తప్పుదోవ పట్టిస్తున్నారని కొడాలి నాని విమర్శించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..