- Telugu News Photo Gallery In which direction of the house wall is it auspicious and good to put the clock? Here's the information about Clock Placement
Vastu Tips: వాస్తు ప్రకారం గోడ గడియారాన్ని ఏ దిశగా ఉంచడం శుభప్రదం..? అలా మాత్రం పెట్టనే కూడదంట..
ఏ వేళలో ఏ పని చేయాలనేది నిర్ణయించుకోవడానికి, సమయం తెలుసుకోవడానికి గడియారాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అందుకోసమే చాలా మంది తమ గడియారం విషయంలో అనేక రకాల జాగ్రత్తలను పాటిస్తుంటారు. అయితే..
Updated on: Dec 30, 2022 | 10:38 AM

ఏ వేళలో ఏ పని చేయాలనేది నిర్ణయించుకోవడానికి, సమయం తెలుసుకోవడానికి గడియారాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అందుకోసమే చాలా మంది తమ గడియారం విషయంలో అనేక రకాల జాగ్రత్తలను పాటిస్తుంటారు. అయితే మీ ఇంటి గోడపై గడియారాన్ని ఉంచే ముందు దాని సరైన దిశను తెలుసుకోవాలి. లేకపోతే, జీవితంలో అనేక సమస్యలు తలెత్తుతాయి.

ఈ రోజుల్లో చాలా మంది వివిధ పరిమాణాలు, డిజైన్‌ల గడియారాలను ఇంటి అలంకరణ వస్తువులుగా ఉపయోగిస్తున్నారు. కానీ వాస్తు శాస్త్ర నియమాలను పాటించడం లేదు. ఇంటి గోడపై గడియారాన్ని ఉంచడానికి సరైన దిశను కలిగి ఉండటం చాలా ముఖ్యం. లేదంటే వాస్తు దోషాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో గడియారాన్ని ఉంచేటప్పుడు సరైన దిశను తెలుసుకోవడం ముఖ్యం. తూర్పు దిశలో గడియారాన్ని ఉంచడం శుభప్రదంగా ఉంటుందని ప్రసిద్ధి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆనందవాతావరణం పెరుగుతుంది.

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో లోలకం గడియారాలు అమర్చడం శ్రేయస్కరం కాదు. ఇది ఇంటి ఆనందం, ప్రశాంతతపై ప్రతికూలంగా ప్రభావం చూపుతుంది.

ఇంటి దక్షిణ దిశలో గడియారాన్ని ఎప్పుడూ ఉంచవద్దు. ఇలా చేయడం వల్ల వాస్తు దోషాలు ఏర్పడి ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది. ఇది ఇంట్లోవారి ఆరోగ్యంపై కూడా చెడు ప్రభావం చూపుతుంది.

ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల ఆకారాలు, రంగుల గడియారాలు అందుబాటులో ఉన్నాయి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో నారింజ, ఆకుపచ్చ రంగుల గడియారాలను అమర్చకూడదు. ఈ రంగు గడియారాలు ప్రతికూల శక్తిని ఆహ్వానిస్తాయి.




