APIIC Golden jubilee: గోల్డెన్ జూబ్లీలోకి అడుగుపెట్టిన APIIC.. లోగోను విడుదల చేసిన సీఎం జగన్..
APIIC Golden jubilee: పారదర్శక విధానాలే APIIC సక్సెస్‌కి కారణమన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. గోల్డెన్ జూబ్లీలోకి అడుగుపెట్టిన APIICకి అభినందనలు
APIIC Golden jubilee: పారదర్శక విధానాలే APIIC సక్సెస్‌కి కారణమన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. గోల్డెన్ జూబ్లీలోకి అడుగుపెట్టిన APIICకి అభినందనలు తెలిపారు సీఎం. ఇకపైనా అదే స్పిరిట్‌తో ముదుకెళ్లాలని సంస్థ అధికారులకు దిశానిర్దేశం చేశారాయన. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ.. APIIC గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరుపుకుంటోంది. 1973 సెప్టెంబర్ 26న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభమైన APIIC, 49ఏళ్లు కంప్లీట్ చేసుకుని.. 50వ వసంతంలోకి అడుగుపెట్టింది. 50 ఇయర్స్ పూర్తి చేసుకున్న APIICకి అభినందనలు తెలిపారు సీఎం జగన్. ఈ సందర్భంగా తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో APIIC గోల్డెన్ జూబ్లీ లోగోను ఆవిష్కరించారు సీఎం. ట్రాన్స్‌పరెంట్ ఇండస్ట్రియల్ పాలసీస్‌తో పారిశ్రామికవాడల అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రగతిలో APIIC ఎంతో కీలక పాత్ర పోషించిందన్న సీఎం జగన్, అదే స్పిరిట్‌తో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
కాగా, ఏడాదిపాటు నిర్వహించబోయే స్వర్ణోత్సవ వేడుకల వివరాలను ముఖ్యమంత్రికి వివరించారు మంత్రి అమర్‌నాథ్ అండ్ APIIC ఉన్నతాధికారులు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన స్ఫూర్తితో మరింత వేగంగా పారిశ్రామిక పార్కులు, మౌలిక వసతుల కల్పనపై ఫోకస్ పెంచుతామన్నారు APIIC ఉన్నతాధికారులు. 20కోట్ల రూపాయల మూలధనంతో ఏర్పాటైన APIIC, అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో, ఇప్పుడు ఏపీలో వందలకొద్దీ పారిశ్రామిక పార్కుల నిర్మాణం చేపట్టింది. కొత్త పరిశ్రమల ఏర్పాటు, మౌలిక వసతుల కల్పనలో కీలక పాత్ర పోషించింది.
50 వ వసంతంలోకి అడుగుపెట్టిన ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక వసతుల సంస్ధ (ఏపీఐఐసీ). క్యాంప్ కార్యాలయంలో ఏపీఐఐసీ గోల్డెన్ జూబ్లీ లోగో ఆవిష్కరించిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్. పారదర్శక పారిశ్రామిక విధానంతో పారిశ్రామిక వాడల అభివృద్దికి నిరంతరం కృషిచేయాలన్న సీఎం. pic.twitter.com/ovcbOMUpmM
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) September 26, 2022
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..