AP Deputy CM: జగన్, షర్మిల మధ్య విభేదాలు లేవు.. జగన్‌కు ఆంధ్ర, తెలంగాణ తేడాలుండవుః నారాయణ స్వామి
తిరుమలలో ఆసక్తికర కామెంట్స్ చేశారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి. జగన్, షర్మిల మధ్య ఎలాంటి విభేదాలు లేవని అన్నారు.
AP Deputy CM Narayana Swamy Sensational Comments: తిరుమలలో ఆసక్తికర పొలిటికల్ కామెంట్స్ చేశారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి. జగన్, షర్మిల మధ్య ఎలాంటి విభేదాలు లేవని అన్నారు. జలవివాదంపై ఇప్పటివరకూ చంద్రబాబు ఎందుకు నోరు విప్పలేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన సోదరి వైఎస్ షర్మిల మధ్య వివాదం పెట్టేందుకు ప్రయత్నించవద్దని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. వాళ్లిద్దరి మధ్య ఎలాంటి వ్యత్యాసాలు, మనస్పర్థలు లేవని స్పష్టం చేశారు. ఏపీ, తెలంగాణ మధ్య నీటి వివాదానికి చంద్రబాబే కారణమని ఆయన ఆరోపించారు. శనివారం ఉదయం తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. నీటి వివాదంపై చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని నారాయణ స్వామి ప్రశ్నించారు. రాష్ట్రంలో 31.50 లక్షల మంది పేద ప్రజలకు ప్రభుత్వం తరుపున స్థలం ఇవ్వడమే కాకుండా ఇల్లు కూడా కట్టిస్తున్నామని డిప్యూటీ సీఎం తెలిపారు.
వారిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయంటూ కొందరు వ్యాఖ్యలు చేస్తుండడం సరికాదని అన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదం కొనసాగుతున్నప్పటికీ చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని ఆయన నిలదీశారు. ఈ విషయంపై చంద్రబాబు నాయుడిని మీడియా అడగాలని ఆయన సూచించారు. జగన్‌కు ఆంధ్ర, తెలంగాణ అంటూ తేడాలు ఏమీ లేవని చెప్పారు. అందరం తెలుగువారమేనని, అందరం ఐక్యంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.
Read Also…. Puri Rathyatra: రెండో ఏట భక్తులు లేకుండా పూరీ జగన్నాథ రథయాత్ర.. రెండు డోసుల టీకా తీసుకున్న సేవకులకే అనుమతి