Andhra Pradesh: సిక్కోలు జిల్లా వాసులకు శుభవార్త.. నెరవేరనున్న దశాబ్దాల కల..
సిక్కోలు జిల్లా వాసుల దశాబ్దాల కల. భావనపాడు పోర్టు. ఈ పోర్టు నిర్మాణం విషయంలో తొలి అడుగు వేసింది ఏపీ సర్కార్. పోర్టుకు కావల్సిన భూ సేకరణలో కీలకదశకు చేరింది.

సిక్కోలు జిల్లా వాసుల దశాబ్దాల కల. భావనపాడు పోర్టు. ఈ పోర్టు నిర్మాణం విషయంలో తొలి అడుగు వేసింది ఏపీ సర్కార్. పోర్టుకు కావల్సిన భూ సేకరణలో కీలకదశకు చేరింది. ఎకరాకు 25 లక్షల చొప్పున ఒకే రోజు.. వంద మందికి చెక్కుల పంపిణీ చేశారు జిల్లా మంత్రులు, ఇతర ఉన్నతాధికారులు. ఈ పోర్టు పేరు సైతం మార్చుతామంటున్న మంత్రులింకా ఏమన్నారు?
కేవలం ప్రతిపాదనలకే పరిమితమవుతూ వచ్చిన శ్రీకాకుళం జిల్లా భావనపాడు పోర్ట్. ఈ పోర్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అడుగు ముందుకేసింది. భావనపాడు పోర్ట్ నిర్మాణానికి ఇప్పటికే డీపీఆర్ రూపొందించింది ప్రభుత్వం. టెండర్లను ఖరారు చేసి భూసేకరణ ప్రక్రియను సైతం పూర్తి చేసింది. రైతులను ఒప్పించడంతో.. నిన్న పరిహారానికి శ్రీకారం చుట్టారు. పోర్టు నిర్మాణం కోసం మూలపేట, విష్ణుచక్రం, రాజపురం, లింగూడు గ్రామాల నుంచి 325 ఎకరాలను సేకరించనున్నారు. ఇందుకోసం 454 మంది రైతులు తమ భూమిని ఇవ్వాల్సి ఉంది. అయితే తొలివిడతలో 174 మంది భూములు ఇచ్చేందుకు ముందుకు రాగా సంత బొమ్మాలి మండలం మూలపేటలో వారికి నష్టపరిహారం చెక్కులను అందజేశారు జిల్లా మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు.
ఈ పోర్టు నిర్మాణం వల్ల పెద్ద పరిశ్రమలొచ్చి ఉపాధి కల్పన ఏర్పడుతుందన్నారు రెవెన్యూ మంత్రి ధర్మాన. బాబు మాయమాటలు చెప్పడం తప్ప ఈ జిల్లాపట్ల అభిమానం చూపలేదని మండిపడ్డారాయన. నిన్న ఒక్క రోజే వంద మందికి చెక్కులు పంచామనీ. మిగిలిన వారికి ఈ నాలుగైదు రోజుల్లో పంపిణీ చేస్తామని అన్నారు జిల్లా కలెక్టర్. మిగిలిన భూముల సేకరణ సైతం త్వరలోనే పూర్తి చేస్తామని చెబుతూ.. ఈ పోర్టు పేరు కూడా మార్చుతామని అన్నారు జిల్లా కలెక్టర్. పోర్టు కోసం భూములు ఇచ్చిన రైతుల త్యాగాలను అభినందించేందుకే జిల్లా నాయకులంతా ఇక్కడికి వచ్చినట్టు చెప్పారు. ఈ సందర్భంగా గ్రామస్తులను అభినందించారు నాయకులు, అధికారులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..