CM Jagan: ప్రభుత్వ స్కూళ్లల్లోని టెన్త్‌ టాపర్లకు సీఎం జగన్ బొనాంజా

ఏపీ సర్కార్ మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లోని తదుపరి బ్యాచ్ విద్యార్థులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రస్తుతం టెన్త్ క్లాసులో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను నియోజకర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో సత్కరించి.. నగదు ప్రొత్సాహకం ఇవ్వనుంది.

CM Jagan: ప్రభుత్వ స్కూళ్లల్లోని టెన్త్‌ టాపర్లకు సీఎం జగన్ బొనాంజా
Cm Jagan With Students
Follow us

|

Updated on: May 18, 2023 | 12:09 PM

జగన్ అంటేనే ఓ విప్లవం. విద్య, వైద్యానికి ఆయనిచ్చే ప్రాధాన్యం అద్భుతం. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ వ్యవస్థల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు సీఎం జగన్. ముఖ్యంగా స్కూల్స్‌లో మౌళిక సదుపాయాలు కల్పించే దిశగా ప్రవేశపెట్టిన నాడు-నేడు వంటి ప్రొగ్రామ్స్‌ను రాజకీయ విమర్శకులు సైతం అభినందించారు. ఈ క్రమంలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. గవర్నమెంటు స్కూళ్లలోని టెన్త్‌ టాపర్లకు ముఖ్యమంత్రి బొనాంజా ప్రకటించారు. నియోజకవర్గాల్లోని టాపర్లకూ ప్రోత్సాహకాలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.

గవర్నమెంటు స్కూళ్లలో టెన్త్‌లో టాప్‌ విద్యార్థులకు ప్రోత్సాహకాలకు అంతా సిద్ధమైంది. రాష్ట్ర, జిల్లా స్థాయి టాపర్లకే కాకుండా నియోజకవర్గాల వారీ టాపర్లకూ ప్రోత్సాహకాలు అందించాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. నియోజకవర్గంలో 1,2,3 స్థానాల్లోని విద్యార్థులకు వరుసగా రూ. 15వేలు, రూ.10వేలు, రూ.5వేలు చొప్పున నగదు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. మే 23న ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానించనున్నారు. వారికి పతకం, మెరిట్ సర్టిఫికేట్, జ్ఞాపికను అందజేస్తారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థుల తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను కూడా సత్కరిస్తారు. గవర్నమెంట్ స్కూళ్లల్లో చదివే పిల్లలను ఇంకా బాగా ప్రొత్సహించే దిశగా..  సీఎం జగన్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కాగా ఈ తరహా విధానాలు పిల్లల్లో కొత్త జోష్‌ను తీసుకొస్తాయని.. వారిలో ఆరోగ్యకరమైన పోటీ తత్వం పెరుగుతుందని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు చెబుతున్నారు.

మే 27న జిల్లా స్థాయిలో టాపర్స్‌ను సన్మానించనున్నారు. మొదటి ర్యాంకర్‌కు   రూ. 50,000 నగదు పురస్కారం, రెండవ, మూడవ ర్యాంకర్‌లకు వరుసగా రూ. 30,000,  రూ. 10,000 రూపాయల ప్రొత్సాహక నగదు ఇస్తారు. మే 31న జరిగే కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి టాపర్‌లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సత్కరించనున్నారు.మొదటి ర్యాంకర్‌కు 1 లక్ష నగదు పురస్కారం, రెండవ, మూడవ ర్యాంకర్‌లకు వరుసగా  రూ. 75,000,  రూ. 50,000 అందజేయనున్నారు. అసెంబ్లీ, జిల్లా స్థాయి కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ప్రభుత్వ అధికారులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం..