ఐఫోన్ 14: ఐఫోన్14కి ఈ ఏడాది భారీగా క్రేజ్ లభించింది. మొత్తం నాలుగు వేరియంట్లలో ఈ ఫోన్‌ను విడుదల చేశారు. ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ ఫోన్లలో ఏ 15 బయోనిక్ చిప్‌ను, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ మోడల్స్‌లో ఏ16 బయోనిక్ చిప్‌ను ఉపయోగించారు. బేస్ వేరియంట్లలో 12 మెగాపిక్సెల్ కెమెరాలను అమర్చితే, ప్రో వేరియంట్లలో డైనమిక్ ఐలాండ్ ఫీచర్‌తో 48 ఎంపీ కెమెరాను అమర్చారు. ఇండియాలో ఈ ఫోన్ ధర ప్రారంభ ధర రూ. 79,900కాగా హై ఎండ్ వేరియంట్ రూ. 1,39,900గా ఉంది.