SBI Alert: ఆధార్​తో పాన్​ లింక్​ చేశారా.. లేకంటే రూ. 10000 ఫైన్.. హెచ్చరించిన ఎస్‌బీఐ

ఆధార్​తో పాన్​ లింక్​ తుది గడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో SBI కీలక సూచనలు చేసింది. ఖాతాదారులకు బ్యాంకింగ్ సేవల్లో అంతరాయం రావద్దంటే.. ఈ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని సూచించింది. ఇందుకు...

SBI Alert: ఆధార్​తో పాన్​ లింక్​ చేశారా.. లేకంటే రూ. 10000 ఫైన్.. హెచ్చరించిన ఎస్‌బీఐ
Sbi Link Aadhar Pan
Follow us
Sanjay Kasula

|

Updated on: Sep 14, 2021 | 8:53 AM

ఆధార్​తో పాన్​ లింక్​ తుది గడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో SBI కీలక సూచనలు చేసింది. ఖాతాదారులకు బ్యాంకింగ్ సేవల్లో అంతరాయం రావద్దంటే.. ఈ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని సూచించింది. ఇందుకు సెప్టెంబర్ 30 చివరి తేదీ అని గుర్తు చేసింది. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం SBI వినియోగదారులకు కీలక సూచనలు చేసింది. ఖాతాదారులు ఎవరైనా ఇంకా పాన్-ఆధార్​ అనుసంధానం చేయకపోతే.. ఆ పనిని వెంటనే పూర్తి చేయాలని సూచించింది. ఇందుకు సెప్టెంబర్​ 30 చివరి తేదీ అని స్పష్టం చేసింది. బ్యాంకింగ్ సేవలకు అంతరాయం రావద్దంటే.. ఈ పనిని పూర్తి చేయడం తప్పనిసరని పేర్కొంది.

పాన్-ఆధార్​​ అనుసంధానానికి సెప్టెంబర్​ 30ని తుది గడువుగా ప్రభుత్వమే నిర్ణయించింది. గడువు సమీపిస్తున్న నేపథ్యంలో SBI తమ ఖాతాదారులను అలర్ట్ చేసింది.

ఆధార్​తో పాన్ లింక్ ఎలా? ..

కొత్త ఇన్​కం ట్యాక్స్ పోర్టల్​ను ఓపెన్​ చేయాలి. అవసర్ సర్వీసెస్​ ఆప్షన్​ను ఎంచుకోవాలి.. అక్కడ మీకు పాన్-ఆధార్ లింక్ ఫారం కనిపిస్తుంది.అందులో.. ఆధార్​, పాన్ వివరాలు నింపాలి.తర్వాత మొబైల్ నంబర్​ ఎంటర్​ చేయాలి.ఆధార్ వెరిఫికేషన్​కు పేజీలో.. I agree to validate my Aadhaar details అనే ఆప్షన్​ను టిక్ చేయాలి. ఆ తర్వాత లింక్ ఆధార్​ ఆప్షన్​పై క్లిక్​ చేస్తే సరిపోతుంది.

పాన్ కార్డును ఆధార్ కార్డుతో ఎలా లింక్ చేయాలి..

☛ పాన్ కార్డును ఆధార్ కార్డుతో కేవలం 2 నిమిషాల్లో లింక్ చేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా ఆధార్, పాన్ కార్డులలో మీ పేరు, పుట్టినతేదీలు సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ☛ ఆ తర్వాత ఇన్‏కమ్ ట్యాక్స్ వెబ్‏సైట్ పై క్లిక్ చేయాలి. ☛ ఆ తర్వాత హోం పేజీలో పాన్ కార్డు, ఆధార్ కార్డ్ నంబర్లు, ఆధార్ కార్డ్ మీద ఉన్న పేరు ఇవ్వాలి. ☛ ఆ తర్వాత ఐ అగ్రీ టు వాలిడేట్ మై ఆధార్ డీటేయిల్స్ విత్ UIDAI చెక్ బటన్ మీద్ క్లిక్ చేయాలి. ☛ దాని కింద చూపిస్తున్న క్యాప్చా కోడ్ సరిగ్గా టైప్ చేసి లింక్ ఆధార్ మీద క్లిక్ చేయాలి. ☛ అంతే క్షణాల్లో మీ ఆధార్, పాన్ కార్డులు అనుసంధానం అవుతాయి.

SMS ద్వారా లింక్ చేయడం ఎలా..

☛ మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 567678 లేదా 56161 కు SMS చేయాలి. ☛ ఇలా చేసేందుకు మీరు మీ మొబైల్‌లో యుఐడిపిఎన్ UIDAI (12 అంకెల ఆధార్ నంబర్) (10 అంకెల పాన్) అని టైప్ చేసి 567678 లేదా 56161 కు పంపాలి.

ఇన్‌కమింగ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ ఆధార్, పాన్ కార్డుల అనుసంధానం..

☛ ముందుగా ఇన్‌కమింగ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ యొక్క ఇ-ఫైలింగ్ పోర్టల్‌ను ఓపెన్ చేయాలి. ☛ ఆ తర్వాత ఎడమ వైపున ఉన్న లింక్ బేస్ విభాగంపై క్లిక్ చేయాలి. ☛ ఆ తర్వాత మీ పాన్ నంబర్, ఆధార్ నంబర్‌తోపాటు పేరు ఫిల్ చేయాలి. ☛ ఆ తర్వాత ‘లింక్ ఆధార్’ ఎంపికపై క్లిక్ చేయాలి. మీ పాన్ ఆధార్ లింకింగ్ పూర్తవుతుంది. ☛ మీ ఆధార్ వివరాలకు వ్యతిరేకంగా, ఐటి విభాగం మీ పేరు, పుట్టిన తేదీతోపాటు లింగాన్ని ధృవీకరిస్తుంది. ఆ తరువాత లింక్ చేయబడుతుంది.

లింక్ చేయకపోతే…

లింక్ చేయకపోతే ఏమవుతుంది?గడువులోపు పాన్-ఆధార్​​ లింక్ చేయకపోతే.. ఆలస్య రుసుము కింద రూ.1,000 వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆర్థిక బిల్లు 2021లో సవరణలు చేసి.. సెక్షన్​ 234హెచ్​ను కొత్తగా చేర్చింది.గడువులోపు ఈ ప్రక్రియ పూర్తవకుంటే.. పాన్​ నిర్వీర్యం అవుతుందని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. అలాంటి పాన్​ను ఐటీ సేవలకు వినియోగిస్తే.. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్​ 272బీ ప్రకారం.. రూ.10 వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి: Business Plan: భారతీయ రైల్వేలో వ్యాపారం.. తక్కువ పెట్టుబడితో అదిరిపోయే సంపాదన.. ఎలా చేయాలంటే..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!