Tirumala :తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. వారికి ప్రత్యేక దర్శన టికెట్లు..! కోటా విడుదల

ఇంకా, ఆగస్టు నెల‌కు సంబంధించిన గ‌దుల కోటా మే 26వ తేదీ ఉద‌యం 9 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది టీటీడీ. భ‌క్తులు ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించి సేవా టికెట్లు పొందాల్సి ఉంటుంది.

Tirumala :తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. వారికి ప్రత్యేక దర్శన టికెట్లు..! కోటా విడుదల
TTD
Follow us
Jyothi Gadda

|

Updated on: May 24, 2022 | 4:43 PM

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త ప్రకటించింది. శ్రీవారి దర్శనానికి వెళ్లాలనుకునే వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం మే 26న టీటీడీ ప్రత్యేక దర్శనం కోటా టికెట్లు విడుదల చేయనున్నటు టీటీడీ తెలిపింది. మే 26వ‌ తేదీన మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో టికెట్లు విడుద‌ల చేయనుంది టీటీడీ. జూన్‌ 1నుండి వయో వృద్ధులు, దివ్యాంగుల దర్శన సమయ వేళల్లో మార్పులు ఉండనున్నట్టు టీటీడీ తెలిపింది. జూన్ 1వ తేదీ నుండి ఉద‌యం 10 గంట‌లకు బ‌దులుగా మ‌ధ్యాహ్నం 3 గంట‌ల స్లాట్‌లో వయో వృద్ధులు, దివ్యాంగులను అనుమ‌తిస్తారు. భక్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించాల‌ని టీటీడీ కోరింది. కాగా, ఆగస్టు నెల‌కు సంబంధించిన గ‌దుల కోటా మే 26వ తేదీ ఉద‌యం 9 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది టీటీడీ. భ‌క్తులు ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించి సేవా టికెట్లు పొందాల్సి ఉంటుంది.

మరోవైపు తిరుమలలో గత వారం పది రోజులుగా భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే మే 23న స్వామివారి సర్వదర్శనానికి 29 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు.