AP Lightning Alert: ఏపీలో పిడుగుపాటు హెచ్చరికలు.. ఆ జిల్లాల వారు బయట ఉండొద్దంటూ అలెర్ట్ 

Lightning Alert in Andhra Pradesh: నైరుతి రుతుపవనాలు చురుకుగా మారాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో

AP Lightning Alert: ఏపీలో పిడుగుపాటు హెచ్చరికలు.. ఆ జిల్లాల వారు బయట ఉండొద్దంటూ అలెర్ట్ 
Lightning Strikes
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Jul 07, 2021 | 3:24 PM

Lightning Alert in Andhra Pradesh: నైరుతి రుతుపవనాలు చురుకుగా మారాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలోని పలు ప్రాంతాలకు ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేసింది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, కృష్ణా , గుంటూరు , ప్రకాశం , నెల్లూరు జిల్లాల్లో బుధవారం సాయంత్రం పిడుగులు పడే అవకాశాలు ఉన్నాయని అలెర్ట్ జారీ చేసింది. అలాగే రాయలసీమలో అక్కడక్కడ పిడుగులు పడే అవకాశముంది.

పిడుగులు పడే అవకాశమున్న ప్రాంతాలు ఇవే..

విశాఖపట్నంలో.. విశాఖపట్నం జిల్లాలోని మాడుగుల, చీడికాడ, దేవరపల్లి, పాడేరు, హుకుంపేట, అనంతగిరి, చోడవరం, సబ్బవరం, కె.కోటపాడు, అనకాపల్లి, కశింకోటకు హెచ్చరికలు జారీ చేసింది.

విజయనగరం జిల్లాలో.. విజయనగరం, జామి, కొత్తవలస, లక్కవరపుకోట, శృంగవరపుకోట, గంట్యాడ, బొందపల్లి, గుర్ల, గరివిడి, మెరకముడిదం, సీతానగరం, పార్వతీపురం, కురుపాం, కొమరాడ, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, తేర్లాం మండలాలకు హెచ్చరికలు జారీ చేసింది.

శ్రీకాకుళం జిల్లాలో.. గంగువారి సిగడాం, సరుబుజ్జిలి, జలుమూరు, లక్ష్మీనర్సంపేట, హీరామండలం, కొత్తూరు, పలాస, నందిగం, పాలకొండ, రాజాం మండలాలకు హెచ్చరికలు జారీ చేసింది.

కృష్ణా జిల్లా.. విజయవాడ అర్బన్ & రూరల్, పెనమలూరు , కంకిపాడు, ఇబ్రహీంపట్నం, గన్నవరం, ఉంగుటూరు, బాపులపాడు, చందర్లపాడు, పెడన, గుడ్లవల్లేరు, మచిలీపట్నం, ముదినేపల్లి, గుడూరు, మొవ్వ, ఘంటశాల, చాట్రాయి, విస్సన్నపేట, ముసునూరు, రెడ్డిగూడెం.

గుంటూరు జిల్లా.. తాడేపల్లి, మంగళగిరి, తుళ్ళూరు, పెదకాకాని, తాడికొండ, వెల్దుర్తి, చిలకలూరిపేట

ప్రకాశం జిల్లా.. యర్రగొండపాలెం, మార్కపూరం, అర్ధవీడు, పర్చూర్, యద్దనపూడి, మార్టూర్

నెల్లూరు జిల్లా.. నెల్లూరు, పొదలకూర్ , మనుబోలు , సూళ్ళూరుపేట

ఆయా మండలాల పరిసర ప్రాంతాల్లో పిడుగులు ఉధృతంగా పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల శాఖ తెలిపింది. పిడుగులు పడే సమయంలో ఆరుబయట చెట్ల కింద నిలబడవద్దంటూ పలు సూచనలు చేసింది. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల కింద బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని పేర్కొంది. పిడుగులు పడే సమయంలో.. సురక్షితమైన భవనాల్లో ఆశ్రయంపొందాలని విపత్తుల శాఖ కమిషనర్ కె.కన్నబాబు ప్రకటన జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Also Read:

Fake Army Officer: ఆర్మీ అధికారిగా బిల్డప్.. ఒకరి తర్వాత ఒకరు.. అతని వలలో 53 మంది యువతులు..

Pregnant Women: విశాఖ ఏజెన్సీలో విషాదం.. డోలీ కట్టినా నిలువని తల్లీబిడ్డల ప్రాణం.. కంటతడి పెట్టిస్తున్న ఘటన