AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: వారికి జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. నేడు ఖాతాల్లోకి డబ్బు జమ.. వివరాలివే..

ప్రభుత్వ పథకాలు పొందేందుకు అర్హత ఉండీ.. లబ్ధి పొందని వారి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అర్హత ఉండీ పథకాలు పొందని లబ్ధిదారులను గుర్తించి,

Andhra Pradesh: వారికి జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. నేడు ఖాతాల్లోకి డబ్బు జమ.. వివరాలివే..
Ap Cm Jagan Mohan Reddy
Shiva Prajapati
| Edited By: Narender Vaitla|

Updated on: Dec 27, 2022 | 6:31 AM

Share

ప్రభుత్వ పథకాలు పొందేందుకు అర్హత ఉండీ.. లబ్ధి పొందని వారి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అర్హత ఉండీ పథకాలు పొందని లబ్ధిదారులను గుర్తించి, వారి ఖాతాల్లో నగదు జమ చేస్తోంది ఏపీ సర్కార్. మంగళవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా 2,79,065 మంది లబ్దిదారులకు రూ. 590.91 కోట్లను బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేయనున్నారు సీఎం జగన్. అర్హులైన ఏ ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందకుండా ఉండకూడదన్న స్ధిర సంకల్పంతో.. అర్హులైన వారందరికీ మరో అవకాశం ఇస్తూ రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల కింద నిధులు పంపిణీ చేస్తోంది జగన్ సర్కార్.

పొరపాటున ఏ కారణం చేతనైనా సంక్షేమ పథకాలు అందని వారు పథకం లబ్ధి అందించిన నెలలోపు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే, వాటిని వెరిఫై చేయించి అర్హులైన వారికి డిసెంబర్‌ నుండి మే వరకు అమలైన సంక్షేమ పథకాలకు సంబంధించిన లబ్ధిని జూన్‌ నెలలో, జూన్‌ నుండి నవంబర్‌ వరకు అమలైన సంక్షేమ పథకాలకు సంబంధించిన లబ్ధిని డిసెంబర్‌ నెలలో ప్రతి ఒక్క అర్హుడికి అందజేస్తోంది ఏపీ సర్కార్. అంతేకాదు.. గ్రామ, వార్డు సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాలు డిస్‌ప్లే చేయడం ద్వారా సోషల్‌ ఆడిట్‌ నిర్వహించి, పారదర్శకతతో లంచాలు లేకుండా, కుల, మత, వర్గ, పార్టీల వివక్షకు తావు లేకుండా అర్హులందరికీ పథకాల లబ్ధి అందిసోంది ఏపీ ప్రభుత్వం.

వివిధ పథకాల క్రింద లబ్ధి పొందనున్న వారి వివరాలు..

1. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తంలో లబ్ధి పొందనున్న వారి సంఖ్య 863, రూ. 1.29 కోట్లు.

ఇవి కూడా చదవండి

2. జగనన్న చేదోడు లబ్ధిదారుల సంఖ్య 725, రూ. 0.73 కోట్లు.

3. వైఎస్ఆర్ మత్స్యకార భరోసా లబ్ధిదారుల సంఖ్య 4,457, రూ. 4.46 కోట్లు.

4. జగనన్న విద్యాదీవెన లబ్ధిదారుల సంఖ్య 1,22,833, రూ. 225.05 కోట్లు.5.

జగనన్న వసతి దీవెన లబ్ధిదారుల సంఖ్య 18,697, రూ. 16.35 కోట్లు.

6. జగనన్న అమ్మ ఒడి లబ్ధిదారుల సంఖ్య 43,710, రూ. 56.82 కోట్లు.

7. వైఎస్ఆర్ కాపు నేస్తంలో లబ్ధిదారుల సంఖ్య 17,351, రూ. 26.03 కోట్లు.

8. వైఎస్ఆర్ వాహనమిత్ర లబ్ధిదారుల సంఖ్య 9,005, రూ. 9.00 కోట్లు.

9. వైఎస్ఆర్ చేయూత లబ్ధిదారుల సంఖ్య 30,837, రూ. 57.82 కోట్లు.

10. వైఎస్ఆర్ నేతన్న నేస్తం లబ్ధిదారుల సంఖ్య 2,577, రూ. 6.18 కోట్లు.

11. వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా లబ్ధిదారుల సంఖ్య 28,010, రూ. 187.18 కోట్లు.

మొత్తంగా మంగళవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం 2,79,065 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ. 590.91 కోట్లు జమ చేయనుంది. దీంతో పాటు.. కొత్తగా (జూన్‌ 2022 నుండి నవంబర్‌ 2022 వరకు) అర్హులైన వారికి పెన్షన్‌ కార్డులు, బియ్యం కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు, ఇళ్ళ పట్టాలకు సంబంధించిన వెరిఫికేషన్‌ ప్రస్తుతం జరుగుతోంది. ఈ నెల 30 న తుది జాబితా ప్రచురించి, 1 జనవరి 2023న పెంచిన పెన్షన్‌తో పాటు అన్ని కార్డులు, ఇళ్ళ పట్టాలు పంపిణీ చేయనున్నారు. వాలంటీర్లు లబ్దిదారుల ఇళ్లకే వచ్చి ఆయా కార్డులను అందజేయనున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.