Petrol Diesel Price: వాహనదారులకు రిలీఫ్‌.. స్థిరంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. హైదరాబాద్‌లో ప్రస్తుతం ఎంత ఉందంటే..

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఇవాళ కొద్ది పాటి మార్పులు కనిపించాయి.  అయితే మెట్రో నగరాల్లో ధరలు నిలకడగా ఉండగా.. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ కొద్దిగా డీజిల్ ధర కొద్దిగా దిగివచ్చింది.

Petrol Diesel Price: వాహనదారులకు రిలీఫ్‌..  స్థిరంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. హైదరాబాద్‌లో ప్రస్తుతం ఎంత ఉందంటే..
Petrol
Follow us

|

Updated on: Sep 14, 2021 | 8:54 AM

Petrol-Diesel Rates Today: దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఇవాళ కొద్ది పాటి మార్పులు కనిపించాయి.  అయితే మెట్రో నగరాల్లో ధరలు నిలకడగా ఉండగా.. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ కొద్దిగా డీజిల్ ధర కొద్దిగా దిగివచ్చింది. దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను పెద్దగా పెంచలేదు. మంగళవారం తెలుగు రాష్ట్రాలలో మాత్రం చిన్నపాటి మార్పు కనిపిస్తున్నాయి. ఇదిలాఉంటే.. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో మార్పుల వల్ల దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరల్లో హెచ్చు తగ్గులు ఉన్నాయి.

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..   

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.26గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 96.69గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.59గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.96.99గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 105.53గా ఉండగా.. డీజిల్ ధర రూ. 96.92గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.105.48గా ఉండగా.. డీజిల్ ధర రూ.96.90గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.69 ఉండగా.. డీజిల్ ధర రూ.97.09గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 104.77 పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.23గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.108.26 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.98.42 లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.106.51 ఉండగా.. డీజిల్ ధర రూ. 97.28 గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 106.68లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.97.74గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 106.97గా ఉండగా.. డీజిల్ ధర రూ.98.82గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 108.26 లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.97.94లకు లభిస్తోంది.

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 101.19 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 88.62 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.26కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.19గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.101.62 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 91.71 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 99.12ఉండగా.. డీజిల్ ధర రూ.93.36గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.104.70 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.94.04 గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 98.34 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.89.06గా ఉంది.

ఇవి కూడా చదవండి: Business Plan: భారతీయ రైల్వేలో వ్యాపారం.. తక్కువ పెట్టుబడితో అదిరిపోయే సంపాదన.. ఎలా చేయాలంటే..