Andhra Pradesh: జీవచ్ఛంలా మారిన యువతికి పునర్జన్మ ప్రసాదించిన టీటీడీ.. బర్డ్ హాస్పిటల్‌లో తొలిసారి..
Andhra Pradesh: జీవచ్ఛంలా మారిన ఓ యువతికి పునర్జన్మ ప్రసాదించింది టీటీడీ. తిరుపతి బర్డ్ ఆస్పత్రిలో ఫస్ట్‌టైమ్ కాంక్లియర్ ఇన్‌ప్లాంట్ ఆపరేషన్‌ను..
Andhra Pradesh: జీవచ్ఛంలా మారిన ఓ యువతికి పునర్జన్మ ప్రసాదించింది టీటీడీ. తిరుపతి బర్డ్ ఆస్పత్రిలో ఫస్ట్‌టైమ్ కాంక్లియర్ ఇన్‌ప్లాంట్ ఆపరేషన్‌ను సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించింది. వివరాల్లోకెళితే.. రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడి, అపస్మారక స్థితిలోకి వెళ్లిన యువతికి కొత్త జీవితాన్ని ప్రసాదించింది తిరుపతి బర్డ్ ఆస్పత్రి. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు కాంక్లియర్ ఇన్‌ప్లాంట్ ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించారు వైద్యులు. ఆరు లక్షల రూపాయలు ఖర్చయ్యే ఈ ఆపరేషన్‌ను సీఎం సహాయ నిధి కింద ఉచితంగా చేసింది బర్డ్ ఆస్పత్రి. పేషెంట్ సూర్యది అనకాపల్లి జిల్లా తుని. రెండేళ్లక్రితంవరకు ఆనందంగా సాగిపోతున్న సూర్య జీవితాన్ని ఓ యాక్సిడెంట్ తారుమారు చేసింది. సూర్య తలకు తీవ్ర గాయాలు కావడంతో మాట కోల్పోయింది. ఎవరినీ గుర్తుపట్టలేని దయనీయస్థితిలో వెళ్లింది.
అపస్మారక స్థితిలో ఉన్న సూర్యను బతికించుకోవడానికి తల్లిదండ్రులు ఎన్నో ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. చివరికి, టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తోన్న తిరుపతి బర్డ్ ఆస్పత్రిని ఆశ్రయించారు. సూర్య పరిస్థితి, తల్లిదండ్రుల ఆవేదనను అర్ధంచేసుకున్న టీటీడీ, ఫస్ట్‌టైమ్ కాంక్లియర్ ఇన్‌ప్లాంట్ ఆపరేషన్ చేసేందుకు ముందుకొచ్చింది. అందుకు కావాల్సిన వైద్య పరికరాలను సమకూర్చి, తొలి పేషెంట్‌గా సూర్యకు విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించింది. ఆపరేషన్ తర్వాత తమ కూతురి పరిస్థితి మెరుగుపడిందని మురిసిపోతున్నారు సూర్య పేరెంట్స్. బంధువులను, ఫ్రెండ్స్‌ను గుర్తుపడుతోందని చెబుతున్నారు. గతంలో పోల్చుకుంటే ఎన్నో వేల రెట్లు ఆరోగ్యం కుదుపడిందంటూ సంతోషం వ్యక్తంచేశారు తల్లిదండ్రులు. కాంక్లియర్ ఇన్‌ప్లాంట్ ఆపరేషన్‌ను విజయవంతంగాచేసి కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిన బర్డ్ ఆస్పత్రి, మరిన్ని ఆపరేషన్స్ చేసేందుకు రెడీ అవుతోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..