Puri Rathyatra: రెండో ఏట భక్తులు లేకుండా పూరీ జగన్నాథ రథయాత్ర.. రెండు డోసుల టీకా తీసుకున్న సేవకులకే అనుమతి

సుప్రసిద్ధ పూరీ జగన్నాథ రథయాత్ర ఎల్లుండి అంటే జులై 12 జరగనుంది. వరుసగా రెండో ఏడాది కూడా జగన్నాథ రథయాత్రను భక్తులు లేకుండానే సాదాసీదాగా నిర్వహించాలని నిర్ణయం.

Puri Rathyatra: రెండో ఏట భక్తులు లేకుండా పూరీ జగన్నాథ రథయాత్ర.. రెండు డోసుల టీకా తీసుకున్న సేవకులకే అనుమతి
Puri Jagannath Temple
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Jul 10, 2021 | 10:58 AM

Puri Rathyatra no Participation of Devotees: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఆలయాల్లో ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. సెకండ్ వేవ్ కాస్త తగ్గుముఖ పడుతుండటంతో ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి. ఇందులో భాగంగా సుప్రసిద్ధ పూరీ జగన్నాథ రథయాత్ర ఎల్లుండి అంటే జులై 12 జరగనుంది. వరుసగా రెండో ఏడాది కూడా జగన్నాథ రథయాత్రను భక్తులు లేకుండానే సాదాసీదాగా చేపట్టాలని ఆలయ కమిటీ నిర్ణయించింది.

కోవిడ్ నిబంధనల్లో భాగంగా వ్యక్తుల మధ్య భౌతిక దూరం పాటించడంలో భాగంగా పూరీ రథాన్ని లాగేందుకు 3వేల మంది సేవకులను కరోనా మార్గదర్శకాలు పాటిస్తూ అనుమతించాలని నిర్ణయించారు. రథయాత్రలో 3వేల మంది సేవకులు, 1,000 మంది ఆలయ ఉద్యోగులు, పోలీసులు పాల్గొననున్నారు. పూరి రథయాత్రలో పాల్గొనే వారందరూ రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకొని ఉండాలని ఆలయ అధికారులు చెప్పారు. దీంతోపాటు ఆర్టీపీసీఆర్ నెగిటివ్ రిపోర్టు ఉన్న వారినే రథయాత్రలో సేవకులుగా అనుమతిస్తామని అధికారులు వివరించారు. దీని కోసం రథయాత్రలో పాల్గొనే సేవకులకు కరోనా పరీక్షలు చేస్తున్నామని పూరి జగన్నాథ్ ఆలయ అధికారి అజయ్ జెనా చెప్పారు.జగన్నాథ రథయాత్రను కేవలం పూరిలోనే పరిమితమైన సేవకులతో భక్తులు లేకుండా జరిపేందుకు ఆలయ అధికారులు సన్నాహాలు చేశారు.

Read Also… Black Magic: పెద్దాపురంలో క్షుద్రపూజలు కలకలం.. ఇంటి అవరణలో నిమ్మకాయలు, పూజాసామగ్రి..!