AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Jagan: ‘రాజకీయమంటే డ్రామా కాదు.. చంద్రబాబు ఫోటో షూట్ కోసం జనాన్ని చంపుతున్నాడు!’.. అనకాపల్లి పర్యటనలో సీఎం సంచలన వ్యాఖ్యలు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలను గుప్పించారు. ‘కొందరు ఈ రాష్ట్రం కాకపోతే ఆ రాష్ట్రం..ఈ ప్రజలు కాకపోతే ఆ ప్రజలు..ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీ.. ఈ భార్య కాకపోతే..

CM Jagan: ‘రాజకీయమంటే డ్రామా కాదు.. చంద్రబాబు ఫోటో షూట్ కోసం జనాన్ని చంపుతున్నాడు!’.. అనకాపల్లి పర్యటనలో సీఎం సంచలన వ్యాఖ్యలు..
Andhra Pradesh Cm Jagan
శివలీల గోపి తుల్వా
|

Updated on: Dec 30, 2022 | 2:14 PM

Share

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలను గుప్పించారు. ‘కొందరు ఈ రాష్ట్రం కాకపోతే ఆ రాష్ట్రం..ఈ ప్రజలు కాకపోతే ఆ ప్రజలు..ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీ.. ఈ భార్య కాకపోతే ఆ భార్యతో అన్న’విధంగా వ్యవహరిస్తున్నారని పరోక్షంగా ప్రతిపక్ష నేతలపై నిప్పులు చెరిగారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో శుక్రవారం పర్యటించిన ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతక ముందు రూ.986 కోట్ల విలువైన అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు. రూ. 500 కోట్లతో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. అలాగే రూ.470 కోట్లతో నిర్మించే తాండవ-ఏలేరు ఎత్తిపోతల పథకం కాలువల అనుసంధాన ప్రాజెక్ట్‌ పనులకు ముఖ్యమంత్రి జగన్‌ శ్రీకారం చుట్టారు. ఆ క్రమంలోనే రూ.16 కోట్లతో నర్సీపట్నం రహదారి విస్తరణతో పాటూ మరికొన్ని పనులను ప్రారంభించారు.

పరోక్షంగా ప్రతిపక్షాలపై విరుచుకుపడిన జగన్

‘కొందరు ఈ రాష్ట్రం కాకపోతే ఆ రాష్ట్రం.. ఈ ప్రజలు కాకపోతే ఆ ప్రజలు..ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీ.. ఈ భార్య కాకపోతే ఆ భార్యతో అన్నట్లుంది వీరి స్టైల్. ఒక్క ఎమ్మెల్యే లేడు.. రెండు చోట్ల పోటీచేస్తే రెండు చోట్లా ప్రజలు ఓడించారరు. ఈయనకు నిర్మాత, దర్శకుడు చంద్రబాబే. కాల్ షీట్‌లు ఇచ్చి షూటింగ్‌కు వస్తారు. చంద్రబాబు స్క్రిప్ట్ ఇస్తారు.. బాబు చెప్పిన డైలాగ్స్‌‌కు ఈయన యాక్ట్ చేస్తారు. దత్త తండ్రిని నెత్తిన పెట్టుకని దత్తపుత్రుడు ఊరేగుతున్నాడు. రాష్ట్రంలో ఏ మంచి జరిగినా తానే చేశానని.. తన వల్లే జరిగిందని చంద్రబాబు చెప్పుకుంటారు. చివరికి సింధు బ్యాడ్మింటన్‌లో గెలిచినా.. తానే నేర్పించాడంటారు చంద్రబాబు’ అంటూ ప్రతిపక్షనేతలపై విరుచుకుపడ్డారు జగన్. రెండు రోజుల క్రితం కందుకూరులో జరిగిన తొక్కిసలాట ఘటనపై కూడా జగన్ స్పందించారు. ‘ఫోటో షూట్ కోసమే కందుకూరు సభ అన్నారు. జనం రాకపోయినా బాగా వచ్చారని చూపేందుకు ఇరుకు సందుల్లో సభ పెట్టి.. ఎనిమిదిమందిని చంపేశారు. ఇంతకన్నా ఘోరం ఉంటుందా..?’ అని జగన్ అన్నారు.

జగన్ తన విమర్శలను కొనసాగిస్తూ.. ‘గోదావరి పుష్కరాల్లోనూ షూటింగ్ కోసం 29మంది ప్రాణాలు తీశారు. రాజకీయం అంటే షూటింగ్‌లు కాదు.. డైలాగులు కాదు. రాజకీయం అంటే డ్రోన్ షాట్లు కాదు. రాజకీయం అంటే డ్రామాలు అంతకన్నా కాదు. రాజకీయం అంటే పేద కుటుంబాల్లో మంచి మార్పు తీసుకురావడం’ అని పేర్కొన్నారు. అలాగే ‘గత ప్రభుత్వాలు నర్సీపట్నంను పట్టించుకోలేదని.. ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేద’న్నారు సీఎం. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో నర్సీపట్నం రూపురేఖలు మార్చబోతున్నాయన్నారు. ‘రాజకీయమంటే గ్రామాల రూపురేఖలు మార్చాలి. రాజకీయమంటే ఇళ్లులేని వారికి ఇళ్లు ఇవ్వాలి. రాజకీయ నాయకుడు అంటే ప్రజాసేవకుడు. చంద్రబాబు మాదిరి ప్రజలపై అధికారం చెలాయించడం కాదు. తాము ఇచ్చిన ప్రతిమాట నిలబెట్టుకుంటాం.. చేసేదే చెబుతాం.. చెప్పిందే చేస్తాం..’ అని జగన్ అన్నారు. ఈ ప్రభుత్వ పాలన ప్రతి కార్యకర్త తల ఎత్తుకుని తిరిగేలా ఉంటుందన్నారు.రాష్ట్రంలో చెడిపోయిన వ్యవస్థతో యుద్ధం జరుగుతోందన్నారు సీఎం. కొన్ని మీడియా సంస్థలు నిత్యం ప్రభుత్వంపై బురదజల్లడమే పనిగా పెట్టుకుందని..  ప్రజలకు తాము మంచి చేస్తున్నా.. వారికి చెడే కనిపిస్తుందన్నారు. అవ్వతాతలకు మంచి చేస్తుంటే దుష్టచతుష్టయం దుష్ప్రచారం చేస్తోందని మండిప్డడారు జగన్. నిబంధనల ప్రకారం ప్రతి ఆరు నెలలకు పెన్షన్‌ వెరిఫికేషన్‌ ఉంటుందని.. దీనిపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు ఆయన.

ఇవి కూడా చదవండి