Konaseema Tension Highlights: అమలాపురంలో విధ్వంసం.. మంత్రి, ఎమ్మెల్యే ఇంటికి నిప్పు..!

|

Updated on: May 24, 2022 | 10:02 PM

Konaseema Tension Live: ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే కోనసీమ రణ క్షేత్రంగా మారింది. ప్రజలందరూ రోడ్లపైకి వచ్చి.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Konaseema Tension Highlights: అమలాపురంలో విధ్వంసం.. మంత్రి, ఎమ్మెల్యే ఇంటికి నిప్పు..!
Amalapuram

Konaseema Tension Highlights: ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే కోనసీమ రణ క్షేత్రంగా మారింది. ప్రజలందరూ రోడ్లపైకి వచ్చి.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనంతటికీ కారణం.. జిల్లా పేరు మార్చడమే. అవును.. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సర్కార్.. కోనసీమ జిల్లాను ఏర్పాటు చేసింది. అంతా సవ్యంగా ఉన్న క్రమంలో.. కోనసీమ జిల్లా పేరును బీఆర్ అంబేద్కర్ జిల్లాగా మారుస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఇదే కోనసీమ వాసులకు ఆగ్రహం తెప్పింది. కోనసీమ నే ముద్దు.. మరే పేరు వద్దు అంటూ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కోనసీమ సాధన సమితి గళమెత్తింది. ఈ క్రమంలో భారీ ర్యాలీకి పిలుపునిచ్చింది.వందల సంఖ్యలో జనాలు తరలిరావడంతో పరిస్థితి అదుపు తప్పింది. కలెక్టరేట్‌ ముట్టడికి యువకులు, నిరసనకారులు ప్రయత్నించారు. కోనసీమ సాధన సమితి పిలుపు నేపథ్యంలో పోలీసులు అమలాపురం వ్యాప్తంగా 144 విధించారు. అమలాపురం మొత్తాన్ని అష్టదిగ్భంధనం చేశారు. అయినప్పటికీ వెనక్కి తగ్గలేదు నిరసనకారులు. ఒక దశలో పోలీసులతో తీవ్ర ఘర్షణకు దిగిన ఆందోళనకారులు.. వారిపై రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో 20 మందికిపైగా పోలీసులు గాయపడ్డారు. ఆ తరువాత పోలీసులను తప్పించుకుని వచ్చిన ఆందోళనకారులు.. కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన టెంట్‌ ను ధ్వంసం చేశారు. కలెక్టర్ రేట్ ఎదుట ఒక బస్సును దగ్ధం చేశారు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 24 May 2022 09:52 PM (IST)

    అదృశ్య శక్తులందరినీ బయటకు లాగుతాం.. డీఐజీ పాలరాజు సీరియస్ వార్నింగ్..

    అమలాపురంలో ఇప్పుడు పరిస్థితి మధ్యలో ఉన్నామని, రాత్రి వరకు ఏ సమస్య లేకుండా చూస్తామని డీఐజీ పాలరాజు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణకై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అమలాపురంలో అదనపు బలగాలను మోహరించామని చెప్పారు. అమలాపురం పరిసర ప్రాంతాల్లో కరెంట్ తీసేశారని, ఈ ప్రాంతం అంతా చీకటిగా ఉందన్నారు. ప్రస్తుతం ఫైరింజన్లు మంటలను ఆర్పుతున్నాయని చెప్పారు. కొంతమంది ఆందోళనకారుల దాడుల్లో గాయపడిన పోలీసులకు ప్రాణాపాయం ఏమీ లేదని డీఐజీ తెలిపారు. గాయాలపాలైన పోలీసులు ప్రస్తుతం బాగానే ఉన్నారని చెప్పారు. ప్రస్తుతం అమలాపురంలో 600 మంది పోలీసులు విధుల్లో ఉన్నారని చెప్పారు. కాగా, ప్రజలంతా సంయమనం పాటించాలని డీఐజీ పాలరాజు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హింసాత్మక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఆందోళనకారులపై చర్యలు తీసుకుంటామన్న ఆయన.. ఇప్పటికే కొందరిని గుర్తించామన్నారు. సీసీ ఫుటేజీల ద్వారా ఆందోళనకారులను గుర్తిస్తామని చెప్పారు. ఈ ఘటన వెనుక ఏయే శక్తులు ఉన్నాయే అందరినీ బయటకు తీస్తామని, దాడులకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఐజీ స్పష్టం చేశారు.

  • 24 May 2022 09:09 PM (IST)

    ఆ ఆందోళనలో మా పార్టీ శ్రేణులు లేరు: సోము వీర్రాజు

    అమలాపురం ఆందోళనలు బాధాకరం అని, ఆ దాడులను ఖండిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. అమలాపురం ఆందోళనలో బీజేపీ శ్రేణులు పాల్గొనలేదన్నారు. అమలాపురంలో ప్రశాంత వాతావరణం ఏర్పడటానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. జరిగిన సంఘటలను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. కోనసీమలో కారణమైన పరిస్థితులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు సోము వీర్రాజు.

  • 24 May 2022 09:06 PM (IST)

    ‘కోనసీమలో ఘర్షణలు దురదృష్టకరం’.. దాడులను ఖండించిన చంద్రబాబు..

    అమలాపురంలో దాడులను టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. ప్రశాంతంగా ఉండే కోనసీమ ప్రాంతంలో ఘర్షణలు దురదృష్టకరం అని అన్నారు. కోనసీమ ప్రజలు సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. ప్రశాంతమైన కోనసీమలో హింసాత్మక ఘటనలు జరుగడం బాధాకరం అని పేర్కొన్నారు చంద్రబాబు. సున్నితమైన అంశంలో హోంమంత్రి వనిత.. టీడీపీపై నిరాధార ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు చంద్రబాబు. ఇది ముమ్మాటికీ పోలీసులు, ప్రభుత్వ వైఫల్యమేనని విమర్శించారు. కోనసీమలో ప్రశాంత నెలకొనేలా ప్రజలంతా సహకరించాలని చంద్రబాబు కోరారు.

  • 24 May 2022 08:10 PM (IST)

    అమలాపురం దాడులను ఖండించిన పవన్ కల్యాణ్..

    అమలాపురం దాడులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. అమలాపురం దాడులను ఆయన ఖండించారు. ప్రజలంతా సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం విఫలమైందని పవన్ కల్యాణ్ ఆరోపించారు. పాలనా పరమైన లోపాలను కప్పిపుచ్చుకునేందుకు ఈ ఘర్షణలను ఇతర పార్టీలకు ఆపాదిస్తున్నారని పవన్ విమర్శించారు. ఉద్రిక్త పరిస్థితులకు బీజంవేసిందెవరో ప్రజలకు తెలుసునని అన్నారు. ఈ గొడవలు చేసేది జనసేనేనన్న హోంమంత్రి ప్రకటనను ఖండిస్తున్నానని అన్నారు.

  • 24 May 2022 08:07 PM (IST)

    విధ్వంసం వెనుక టీడీపీ, జనసేన: ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్

    అమలాపురంలో విధ్వంసం బాధాకరం అని అన్నారు పిల్లి సుభాష్ చంద్రబోస్. ఈ విధ్వంసం వెనుక టీడీపీ, జనసేన పార్టీలు ఉన్నాయని ఆరోపించారు. ఈ దాడులు వందశాతం విపక్షాల కుట్రే అని ఆరోపించారు. కోనసీమ పేరును తొలగించలేదని, అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చామని ఎంపీ బోస్ పేర్కొన్నారు. విద్వేషాలు రెచ్చగొట్టడం బాధాకరం అన్నారు. అంబేద్కర్ లాంటి మహనీయుడిని రాజకీయాల్లోకి లాగడం సరికాదన్నారు. పచ్చగా ఉన్న కోనసీమలో విద్వేషాలు వద్దు అని కోరారు ఎంపీ బోస్. కోనసీమ ప్రజల అభీష్టం మేరకే అంబేద్కర్ పేరు పెట్టామని చెప్పారు. అంబేద్కర్ పేరును కోనసీమ జిల్లాకు పెట్టుకోవడం అదృష్టం అన్నారు. విపక్షాలు కూడా అంబేద్కర్ పేరుకు మద్ధతు పలికాయని అన్నారు. చంద్రబాబు, పవన్ కూడా ఆ పేరును కోరారని అన్నారు.

  • 24 May 2022 08:03 PM (IST)

    అమలాపురం చేరుకున్న డీఐజీ పాల్ రాజ్..

    అమలాపురంలో విధ్వంసం కొనసాగుతోంది. ఇంకా రోడ్లపైనే వేలాదిమంది నిరసనకారులు ఉన్నారు. విధ్వంసం నేపథ్యంలో ఉద్రిక్తలను తగ్గించేందుకు పోలీసులు 144 సెక్షన్ విధించారు. మరోవైపు డీఐజీ పాల్‌రాజ్ అమలాపురం చేరుకున్నారు.

  • 24 May 2022 08:02 PM (IST)

    మంత్రి విశ్వరూప్ మరో ఇంటికి నిప్పు.. కొనసాగుతున్న విధ్వంసం..

    అమలాపురంలో విధ్వంసకాండ కొనసాగుతోంది. టెన్షన్‌ను తగ్గించేందుకు 144 సెక్షన్ అమలు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోతోంది. అమలాపురంలో మంత్రి విశ్వరూప్ కొత్తగా నిర్మిస్తున్న ఇంటికి సైతం నిప్పు పెట్టారు ఆందోళనకారులు.

  • 24 May 2022 07:57 PM (IST)

    విధ్వంసం వెనుక పెద్ద కుట్ర ఉంది: ఎమ్మెల్యే సతీష్

    అమలాపురం ఉద్రిక్తతలపై ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ స్పందించారు. దాడులు ఉద్దేశపూర్వకంగానే చేశారని ఆరోపించారు. దాడులు చేసింది యువకులు కాదని, విధ్వంసం వెనుక పెద్ద కుట్ర ఉందని ఎమ్మెల్యే ఆరోపించారు. ఘటనపై విచారణ చేసి నిందితులను బయటకు లాగుతామన్నారు.

  • 24 May 2022 06:55 PM (IST)

    ఆందోళన విరమించాలని పోలీసుల వార్నింగ్.. గాల్లోకి ఫైరింగ్..

    అమలాపురంలో ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. ఆందోళనకారులు మరింత రెచ్చిపోతున్నారు. ఆందోళనకారులను అదుపుచేయలేని స్థితిలోకి నిరసన కార్యక్రమాలు ఉన్నాయి. ఆందోళనకారులు భీకరమైన విధ్వంసం సృష్టిస్తున్నారు. నిరసనకారుల దాడుల్లో ఎస్పీ సహా 20 మంది పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. 3 ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేశారు. 2 ప్రైవేటు బస్సులకు నిప్పు పెట్టారు. జిల్లా పేరు మార్పును వ్యతిరేకిస్తూ స్థానిక మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇళ్లపైనా దాడులు చేశారు ఆందోళనకారులు. మొదట మంత్రి విశ్వరూప్ ఇంటిపై అటాక్ చేసిన నిరసనకారులు.. ఆయన ఇంటికి నిప్పు పెట్టారు. దాంతో ఆయన ఇల్లు మొత్తం అగ్నికి ఆహుతైంది. ఆ తరువాత ఎమ్మెల్యే సతీష్ ఇంటిపై అటాక్ చేసిన ఆందోళనకారులు.. ఆయన ఇంటికి కూడా నిప్పు అంటించారు. ఎమ్మెల్యే ఇంటి పర్నీచర్‌ను ధ్వంసం చేశారు. పరిస్థితి ఎంతకీ కంట్రోల్‌లోకి రాకపోవడంతో పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకోవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా మొదటి హెచ్చరిక కింద ఉన్నపళంగా ఆందోళనలు విరమించాలని ఆందోళనకారులను ఆదేశించారు. లేదంటే కాల్పులు జరపాల్సి వస్తుందంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు గాల్లోకి కాల్పులు జరిపారు పోలీసులు.

  • 24 May 2022 06:39 PM (IST)

    ఎమ్మెల్యే సతీష్ ఇంటికీ నిప్పు పెట్టిన నిరసనకారులు..

    అమలాపురంలో లా అండర్ ఆర్డర్ అదుపు తప్పింది. ఇప్పటికే మంత్రి ఇంటికి నిప్పు పెట్టిన ఆందోళనకారులు.. ఇప్పుడు ఎమ్మెల్యే ఇంటిపై అటాక్ చేశారు. కోనసీమ జిల్లా వైసీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇంటికి నిప్పు పెట్టారు ఆందోళనాకరులు. అలర్ట్ అయిన పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. దాంతో బెదిరిపోయిన ఆందోళనకారులు అక్కడి నుంచి చెదిరిపోయారు.

  • 24 May 2022 06:22 PM (IST)

    అంబేద్కర్ పేరును వ్యతిరేకించడం సరికాదు..

    అమలాపురం జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడాన్ని వ్యతిరేకించడం ఏమాత్రం సరికాదని రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత అన్నారు. అల్లర్లలో 20 మందిపోలీసులు గాయపడ్డారని అన్నారు. అంబేద్కర్ పేరు పెట్టినందుకు గర్వపడాలని అన్నారు.

  • 24 May 2022 06:14 PM (IST)

    చేతులు జోడించి వేడుకుంటున్నా..

    అమలాపురంలో ఉద్రిక్తతలపై మంత్రి విశ్వరూప్ స్పందించారు. ‘చేతులు జోడించి వేడుకుంటున్నా.. సంయమనం పాటించాలి.’ అంటూ ఆందోళనకారులకు విజ్ఞప్తి చేశారు మంత్రి విశ్వరూప్. అందరూ శాంతించాలని కోరారు. పేరు మార్పుపై ఏవైనా అభ్యంతరాలుంటే చెప్పాలని, పరిశీలిస్తామని చెప్పారు మంత్రి. తన ఇంటిని తలగబెట్టడం దురదృష్టకరం అన్నారు మంత్రి విశ్వరూప్. అంబేద్కర్ పేరు పెట్టినందుకకు అందరూ గర్వపడాల్సిన అవసరం ఉందన్నారు. కొన్న రాజకీయ క్షుద్ర శక్తులు యువతను రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్నారని తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు మంత్రి విశ్వరూప్.

  • 24 May 2022 06:11 PM (IST)

    ‘ఏ శక్తులు కుట్రలు పన్నాయో.. ప్రజలు సంయమనం పాటించాలి..’

    అమలాపురం ఉద్రిక్తతపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. కోనసీమ పేరు మార్పునకు ప్రధాన పార్టీలన్నీ మద్ధతు పలికాయని, రాత్రికి రాత్రే తీసుకున్న నిర్ణయం కాదని సజ్జల పేర్కొన్నారు. ఏ శక్తులు కుట్ర పన్నాయో తెలియడం లేదన్నారు. శాంతి భద్రతల సమస్య లేకుండా చూస్తామని సజ్జల పేర్కొన్నారు. ప్రజలు సంయమనం పాటించాలని సజ్జల పిలుపునిచ్చారు. అంబేద్కర్ పేరు పెడితే పార్టీకి లాభం ఉటుందా? అంబేద్కర్‌ ఏ వర్గానికో చెందని వ్యక్తి కాదని అన్నారాయన. రాజకీయ ప్రయోజనాల కోసమే విపక్షాలు కుట్ర చేస్తున్నాయని ధ్వజమెత్తారు.

  • 24 May 2022 05:55 PM (IST)

    మంత్రి విశ్వరూప్ ఇంటికి నిప్పు పెట్టిన ఆందోళనకారులు..

    అమలాపురం పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. మంత్రి విశ్వరూప్ ఇంటిపై ఆందోళనకారులు దాడి చేశారు. ఆయన ఇంటికి నిప్పు పెట్టారు. కామనగరువులోని విశ్వరూప్ క్యాంప్ కార్యాలయంపైనా దాడి చేశారు. విశ్వరూప్ ఇంటి సమీపంలో 3 ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేశారు ఆందోళనకారులు.

  • 24 May 2022 05:52 PM (IST)

    మంత్రి విశ్వరూప్ ఇంటిపై దాడి..

    కోనసీమ జిల్లా పేరు మార్పు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీస్తోంది. కోనసీమ జిల్లా పేరు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు చేపట్టిన నిరసన కార్యక్రమం తీవ్రరూపం దాల్చింది. ఇప్పటికే పోలీసులపై దాడులు చేసిన వీరు.. ఇప్పుడు మంత్రి విశ్వరూప్ ఇంటివైపు దూసుకెళ్లారు. మంత్రి విశ్వరూప్ ఇంటిపై దాడి చేశారు.

  • 24 May 2022 05:50 PM (IST)

    ఎస్సీ సుబ్బారెడ్డిపై మరోసారి రాళ్ల దాడి..

    అమలాపురం ఎస్పీ సుబ్బారెడ్డిపై ఆందోళనకారులు మరోసారి రాళ్లతో దాడులకు తెగబడ్డారు. ఈ దాడిలో ఎస్పీ సుబ్బారెడ్డి తలకు తీవ్రగాయాలు అయ్యాయి.

  • 24 May 2022 05:42 PM (IST)

    సొమ్ము సిల్లి పడిపోయిన అమలాపురం డిఎస్పీ...

    అమలాపురం జిల్లాకు కోనసీమ పేరునే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ కోనసీమ సాధన సమితి చేపట్టిన నిరసన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులు రాళ్లతో దాడులకు పాల్పడగా.. ఆ దాడుల్లో 20 మందికి పైగా పోలీసులు గాయపడ్డారు. ఈ దాడిలో అమలాపురం డీఎస్పీ సొమ్మసిల్లిపడిపోయారు.

  • 24 May 2022 05:36 PM (IST)

    అమలాపురం ఉద్రిక్తతపై స్పందించిన బీజేపీ నేత మాధవ్..

    కోనసీమ జిల్లాలో కొనసాగుతున్న ఉద్రిక్తతపై బిజెపి ఎమ్మెల్సీ మాధవ్ స్పందించారు. అంబేద్కర్ పేరుని పేరుని వైసీపీ ప్రభుత్వ వివాదంలోకి లాగిందని విమర్శించారు. అమలాపురానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టడంతో వివాదం చెలరేగడం దురదృష్టకరం అని అన్నారు. అంబేద్కర్ ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తి కాదని, ప్రపంచ వ్యాప్తంగా అణగారిన వర్గాల దిక్సూచి అని పేర్కొన్నారు. ఒక జిల్లాకు ఆయన పేరు పెట్టడం ద్వారా మనకు వచ్చే లాభం ఏంటో ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలని సూచించారు. లేని వివాదాన్ని అనవసరంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుందన్నారు. వర్గ విభేదాలు లేకుండా ఆలోచించి చేయాలని సూచిస్తున్నారు.

Published On - May 24,2022 5:31 PM

Follow us
భక్తి గుండెల్లో ఉండాలి.. ఈ సారి అదే రిపీట్‌ అవుతుంది: సీఎం రేవంత్
భక్తి గుండెల్లో ఉండాలి.. ఈ సారి అదే రిపీట్‌ అవుతుంది: సీఎం రేవంత్
20 రోజులకే ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ అయ్యేది ఇక్కడే
20 రోజులకే ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ అయ్యేది ఇక్కడే
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
కేటీఆర్ పర్యటనకు డుమ్మా కొట్టిన వరంగల్ మేయర్..!
కేటీఆర్ పర్యటనకు డుమ్మా కొట్టిన వరంగల్ మేయర్..!
లగేజ్‌లో నూడుల్స్ ప్యాకెట్.... అనుమానంతో ఓపెన్ చేయగా..
లగేజ్‌లో నూడుల్స్ ప్యాకెట్.... అనుమానంతో ఓపెన్ చేయగా..