CM Jagan: సీఎం జగన్ దావోస్ పర్యటనకు లైన్ క్లియర్.. అనుమతినిచ్చిన సీబీఐ కోర్టు..
CM Jagan Davos Tour: జగన్‌ను విదేశీ పర్యటనకు అనుమతిస్తే విచారణలో జాప్యం జరుగుతుందన్న సీబీఐ వాదనను తోసిపుచ్చింది. సీఎం హోదాలో దావోస్ పర్యటనకు వెళ్తున్నట్లు తెలిపిన జగన్ విజ్ఞప్తిని సీబీఐ కోర్టు సమర్థించింది.
CM Jagan Davos Tour: ఏపీ సీఎం జగన్ విదేశీ పర్యటనకు లైన్ క్లియర్ అయింది. ఆయన దావోస్ వెళ్లడానికి సీబీఐ కోర్టు అనుమతించింది. దేశం విడిచివెళ్లరాదని ఉన్న బెయిల్ షరతులను సడలించాలని.. సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం అందుకు సమ్మతించింది. జగన్‌ను విదేశీ పర్యటనకు అనుమతిస్తే విచారణలో జాప్యం జరుగుతుందన్న సీబీఐ వాదనను తోసిపుచ్చింది. సీఎం హోదాలో దావోస్ పర్యటనకు వెళ్తున్నట్లు తెలిపిన జగన్ విజ్ఞప్తిని సీబీఐ కోర్టు సమర్థించింది. దీంతో.. ఈనెల 19 నుంచి 31 మధ్య దావోస్‌లో పర్యటించనున్నారు సీఎం జగన్. సీఎంగా బాధ్యతలు చేపట్టాక సీఎం జగన్ తొలి అధికారిక విదేశీ పర్యటన ఇదేకావడం విశేషం. సీఎం అయిన తరువాత లండన్..అమెరికా పర్యటించినా.. అది వ్యక్తిగత పర్యటనగా పరిమితమైంది. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా తొలిసారి విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. మూడేళ్లుగా రాష్ట్రానికి విదేశీపెట్టుబడులు వచ్చిందేలేదంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో జగన్ విదేశీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
కాగా స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ఈ నెల 22 నుంచి 26 వరకు 52వ ప్రపంచ వాణిజ్య సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు ముఖ్యమంత్రి జగన్‌తో పాటు మంత్రులు అమర్నాథ్ రెడ్డి, బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డితో సహా పలువురు అధికారులు హాజరు కానున్నారు. కాగా రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ దావోస్ సదస్సుకు సంబంధించి రాష్ట్ర లోగోను, అభివృద్ధి లక్ష్యాల బుక్‌లెట్‌ను ఆవిష్కరించారు. ‘ రాష్ట్రంలో అధికార వికేంద్రీకరణ అంశాన్ని దావోస్ వేదికగా అందరికీ తెలియజేస్తాం. దాదాపు 30 అంతర్జాతీయ కంపెనీలతో మేం సమావేశం కాబోతున్నాం’ అని మంత్రి తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..
Also Read: