Andhra Pradesh: మంత్రుల బస్సు యాత్రకు మహానాడు పోటీ కాదు.. మాజీ మంత్రి పేర్ని నాని కామెంట్

ఒంగోలు వేదికగా టీడీపీ నేతలు నిర్వహిస్తున్న మహానాడుపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రుల బస్సు యాత్రకు మహానాడు పోటీ కాదని వెల్లడించారు. మహానాడు నిర్వహించే అర్హత....

Andhra Pradesh: మంత్రుల బస్సు యాత్రకు మహానాడు పోటీ కాదు.. మాజీ మంత్రి పేర్ని నాని కామెంట్
Perni Nani
Follow us
Ganesh Mudavath

|

Updated on: May 28, 2022 | 3:58 PM

ఒంగోలు వేదికగా టీడీపీ నేతలు నిర్వహిస్తున్న మహానాడుపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రుల బస్సు యాత్రకు మహానాడు పోటీ కాదని వెల్లడించారు. మహానాడు నిర్వహించే అర్హత చంద్రబాబు కుటుంబానికి లేదని మండిపడ్డారు. షెడ్యూల్‌ ప్రకారం 2024 లోనే వైసీపీ ఎన్నికలకు వెళ్తుందని స్పష్టం చేశారు. మంత్రులు చేపట్టిన బస్సు యాత్ర కృష్ణా జిల్లా గన్నవరం చేరుకుండగా మాజీ మంత్రి పేర్ని నాని అక్కడకు వచ్చారు. సీఎం జగన్‌ ఎన్నికల ముందు చేపట్టిన పాదయాత్రకు ప్రజలు ఎలా వచ్చేవారో బస్సుయాత్ర సందర్భంగా అలాగే వస్తున్నారని ఆయన అన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే సామాజిక న్యాయం కార్యరూపం దాల్చిందని పేర్కొన్నారు.

 స్థానిక సంస్థల ఎన్నికల్లో మాకు 60 శాతానికి పైగా ఓట్లు వచ్చాయి. మిగతా 40మంది వ్యతిరేకించారని.. అలాంటి వాళ్ల ఇంటికి వెళ్లినప్పుడు అర్హత లేకపోయినా ఫలానా పథకం రాలేదని ప్రశ్నిస్తున్నారు. అలా ప్రశ్నించినంత మాత్రాన అది వ్యతిరేకత కాదు. ఆర్థిక స్థితిగతుల వల్ల ఉద్యోగులు అడిగినంత పీఆర్సీని ఇవ్వలేకపోయాం.

     – పేర్ని నాని, మాజీ మంత్రి

ఇవి కూడా చదవండి

మరోవైపు.. మంత్రుల బస్సుయాత్రపై టీడీపీ లీడర్ చంద్రబాబు సెటైర్లు వేశారు. జనాలు రావాలనుకుంటున్న మహానాడుకు బస్సుల్ని ఇవ్వకుండా ప్రభుత్వం ఎవరూ లేని యాత్రకు బస్సుల్ని తిప్పుతోందని ఎద్దేవా చేశారు. తప్పుడు రాజకీయాలను ప్రజలు ఆమోదించరని జగన్ తెలుసుకోవాలని చంద్రబాబు సూచించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి