ఏపీలో అక్టోబర్ 1 నుంచి డిగ్రీ తరగతులు.. క్యాలెండర్ రెడీ.. వివరాలివే..
Degree Colleges In AP: ఆంధ్రప్రదేశ్‌లో డిగ్రీతో పాటు బీటెక్, బీఎస్సీ, బీఫార్మసీ తదితర ప్రొఫెషనల్, నాన్ ప్రొఫెషనల్ కోర్సులు నిర్వహించే అన్ని కాలేజీలు..

ఆంధ్రప్రదేశ్‌లో డిగ్రీతో పాటు బీటెక్, బీఎస్సీ, బీఫార్మసీ తదితర ప్రొఫెషనల్, నాన్ ప్రొఫెషనల్ కోర్సులు నిర్వహించే అన్ని కాలేజీలు, యునివర్సిటీలను అక్టోబర్ 1వ తేదీ నుంచి పునః ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర తాజాగా 2021–22 అకడమిక్ క్యాలెండర్ విడుదల చేశారు. కోవిడ్ దృష్ట్యా సరి, బేసి విధానంలో తరగతులను నిర్వహించాలని.. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్‌వోపీ) ప్రకారం తగు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
వారానికి 6 రోజులు తరగతులను నిర్వహించనున్నారు. ఏదైనా కారణం చేత ఒక రోజు క్లాస్ జరగకపోతే.. రెండో శనివారం/ఆదివారం/సెలవు రోజులో నిర్వహిస్తారు. అలాగే అన్ని కోర్సులకు 2022-23 విద్యా సంవత్సరం ఆగష్టు 9 నుంచి పునః ప్రారంభం కానుంది.
నాన్ ప్రొఫెషనల్ కోర్సుల క్యాలెండర్(బేసి విధానం):
- కాలేజీల రీ-ఓపెన్ – అక్టోబర్ 1
- అక్టోబర్ 1 నుంచి 1, 3, 5 సెమిస్టర్లకు తరగతులు మొదలు
- డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 6 ఇంటర్నల్ ఎగ్జామ్స్
- తరగతుల లాస్ట్ డేట్: జనవరి 22, 2022
- జనవరి 24 నుంచి సెమిస్టర్ ఫైనల్ పరీక్షలు ప్రారంభం
నాన్ ప్రొఫెషనల్ కోర్సులు (సరి విధానం):
- ఫిబ్రవరి 15, 2022 నుంచి 2, 4, 6 సెమిస్టర్ల క్లాసెస్ ప్రారంభం
- ఏప్రిల్ 4 నుంచి 9 వరకు అంతర్గత పరీక్షలు
- తరగతుల ముగింపు తేదీ: మే 28, 2022
- జూన్ 1, 2022 నుంచి ఫైనల్ ఎగ్జామ్స్
- కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్టు: 2వ సెమిస్టర్ పరీక్షల తర్వాత 8 వారాలు
- సమ్మర్ ఇంటర్న్‌షిప్/జాబ్ ట్రైనింగ్/అప్రెంటిస్‌షిప్: 4వ సెమిస్టర్ తరువాత 8 వారాలు
బీటెక్, బీఫార్మాసీ ప్రొఫెషనల్ కోర్సుల క్యాలెండర్:
- మొదటి సెమిస్టర్ తరగతులు ప్రారంభం: అక్టోబర్ 1
- ఇంటర్నల్ పరీక్షలు: డిసెంబర్ 1 నుంచి 6 వరకు
- తరగతుల ముగింపు తేదీ: జనవరి 31, 2022
- ఫైనల్ పరీక్షలు: ఫిబ్రవరి 7వ తేదీ 2022
సెకండ్ సెమిస్టర్ షెడ్యూల్ ఇలా:
- సెకండ్ సెమిస్టర్ తరగతులు ప్రారంభం: మార్చి 1, 2022
- ఇంటర్నల్ పరీక్షలు: ఏప్రిల్ 15 నుంచి 19, 2022
- తరగతుల ముగింపు తేదీ: జూన్ 18, 2022
- ఫైనల్ పరీక్షలు: జూన్ 23, 2022
మూడో సెమిస్టర్ ఆగష్టు 9 నుంచి ప్రారంభం కానుంది. అలాగే 3 నుంచి 8వ సెమిస్టర్ వరకు కూడా సరి, బేసి విధానంలోనే వేర్వేరు షెడ్యూల్స్‌ను రూపొందించారు.
వరుడు చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్లు.. వధువుకు మాత్రం షాక్.. వీడియో వైరల్
కలుపు మొక్కగా పెరిగే ఈ మొక్క.. మహిళలకు దివ్య ఔషధం.. ఆయుర్వేద మెడిసిన్.. ఆరోగ్యప్రయోజనాలు ఏమిటంటే
వరుడు చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్లు.. వధువుకు మాత్రం షాక్.. వీడియో వైరల్