Playing XI: ఢిల్లీతో మ్యాచ్.. ఆ ఇద్దరిపై వేటు వేయనున్న సన్‌రైజర్స్ హైదరాబాద్?
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2025లో మిశ్రమ ఫలితాలతో ముందుకు సాగుతోంది. లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో ఓడిపోయిన తర్వాత, ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో మరొక కీలక పోరుకు సిద్ధమవుతోంది. బౌలింగ్ విభాగం బలహీనంగా ఉండటంతో రాహుల్ చాహర్ లేదా కామిందు మెండీస్ జట్టులోకి వచ్చే అవకాశముంది. మరోవైపు, అభినవ్ మనోహర్ స్థానం ఖతర్లో ఉండగా, సచిన్ బేబీ లేదా అథర్వ టైడ్‌కు అవకాశం దక్కనుంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఈ ఐపీఎల్ 2025 సీజన్‌లో మిశ్రమ ఫలితాలతో ముందుకు సాగుతోంది. టోర్నమెంట్‌ను అద్భుతంగా ఆరంభించినా, గత మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) చేతిలో ఓటమి చవిచూసింది. ఇప్పుడు, వారంతా మరింత బలంగా తిరిగి రావాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ సీజన్‌లో రాణిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్టుతో వారు వైజాగ్ వేదికగా ఆదివారం మధ్యాహ్నం తలపడనున్నారు. ఢిల్లీ బ్యాటింగ్ లైనప్ అద్భుతంగా ఉండటంతో ఈ మ్యాచ్ అత్యంత ఉత్కంఠభరితంగా మారనుంది.
సన్‌రైజర్స్‌కు నేర్పిన పాఠం
లక్నోతో జరిగిన గత మ్యాచ్‌లో SRH బ్యాటర్లు కొంతవరకు రాణించినా, కీలకమైన సమయంలో విఫలమయ్యారు. ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ నిరాశపరిచారు. ఇక, నితీష్ కుమార్ రెడ్డి నెమ్మదిగా ఆడడం స్కోర్‌ను దెబ్బతీసింది. అయినప్పటికీ, SRH 190 పరుగుల వరకు వెళ్లగలిగింది. అయితే, బౌలర్లు ఈ లక్ష్యాన్ని కాపాడలేకపోయారు. ముఖ్యంగా, నికోలస్ పూరన్ విధ్వంసకర బ్యాటింగ్‌తో SRH బౌలింగ్‌ను తునాతునకలు చేశారు. ఈ పరాజయంతో SRH తమ బౌలింగ్ విభాగంలో మార్పులు చేసుకోవాలని భావిస్తోంది.
బౌలింగ్ విభాగంలో మార్పులు
వైజాగ్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. అందుకే, SRH తమ స్పిన్ విభాగాన్ని మెరుగుపరిచే అవకాశముంది. సిమర్జిత్ సింగ్ స్థానంలో రాహుల్ చాహర్‌ను జట్టులోకి తీసుకునే ఆలోచన ఉంది. అటు, ఆడమ్ జంపా స్థానంలో కామిందు మెండీస్‌ను కూడా ఎంపిక చేసే అవకాశముంది.
బ్యాటింగ్ విభాగంలో మార్పులు?
అభినవ్ మనోహర్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో కూడా విఫలమవ్వడంతో, అతని స్థానంలో సచిన్ బేబీ లేదా అథర్వ టైడ్‌కు అవకాశం దక్కనుంది. ఓపెనింగ్‌లో ట్రావిస్ హెడ్ ఫామ్‌లో ఉండగా, ఇషాన్ కిషన్ స్థిరతతో ఆడాల్సిన అవసరం ఉంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2025లో మిశ్రమ ఫలితాలతో ముందుకు సాగుతోంది. లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో ఓడిపోయిన తర్వాత, ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో మరొక కీలక పోరుకు సిద్ధమవుతోంది. బౌలింగ్ విభాగం బలహీనంగా ఉండటంతో రాహుల్ చాహర్ లేదా కామిందు మెండీస్ జట్టులోకి వచ్చే అవకాశముంది. మరోవైపు, అభినవ్ మనోహర్ స్థానం ఖతర్లో ఉండగా, సచిన్ బేబీ లేదా అథర్వ టైడ్‌కు అవకాశం దక్కనుంది.
ఢిల్లీతో సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు(అంచనా): అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రీచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్/సచిన్ బేబీ/అథర్వ టైడ్, ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్, సిమర్జిత్ సింగ్/రాహుల్ చాహర్, మహమ్మద్ షమీ
ఇంపాక్ట్ ప్లేయర్: ఆడమ్ జంపా/ కామిందు మెండీస్
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..