Bible Telugu Translation: ‘బైబిల్’ తెలుగులోకి అనువాదం ఎప్పుడైంది? ఎక్కడైందో తెలుసా?.. క్రిస్ట్‌మస్ స్పెషల్ మీకోసం..
క్రైస్తవుల పవిత్ర గ్రంథం ‘బైబిల్’ తెలుగులోకి అనువాదమై 200 సంవత్సరాలు దాటింది. మరి, తొలిసారిగా తెలుగు బైబిల్ అనువాదం ఎక్కడ జరిగింది? ఎప్పుడు అందుబాటులోకి వచ్చింది?

క్రైస్తవుల పవిత్ర గ్రంథం ‘బైబిల్’ తెలుగులోకి అనువాదమై 200 సంవత్సరాలు దాటింది. మరి, తొలిసారిగా తెలుగు బైబిల్ అనువాదం ఎక్కడ జరిగింది? ఎప్పుడు అందుబాటులోకి వచ్చింది? క్రిస్మస్ సందర్భంగా ఈ స్పెషల్ కథనం మీకోసం.. బైబిల్, క్రైస్తవుల పవిత్రగ్రంథం. ప్రపంచంలోని దాదాపు అన్ని భాషల్లోకీ అనువాదమైంది బైబిల్. మొదట్లో ఆదిమ హెబ్రీ, గ్రీకు భాషల్లో మాత్రమే అందుబాటులో ఉండే బైబిల్, ఆ తర్వాత ఇంగ్లీష్ భాషలోకి ట్రాన్స్‌లేట్ అయ్యింది. మరి, తెలుగు బైబిల్ అనువాదం ఎప్పుడు? ఎక్కడ? జరిగింది?. ఈ ప్రశ్నకు విశాఖపట్నం పేరు వినిపిస్తోంది. క్రైస్తవులు అత్యంత పవిత్రంగా భావించే బైబిల్ తెలుగు వెర్షన్ అనువాదం జరిగింది విశాఖలోనే అంటున్నారు చరిత్రకారులు.
వైజాగ్ పూర్ణ మార్కెట్ ఏరియాలోనే బైబిల్ తెలుగు అనువాదం జరిగిందని చెబుతున్నారు. విశాఖలో ప్రస్తుతమున్న సీబీఎం హైస్కూల్ ప్రాంగణమే అందుకు వేదికైందని అంటున్నారు. అక్కడే గ్రీకు నుంచి తెలుగులోకి బైబిల్ అనువాదం జరిగిందని పరిశోధకులు చెబుతున్నారు. మొదట, బైబిల్‌లోని కొత్త నిబంధన గ్రంథాన్ని తెలుగు ట్రాన్స్‌లేషన్ చేశారనేది చరిత్రకారుల మాట. వ్యాపారం కోసం విశాఖకు వచ్చిన ఆంగ్లేయులు.. క్రైస్తవ్యం వ్యాప్తి కోసం తెలుగు నేర్చుకోవడమే కాకుండా, తెలుగు బైబిల్‌ను అందుబాటులోకి తెచ్చారని చెబుతున్నారు. ప్రస్తుతం విశాఖ LMM చర్చిలో ఉన్న పురాతన తెలుగు బైబిలే మొదటి అనువాదమైనది చెబుతున్నారు. ఇది, 1818లో ముద్రించినట్టు చెబుతున్నారు. దీన్ని రెండు భాగాలుగా ముద్రించారు.
200ఏళ్లు దాటినా ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది ఆ బైబిల్. ప్రస్తుతం దీన్ని బెంగళూరులో భద్రపర్చారు. 1818 తర్వాత 1860లో పాత నిబంధనతోపాటు కొత్త నిబంధన తెలుగు వెర్షన్‌ను కూడా విశాఖలోనే ముద్రించారు. ఆ తర్వాత వచ్చిన లండన్ మిషనరీస్ మళ్లీ తెలుగు ట్రాన్స్‌లేషన్స్ చేయించినా, విశాఖ అనువాదమే ది బెస్ట్ అంటారు చరిత్రకారులు. మిగతా తెలుగు వెర్షన్స్.. ఇంగ్లీష్ నుంచి ట్రాన్స్‌లేట్ అయితే.. విశాఖ అనువాదం మాత్రం గ్రీకు నుంచి కావడమే దీనికి కారణమంటున్నారు పరిశోధకులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..