AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NTR Baby Kit: తల్లులకు గుడ్‌న్యూస్.. ఎన్టీఆర్‌ బేబీ కిట్‌లో అదనంగా రెండు వస్తువులు.. అవేంటంటే?

ఏపీ ప్రజలకు ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన మహిళలకు ఉచితంగా అందించనున్న ఎన్టీఆర్‌ బేబీ కిట్‌ మరిన్ని వస్తువులు చేర్చుతున్నట్టు తెలిపింది. ఇటీవలే బేబీ కిట్‌ను పరిశీలించిన సీఎం చంద్రబాబు కిట్‌లో అదనంగా ఫోల్డబుల్‌ బెడ్, బ్యాగును అందించాలని అధికారులను ఆదేశించారు.

NTR Baby Kit: తల్లులకు గుడ్‌న్యూస్.. ఎన్టీఆర్‌ బేబీ కిట్‌లో అదనంగా రెండు వస్తువులు.. అవేంటంటే?
Ntr Baby Kit
Anand T
|

Updated on: Sep 30, 2025 | 8:23 AM

Share

ఏపీ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన మహిళలకు ఉచితంగా అందించనున్న ఎన్టీఆర్‌ బేబీ కిట్‌ మరిన్ని వస్తువులు చేర్చుతున్నట్టు తెలిపింది.ఇటీవలే బేబీ కిట్‌ను పరిశీలించిన సీఎం చంద్రబాబు కిట్‌లో అదనంగా ఫోల్డబుల్‌ బెడ్, బ్యాగును అందించాలని అధికారులను ఆదేశించారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో బేబీ కిట్‌ అదనపు వస్తువులను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ఏర్పాట్లు చేస్తోంది.

ఎన్టీఆర్ బేబీ కిట్‌లో అందించే వస్తువులు ఇవే

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన మహిళలకు ప్రభుత్వం ఇస్తున్న ఎన్టీర్‌ బేబీ కిట్‌లో దోమ తెరతో కూడిన పరుపు, దుస్తులు, న్యాప్కిన్లు, తువాలు, సబ్బు, సబ్బు పెట్టె, పౌడర్, వాటర్‌ ప్రూఫ్‌ షీటు, బేబీ ఆయిల్, షాంపూ, ఆడుకోవడానికి బొమ్మ ఇలా కిట్‌లో మొత్తం 11 వస్తువులను ప్రభుత్వం ఇస్తుండగా తాజాగా సీఎం ఆదేశంలో వీటిలోకి మరో రెండు వస్తువులు చేరాయి. దీంతో ఎన్టీర్‌ కిట్‌లో అందించే వస్తువుల సంఖ్య 13కు చేరింది. అయితే ఇంతకు ముందు ఇచ్చే వస్తువులకు ప్రభుత్వం రూ.1,504 ఖచ్చు చేస్తుండగా తాజాగా యాడ్‌ చేసిన రెండు వస్తులతో ఇది రూ. 1954 చేరింది.

ఈ పథకం కింద ప్రతి ఏడాది 3.20 లక్షల మంది తల్లులకు ఈ ఎన్టీఆర్‌ బేబీ కిట్‌ను అందించాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది. శిశు ఆరోగ్య సంరక్షణ కోసం 2016లో ఈ పథకాన్ని టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని కొన్నేళ్లు సాగించినప్పుటికీ పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. దీంతో మళ్లీ అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం పథకాన్ని తిరిగి ప్రారంభించింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.