Konaseema: కుమారుడికి సాగు విధానాలను నేర్పించిన జిల్లా కలెక్టర్.. స్వయంగా వరి నాట్లు వేసి..
ప్రస్తుతం వ్యవసాయం చేసేందుకు అందరూ వెనకడుగు వేస్తున్నారు. ఈ పరిస్థితుల కారణంగా వచ్చే తరాల వారు వ్యవసాయం గురించి తెలుసుకోవాలన్న కారణంతో కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా తన కుమారుడికి వ్యవసాయ విధానాలను...

ప్రస్తుతం వ్యవసాయం చేసేందుకు అందరూ వెనకడుగు వేస్తున్నారు. ఈ పరిస్థితుల కారణంగా వచ్చే తరాల వారు వ్యవసాయం గురించి తెలుసుకోవాలన్న కారణంతో కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా తన కుమారుడికి వ్యవసాయ విధానాలను గురించి వివరించారు. క్షేత్ర స్థాయిలో రైతులు చేసే పనులను చూపించారు. వ్యవసాయం పట్ల అవగాహన కల్పించారు. అంతే కాకుండా ఆయన కూడా రైతుగా మారిపోయారు. స్వయంగా పొలంలో దిగి రైతులతో కలిసి నాట్లు వేశారు. అనంతరం వరి సాగుపై రైతులతో ముచ్చటించారు. వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. వరి ఉత్పాదకత పెంచడంలో మేలైన అధునాతన వరి వంగడాల ఎంపిక తో పాటు.. మెరుగైన యాజమాన్య పద్ధతులు అవలంబించడం ద్వారా అధిక దిగుబడులు సాధించాలని అన్నారు. శనివారం కామనగరువు గ్రామంలో రబి సీజన్లో వరి నాట్లను వేసే విధానాలను పరిశీలించారు.
ప్రస్తుత రబీ సీజన్ లో సాగునీటి సమస్యలు ఉత్పన్నం కాకుండా తక్కువ కాల పరిమితి కలిగి అధిక దిగుబడులు ఇచ్చే వరి వంగడాలను ఎంపిక చేసుకోవాలని రైతులకు సూచించారు. ఏటా సాగు చేసే సాంప్రదాయ రకాలకు బదులుగా కొత్త వరి వంగడాలను ప్రాంతాలకు అనువైన, శాస్త్రవేత్తల సిఫార్సులకు అనుగుణంగా రైతులు విత్తనాలు ఎంపిక చేసుకొని మంచి దిగుబడులు సాధించాలని ఆకాంక్షించారు. విచక్షణ రహితంగా రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందుల వాడకం, కలుపు మందులు పై సరైన అవగాహన లేకుండా ఉపయోంగించడం వల్ల దిగుబడులు తగ్గుతున్నాయన్నారు. సాగు ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయని రైతులు భయపడకుండా శాస్త్రవేత్తల సిఫార్సులను పరిగణనలో తీసుకుని సాగులో విస్తరణ సేవలను బలోపేతం చేయాలని చెప్పారు.
సాగులో మెలకువలు తెలుసుకోవాలి. తక్కువ పెట్టుబడి తో నాణ్యమైన లాభసాటి ఉత్పత్తు లు సాధించాలి. సహజసిద్ధ వనరులతో ఆధునిక సేద్య విధానాలను అమలు పరచాలి. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలి. సేంద్రియ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించాలి. సమగ్ర పంటల యాజమాన్య పద్ధతులను సస్యరక్షణ పద్ధతులు ఆచరించాలి. ముఖ్యంగా రవి సీజన్ లో పంట చివరి దశలో సాగునీటి ఎద్దడి సమస్యలు తలెత్తకుండా సాగునీటి యజమాన్య పద్ధతులు తప్పనిసరిగా పాటించాలి. నీటి వినియోగాన్ని గరిష్టతరం చేస్తూ సాగు నీటిని పొదుపుగా వాడి ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగుకు చర్యలు తీసుకోవాలి.




– రాజీవ్ శుక్లా, కోనసీమ జిల్లా కలెక్టర్

Collector Himanshu Shukla 1
మారుతున్న సాంకేతికత పరిజ్ఞానం రైతులకు దరి చేరితేనే సాంకేతికతకు సార్ధకత చేకూరుతుందని కలెక్టర్ హిమాన్షు శుక్లా అన్నారు. ఆ దిశగా వ్యవసాయ అధికారులు, వ్యవసాయ శాస్త్ర వేత్తలు రైతులను ప్రోత్సాహించాలని చెప్పారు. రైతులను ఆయన సాగు విధానాలపై ఆరా తీయగా.. రైతులు 125 రోజులు పంట కాలపరిమితి కలిగిన ఎంపీయూ 1121 రకం వరి వంగడాన్ని ఎంపిక చేసుకున్నారని స్థానిక గ్రామ సచివాలయ వ్యవసాయ సహా యకులు తెలిపారు. అదే విధంగా రబీ సాగుకు సంబంధించిన సమస్యల గురించి స్థానిక రైతాంగ సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి కాకి నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ సిబ్బంది స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..



