- Telugu News Photo Gallery PM Narendra Modi visits his mother Heeraben Modi every year on his birthday to take her blessings
Heeraben Modi passes away: ఎంత బిజీగా ఉన్నా.. ఆరోజు మాత్రం తప్పనిసరిగా తల్లి వద్దకు ప్రధాని మోదీ.. ఎన్నోసార్లు తన వద్దకు రావాలని పిలిచినా..
Heeraben Modi passes away: ప్రధానమంత్రి నరేంద్రమోదీకి తల్లి హీరాబెన్ మోదీ అంటే ఎంతో ప్రేమ. తన పుట్టినరోజు నాడు.. ఎంత బిజీగా ఉన్నా.. అహ్మదాబాద్ వెళ్లి తల్లి ఆశీర్వచనాలు తీసుకునేవారు ప్రధాని మోదీ. స్వయంగా తన కుమారుడు దేశానికే ప్రధానమంత్రి అనే గర్వం ఆమెలో ఎక్కడా కన్పించేది కాదు. ఓ ప్రధాని తల్లి ఇంత సర్వసాధారణంగా
Updated on: Dec 30, 2022 | 8:14 AM

ప్రధానమంత్రి నరేంద్రమోదీకి తల్లి హీరాబెన్ మోదీ అంటే ఎంతో ప్రేమ. తన పుట్టినరోజు నాడు.. ఎంత బిజీగా ఉన్నా.. అహ్మదాబాద్ వెళ్లి తల్లి ఆశీర్వచనాలు తీసుకునేవారు ప్రధాని మోదీ. స్వయంగా తన కుమారుడు దేశానికే ప్రధానమంత్రి అనే గర్వం ఆమెలో ఎక్కడా కన్పించేది కాదు. ఓ ప్రధాని తల్లి ఇంత సర్వసాధారణంగా ఉంటున్నారా అంటూ అంతా ఆశ్చర్యానికి గురైన సందర్భాలు ఉన్నాయి. అహ్మదాబాద్‌లో తల్లి వద్దకు ఎప్పుడు వెళ్లినా తన కుమారుడుకి హీరాబెన్ మోదీ స్వీట్ తినిపించి.. అందరి పిల్లలకు తల్లిదండ్రులు ఎలా ఇస్తారో అలా ఎంతో కొంత నగదు ఇచ్చేవారు హీరాబెన్.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన తల్లివద్దకు ఎప్పుడు వెళ్లినా అప్యాయంగా పలకరిస్తూ.. ఆమెతో సంతోషంగా గడిపేవారు. తల్లి వద్ద ఉన్న సమయంలో అన్ని విషయాలు మర్చిపోయి.. నవ్వుతూ.. తల్లి ప్రేమను పొందేవారు. నరేంద్రమోదీ ఇంటికి వచ్చినప్పుడు ఆమె తల్లి కూడా ఎంతో సంతోషపడేవారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురించి తెలిసినవారందరికి దాదాపు వారి మాతృమూర్తి హీరాబెన్ మోదీ గురించి తెలిసే ఉంటుంది. మొత్తం ఐదుగురు కుమారులు, ఒక కుమార్తె ఆమెకు ఉన్నారు. ప్రధాని మోదీ, తల్లి హీరాబెన్ మధ్య ప్రేమ, ఆప్యాయతలను తెలిపేలా ఓ సైకత శిల్పాన్ని సముద్ర తీరంలో రూపొందించారు ఓ కళాకారుడు.

తన వద్దకు వచ్చి ఉండాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. తన తల్లిని ఎన్నోసార్లు కోరినప్పటికి ఆమె సున్నితంగా తిరస్కరించారు. అయితే అహ్మదాబాద్ వెళ్లిన చాలా సందర్భాల్లో హీరాబెన్ కలవడానికి ప్రాధాన్యమిచ్చేవారు. ఓసారి ఆయన గుజరాత్ వెళ్లినప్పుడు.. ఆమె తల్లితో కొంత సమయం గడపడంతో పాటు.. ఆమె వీల్‌చైర్‌లో ఉండగా.. ప్రధాని మోదీ వీల్‌చైర్ తోసుకుంటూ.. ముచ్చటించిన ఘటనలు ఉన్నాయి.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం తల్లి ఆశీర్వచనాలు పొందేవారు. ఆమె పాదాల వద్ద కూర్చుని.. మంచి, చెడ్డా మాట్లాడుకుంటూ.. తల్లి ఆశీర్వాదం తప్పనిసరిగా తీసుకునేవారు. పక్కనే కూర్చుని అనేక విషయాలు ముచ్చటించడంతో పాటు.. ఆమె ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకునేవారు.





























