Anakapalle: పరవాడలో భారీ అగ్ని ప్రమాదం.. నలుగురు మృతి.. కారణం అదేనా..
అనకాపల్లి పరవాడ ఫార్మాసిటీలో సోమవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. లారస్ యూనిట్-3 లో షార్ట్ షర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో అక్కడ పని చేస్తున్న వారిలో నలుగురు...
అనకాపల్లి పరవాడ ఫార్మాసిటీలో సోమవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. లారస్ యూనిట్-3 లో షార్ట్ షర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో అక్కడ పని చేస్తున్న వారిలో నలుగురు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. విషయం తెలుసుకున్న తెలిసిన వెంటనే ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. షార్ట్ షర్క్యూట్‌కు గల కారణాలను అన్వేషిస్తున్నారు. అనకాపల్లిలోని వివిధ ఆస్పత్రుల నుంచి అంబులెన్స్‌లు ఫార్మాసిటీ యూనిట్ వద్దకు చేరుకుని బాధితులను తరలిస్తున్నాయి. ఈ ఘటనలో అక్కడే పనిచేస్తున్న కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలిస్తుండగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాంబాబు, రాజేష్, రామకృష్ణ, వెంకట్రావులు ప్రాణాలు విడిచారు.
ప్రమాదం సమాచారం తెలుసుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పి, బాధితులను ఆస్పత్రికి తరలించారు. మ్యానుఫ్యాక్చరింగ్ బ్లాక్ ప్లాష్ ఫైర్ డ్రయర్ రూంలో ప్రమాదం జరిగినట్టు చెబుతున్నారు. పరవాడలోని జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో లారస్ ల్యాబ్ లో మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో మంటలు వ్యాపించాయి. ఒక్కసారిగా మంటలు వ్యాపించిన దశలో ఐదుగురు కార్మికులు ఒకే చాంబర్లో ఉండడంతో ఒక్కసారిగా మంటలకు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని వెంటనే షీలా నగర్లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.