AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: ఇదేం పిచ్చి..? మార్కెట్ మధ్యలో యువతి ‘భేషరమ్ రంగ్’ స్టెప్పులు.. వైరల్ అవుతున్న వీడియో..

రీల్స్‌ను సహజంగా ఇంట్లో లేదా ఎవరూ లేని చోట చేస్తుంటారు. కానీ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న వీడియో అందుకు పూర్తిగా విరుద్ధం. ఇటీవలి కాలంలో విడుదలై ట్రెండింగ్ పాటగా మారిన..

Watch Video: ఇదేం పిచ్చి..? మార్కెట్ మధ్యలో యువతి ‘భేషరమ్ రంగ్’ స్టెప్పులు.. వైరల్ అవుతున్న వీడియో..
Girl Dances To Besharam Rang On Crowded Market Area
శివలీల గోపి తుల్వా
|

Updated on: Dec 30, 2022 | 11:38 AM

Share

ట్రెండింగ్ అవుతున్న పాటలకు యువతీయువకులు డ్యాన్స్ చేయడం, వాటిని రీల్స్‌గా తమ సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేయడం అనేది సర్వసాధారణం. ఈ రోజుల్లో ఇది ప్రతి ఇంటి రామాయణమే అన్న మాదిరిగా కూడా మారిపోయింది. అయితే ఇలా రీల్స్‌ను సహజంగా ఇంట్లో లేదా ఎవరూ లేని చోట చేస్తుంటారు. కానీ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న వీడియో అందుకు పూర్తిగా విరుద్ధం. ఇటీవలి కాలంలో వివాదంగా మారిన పఠాన్ సినిమాలోని ‘బేషరమ్ రంగ్’ పాటకు డ్యాన్స్‌లు వేసింది ఓ యువతి. ఇక్కడ విశేషమేమంటే.. మార్కెట్ మధ్యలో రోడ్డుకు అడ్డంగా నిలబడి డ్యాన్స్ వేసింది ఆ యువతి.

అయితే వీడియో పోస్ట్ అయిన ఖాతా ప్రకారం ఆమె కొలకత్తాకు చెందిన రుద్ర అని తెలుస్తోంది. ఇక ఆ వీడియోలో ఆమె భేషరమ్ రంగ్ పాటకు స్టెప్పులేస్తున్నప్పుడు ఆమె ఒంపుసొంపులను చూసేందుకు చాలా మంది అక్కడే నిలబడి చూస్తుండిపోయారు. అలాగే కొందరు అయితే ‘నడి రోడ్డు మీద ఇదేం గోల’ అన్నట్లుగా చిరాకు పడుతూ ఉండడాన్ని మనం చూడవచ్చు. దీనికి సంబంధించిన _sahelirudra_ అనే తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా రుద్ర ఈ వీడియోను‘పబ్లిక్ రియాక్షన్స్’ అనే కాప్షన్‌తో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఇవి కూడా చదవండి

నెట్టింట వైరల్ అవుతున్న వీడియోను ఇక్కడ చూడండి.. 

కాగా, ఈ వీడియో ఇంటర్నెట్‌లో క్రేజీ వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో పోస్ట్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు ఈ వీడియోకు దాదాపు 46 లక్షలకు పైగా వీక్షణలు వచ్చాయి. అలాగే లక్ష 40 వేల లైకులను అందుకున్న ఈ వీడియోను చూడకుండా నెటిజన్లు ఉండలేకపోతున్నారు. ఆ క్రమంలోనే ‘ఇతరులు చెప్పేది మర్చిపోయి మీకు సంతోషాన్ని కలిగించేది చేయండి. ఆ సమయంలోనే మిమ్మల్ని నవ్వించే వారితో ఉండండి’ అని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. ‘మీరు చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నారు’ అని మరో నెటిజన్ రాసుకొచ్చాడు. ఈ విధంగా నెటిజన్లు వారి వారి అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు.

మరిన్ని వైరల్ వార్తల కోసం క్లిక్‌ చేయండి.