Corona Virus: అమలాపురం డివిజన్‌లో కరోనా టెన్షన్.. రోజు రోజుకీ ఉద్యోగుల్లో పెరుగుతున్న కోవిడ్ కేసులు

Corona Virus: కరోనా సెకండ్ వేవ్ ఉధృతి తగ్గినట్లే తగ్గి మళ్ళీ పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లాలో రోజు...

Corona Virus: అమలాపురం డివిజన్‌లో కరోనా టెన్షన్.. రోజు రోజుకీ ఉద్యోగుల్లో పెరుగుతున్న కోవిడ్ కేసులు
Amalapuram Corona
Follow us
Surya Kala

|

Updated on: Oct 31, 2021 | 8:48 AM

Corona Virus: కరోనా సెకండ్ వేవ్ ఉధృతి తగ్గినట్లే తగ్గి మళ్ళీ పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లాలో రోజు రోజుకీ కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుంది. కరోనా కొత్త కేసుల్లో ఎక్కువగా ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది.  వివరాల్లోకి వెళ్తే..

తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతాల్లో కోవిడ్ బాధితుల సంఖ్య పెరుగుతుంది.  కొత్తగా కరోనా వైరస్ బారిన పడుతున్నవారిలో ఎక్కువగా ఉద్యోగులు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. గత రెండు రోజుల క్రితం అమలాపురం   డివిజన్ లో పది మంది పోలీసులకు కరోనా వైరస్ సోకినట్లు పోలీసు అధికారులు ప్రకటించిన సంగతి తెలిసిందే.. తాజాగా రాజోలు ప్రభుత్వ స్కూలులో ఏడుగురు ఉపాధ్యాయులకు కూడా కరోనా బారినపడ్డారు.

తాజాగా అల్లవరం మండల తహశీల్దార్ సహా మరో నలుగురు ఉద్యోగులకు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు అధికారులు ప్రకటించారు. గత ఐదు రోజుల నుంచి కోనసీమలో కొవిడ్ కేసుల సంఖ్య పెరుగుతుండడం ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో మిగతా డివిజన్ల కంటే అమలాపురం డివిజన్లో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయని అధికారులు చెప్పారు. ఇదే విషయంపై అమలాపురం ఆర్డీవో వసంతరాయుడు మాట్లాడుతూ.. ఈరోజు రోజుకీ ఇలా కేసులు పెరగడానికి కారణం ఇటీవల జరిగిన దసరా ఉత్సవాలని చెప్పారు. ఈ ఉత్సవాల సమయంలో జనసమూహం ఏర్పడడంతో కేసుల సంఖ్య పెరుగుతుందని అన్నారు. కరోనా సోకిన ప్రాంతాల్లో అధికారులను అప్రమత్తం చేశామని.. నివారణ చర్యలు చేపట్టాలని సూచించామని తెలిపారు. ఇక ఆర్డీవో స్కూళ్లలో కోవిడ్ నిబంధనలు పాటించడం లేదని.. అందువల్లనే ఉపాధ్యాయులకు కరోనా సోకిందని ఆర్డీవో వసంతరాయుడు చెప్పారు. ప్రజలందరూ తప్పని సరిగా కరోనా నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.

Also Read:  నేడు విశాఖలో పర్యటించనున్న జనసేనాని.. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటున్న పవన్ కళ్యాణ్..