AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vizianagaram: విజయనగరం జిల్లాలో దారుణం.. ఇద్దరు చిన్నారులను నేలకేసి కొట్టిన కసాయి తండ్రి..

Vizianagaram: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భార్య, భర్తల మధ్య ఘర్షణ.. ఓ చిన్నారి ప్రాణాలు తీయగా..

Vizianagaram: విజయనగరం జిల్లాలో దారుణం.. ఇద్దరు చిన్నారులను నేలకేసి కొట్టిన కసాయి తండ్రి..
Killed
Shiva Prajapati
|

Updated on: Jul 10, 2021 | 11:47 AM

Share

Vizianagaram: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భార్య, భర్తల మధ్య ఘర్షణ.. ఓ చిన్నారి ప్రాణాలు తీయగా.. మరో చిన్నారి ప్రాణాపాయ స్థితిలో ఉంది. ఈ విషాద ఘటన జిల్లాలోని సాలూరు మండలం జోడిమామిడివలస లో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సాలూరు మండలానికి చెందిన ప్రసాద్, మహాలక్ష్మి ఎనిమిదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే, వీరికి ఇద్దరూ ఆడపిల్లలు పుట్టడంతో ప్రసాద్.. తన భార్య మహాలక్ష్మిని నిత్యం వేధించడం మొదలు పెట్టాడు. అయితే, రోజు రోజుకు భర్త వేధింపులు ఎక్కువ అవడంతో.. అతని వేధింపులు తాళలేక మహాలక్ష్మి తోడిమామిడివలసలోని తన పుట్టింటికి వచ్చింది.

అయితే, శుక్రవారం సాయంత్రం.. భర్త ప్రసాద్ తన భార్య వద్దకు వచ్చాడు. ఈ క్రమంలో ఆమెతో ఘర్షణకు దిగాడు. భార్యతో పాటు.. ఇద్దరు పిల్లలను చితకబాదాడు. కోపంతో ఊగిపోయిన ప్రసాద్.. ఇద్దరు పాపలను నేలకేసి కొట్టాడు. ఈ దాడిలో ఒక పాప మృతి చెందగా.. మరో పాప తీవ్రంగా గాయపడండి. భార్య మహాలక్ష్మి స్థానికుల సహాయంతో తప్పించుకుంది. కాగా, గాయపడిన మరో పాపను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. పాప పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతి చెందిన బాలికను పరిశీలించారు. భర్త ప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఏం జరిగిందనే దానిపై స్థానికుల నుంచి పోలీసులు సమాచారం సేకరించారు. తమకు లభించిన సమాచారం ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రసాద్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

Also read:

AP Deputy CM: జ‌గ‌న్‌, ష‌ర్మిల మ‌ధ్య విభేదాలు లేవు.. జ‌గ‌న్‌కు ఆంధ్ర, తెలంగాణ తేడాలుండవుః నారాయ‌ణ స్వామి

Karthika Deepam: లాయర్ ని కలిసిన దీప.. ఆరోజు ఏం జరిగిందో నిజం చెప్పమని ప్రియమణిని కోరుతున్న కార్తీక్

SBI Clerk Prelims 2021: నేటి నుంచి ఎస్‌బీఐ క్లర్క్‌ రాత పరీక్ష.. కేంద్రాల వద్ద కోవిడ్‌ నిబంధనలు తప్పనిసరి