AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: నడుములోతు మంచులోనూ చిరునవ్వులు చిందిస్తున్న సైనికుడు.. వీడియోను చూస్తే ఒళ్లు పులకించిపోవాల్సిందే..

దేశ సరిమద్దులలో ఉండే భారత భద్రతా దళాలు, ఆర్మీ సైనికుల దేశభక్తి, ధైర్యం, సాహసం, త్యాగం, సమయపాలన గురించి ఎంత వివరించినా అది తక్కువే అవుతుంది. ఇక అర్మీకి సంబంధించిన అనేక వీడియోలు..

Watch Video: నడుములోతు మంచులోనూ చిరునవ్వులు చిందిస్తున్న సైనికుడు.. వీడియోను చూస్తే ఒళ్లు పులకించిపోవాల్సిందే..
Indian Young Soldier Walks Into Knee Deep Snow With Smile
శివలీల గోపి తుల్వా
|

Updated on: Dec 30, 2022 | 12:14 PM

Share

దేశ సరిమద్దులలో ఉండే భారత భద్రతా దళాలు, ఆర్మీ సైనికుల దేశభక్తి, ధైర్యం, సాహసం, త్యాగం, సమయపాలన గురించి ఎంత వివరించినా అది తక్కువే అవుతుంది. ఇక అర్మీకి సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియా వేదికగా హల్‌చల్ చేస్తునే ఉంటాయి. కఠినాతి కఠినమైన పరిస్థితులలో కఠోర దీక్షతో దేశానికి కాపలా కాస్తుంటారు మన సైనికులు. ఇందుకు సంబంధించిన అనేక వీడియోలను మీరు ఇది వరకే చూసి ఉంటారు. అయితే అలాంటి వీడియోలు ఎన్ని వచ్చినా దేనికది ప్రత్యేకమే. వాటికంటూ సొంత ప్రాముఖ్యత ఉండనే ఉంటుంది.

అయితే మేజర్ జనరల్ రాజు చౌహాన్( Maj Gen Raju Chauhan, VSM ) అనే ఖాతా నుంచి పోస్ట్ అయిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూస్తే ఒళ్లు పులకించిపోకుండా ఉండదంటే అతిశయోక్తి లేదేమో.. వైరల్ అవుతున్న ఆ వీడియోలలో మోకాలు లోతు ఉన్న మంచులో ఒక యువ సైనికుడు ఇబ్బంది పడుతూనే ముందుకు కదలడాన్ని మనం చూడవచ్చు. ఆ పరిస్థితిలో కూడా అతని ముఖం మీర చిరునవ్వు చెదరలేదు. డిసెంబర్ 25న పోస్ట్ అయిన ఈ వీడియోను ఇప్పటివరకు దాదాపు  2 లక్షల 7వేల వీక్షణలు వచ్చాయి.

ఇవి కూడా చదవండి

నెట్టింట వైరల్ అవుతున్న ఆర్మీ సోల్జర్ వీడియోను ఇక్కడ చూడండి..

అలాగే 9 వేలకు పైగా లైకులు కూడా వచ్చాయి. ఆ క్రమంలోనే నెటిజన్లు ఎంతో ప్రశంసాత్మకంగా స్పందిస్తున్నారు. ‘తల్లికి సేవ చేస్తే ముఖంలో చిరునవ్వు మెరుస్తుంద’ని ఒక నెటిజన్ కామెంట్ చేయగా, ‘ఈ యోధుల జీవనశైలి చాలా కఠినమైనది, సవాళ్లతో కూడుకున్నది. వారికి సెల్యూట్ చేయండి’ అని రాసుకొచ్చాడు. ఇలా నెటిజన్లు వారి వారి స్పందనలను, అభిప్రాయాలను కామెంట్ల ద్వారా తెలిజయేస్తున్నారు.

మరిన్ని వైరల్ వార్తల కోసం క్లిక్‌ చేయండి.