Venkayya on NTR: ఆ ఆరుగురు మహిళలే కారణం అంటూ.. ఎన్టీఆర్ వెన్నుపోటు ఎపిసోడ్‌పై వెంకయ్య సంచలన వ్యాఖ్యలు
తెనాలిలో జరిగిన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరైన వెంకయ్యనాయుడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. వెన్నుపోటు ఎపిసోడ్‌పై సంచలన విషయాలను బయటపెట్టారు. ఎన్టీఆర్ ఎలాంటి కల్మషం లేని వ్యక్తని, రాజకీయాల్లో కూడా అంతే భోళాతనంగా ఉండేవారని అన్నారు.

ఎన్టీఆర్ వెన్నుపోటు ఎపిసోడ్‌పై సెన్షేషనల్ కామెంట్స్ చేశారు వెంకయ్యనాయుడు. ఆనాడు జరిగిన పలు సంఘటనలు గుర్తుచేసుకుంటూ సీక్రెట్స్‌ను బయటపెట్టారు. ఇంతకీ, వెంకయ్య బయపెట్టిన ఆ సీక్రెట్స్ పై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.. అవును స్వర్గీయ నందమూరి తారక రామారావు చారిత్రక పురుషుడంటూ కొనియాడారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. సినీరంగంలోనే కాదు, రాజకీయాల్లో విప్లవం తీసుకొచ్చిన మహావ్యక్తి, మహా నాయకుడు అన్నారు. పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చారని గుర్తుచేసుకున్నారు. అప్పటివరకు వంటింటికే పరిమితమైన ఆడపడుచులు సైతం రాజకీయాల్లో రాణించేలా ప్రోత్సహించారని అన్నారు. తెనాలిలో జరిగిన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరైన వెంకయ్యనాయుడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
వెన్నుపోటు ఎపిసోడ్‌పై సంచలన విషయాలను బయటపెట్టారు. ఎన్టీఆర్ ఎలాంటి కల్మషం లేని వ్యక్తని, రాజకీయాల్లో కూడా అంతే భోళాతనంగా ఉండేవారని అన్నారు. అందరినీ నమ్మేవారని, బహుళా అదే ఆయనకు వెన్నుపోటుకు కారణమై ఉండొచ్చని అభిప్రాయపడ్డారు వెంకయ్యనాయుడు. ఒకసారి ఎన్టీఆర్‌తో తాను కలిసి కూర్చొని ఉండగా ఆరుగురు మహిళలు వచ్చి ఆయన కాళ్లకు నమస్కరించారని, కొన్నాళ్లకు వాళ్లే వెన్నుపోటు ఎపిసోడ్‌లో కీలక పాత్ర పోషించారని గుర్తుచేసుకున్నారు. వాళ్లెందుకు మీ కాళ్లకు దండం పెట్టారని తాను ఎన్టీఆర్‌ను అడిగానని… దాంతో ప్రేమ, అభిమానంతో కాళ్లకు నమస్కరించారని ఎన్టీఆర్ అన్నారని… అయితే తాను మాత్రం అది ప్రేమ కాదని అన్నానంటూ గుర్తుచేసుకున్నారు. చివరికి, అదే నిజమైందన్నారు వెంకయ్య. ఎన్టీఆర్ తన వెనుక జరుగుతోన్న కుట్రలు, కుతంత్రాలను గమనించలేకపోవడం వల్లే వెన్నుపోటుకు గురయ్యారని అన్నారు. ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో వెంకయ్యనాయుడు చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయ్. ఇంతకీ, ఆరుగురు మహిళలు ఎవరనేది కూడా హాట్ టాపిక్‌గా మారింది.




మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..