Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan: నేడు విశాఖలో పర్యటించనున్న జనసేనాని.. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటున్న పవన్ కళ్యాణ్..

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు వైజాగ్ లో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు పవన్ కళ్యాణ్..

Pawan Kalyan: నేడు విశాఖలో పర్యటించనున్న జనసేనాని.. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటున్న పవన్ కళ్యాణ్..
Pawan Kalyan
Follow us
Surya Kala

|

Updated on: Oct 31, 2021 | 8:28 AM

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు వైజాగ్ లో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిరసనకారుల శిబిరాన్ని సందర్శించి ఉద్యోగులకు పవన్ కళ్యాణ్ సంఘీభావం తెలపనున్నారు. ఇప్పటికే పవన్  స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకు మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే జనసేనాని  భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ జనసేన పార్టీ అధినేత ఎలుగెత్తి చాటనున్నారు.

తమ అధినేత చేపట్టిన బహిరంగ సభలో పాల్గొనడానికి ఇప్పటికే భారీగా జనసేన కార్యకర్తలు, నేతలు విశాఖ పట్టణానికి చేరుకున్నారు.  పవన్ కళ్యాణ్ చేపట్టిన సభకు కార్యకర్తలు ఏర్పాట్లు చేస్తున్నారు. సాయంత్రం జరిగే బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్న సంగతి తెలిసిందే. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ గేటు వద్ద జనసేన అధినేత పవన్ కల్యాణ్ తలపెట్టిన బహిరంగ సభకు పోలీసులు అనుమతి ఇచ్చారు.

అయితే జనసేన, బీజేపీ లు కలిసి నడుస్తాయని.. పవన్ కల్యాణ్ బీజేపీకి మద్దతుఇస్తున్న సంగతి తెలిసిందే.. అయితే కేంద్ర లో అధికారంలో ఉంది బీజేపీ.. విశాఖ ఉక్కు పరిశ్రమని ప్రయివేట్ పరం చేయాలనీ నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం.. ఈ నేపథ్యంలో కేంద్ర నిర్ణయానికి వ్యక్తిరేకంగా పవన్ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదాన్ని మరోసారి తెరపైకి తీసుకుని రావడం.. ఉద్యోగుల ఆందోళలకు మద్దతు పలకడంపై ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమయింది. విశాఖలోనే జనసేనాని మంగళవారం వరకూ ఉంది.. అక్కడ పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది.

Also Read:  ముగిసిన పునీత్ అంత్యక్రియలు.. కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయ ప్రముఖులు కన్నీటి వీడ్కోలు