Andhra Pradesh: ఒకే రోజు పది కీలక బిల్లులకు ఆమోదం తెలిపిన ఏపీ అసెంబ్లీ
మొదటి రెండు రోజులు తెలుగుదేశం పార్టీ సభ్యులు వాయిదా తీర్మానాలు ఇవ్వడం, దానిపై అధికార, ప్రతిపక్షాల మధ్య గందరగోళంతో సభా సమావేశాలకు ఆటంకం ఏర్పడ్డాయి. అయితే తెలుగుదేశం పార్టీ సభ్యులు సభా సమావేశాలను బహిష్కరించడంతో మూడో రోజు అసెంబ్లీ ప్రశాంతంగా కొనసాగింది. ప్రశ్నోత్తరాలతో ప్రారంభమైన సభలో కీలక బిల్లులను ప్రవేశపెట్టింది ప్రభుత్వం... అజెండా ప్రకారం తొమ్మిది బిల్లులు ప్రవేశపెట్టాల్సి ఉండగా అదనంగా మరో బిల్లును కూడా చేర్చింది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు ప్రశాంతంగా కొనసాగాయి..మొదటి రెండు రోజులు తెలుగుదేశం పార్టీ సభ్యులు వాయిదా తీర్మానాలు ఇవ్వడం, దానిపై అధికార, ప్రతిపక్షాల మధ్య గందరగోళంతో సభా సమావేశాలకు ఆటంకం ఏర్పడ్డాయి. అయితే తెలుగుదేశం పార్టీ సభ్యులు సభా సమావేశాలను బహిష్కరించడంతో మూడో రోజు అసెంబ్లీ ప్రశాంతంగా కొనసాగింది. ప్రశ్నోత్తరాలతో ప్రారంభమైన సభలో కీలక బిల్లులను ప్రవేశపెట్టింది ప్రభుత్వం… అజెండా ప్రకారం తొమ్మిది బిల్లులు ప్రవేశపెట్టాల్సి ఉండగా అదనంగా మరో బిల్లును కూడా చేర్చింది. మొత్తం పది బిల్లులను సభలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం…అన్ని బిల్లులను ఆమోదించింది.ఈ బిల్లులు ఎంతో కీలకమైనవిగా చెబుతుంది ప్రభుత్వం.
ఏ బిల్లుల్లో ఏముంది….ఎవరెవరికి ప్రయోజనాలు
మూడో రోజు అసెంబ్లీలో పది బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదించింది సర్కార్…వీటిలో రవాణా శాఖకు చెందినవి మూడు బిల్లులుండగా….మరో 7 బిల్లులు వివిధ శాఖలకు చెందినవి ఉన్నాయి.
- ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చట్ట సవరణ బిల్లు – ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బదులు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సభలో ప్రవేశపెట్టారు..కొన్ని యూనివర్శిటీలను చట్టంలో చేర్చకపోవడం వల్ల నియామకాల విషయంలో ఎదురవుతున్న ఇబ్బందుల దృష్ట్యా చట్టంలో సవరణలు చేసారు.ఈ సవరణ వల్ల కొత్తగా పలు విశ్వవిద్యాలయాలను చట్టంలో చేర్చనుంది ప్రభుత్వం.
- ఆంధ్రప్రదేశ్ ప్రయివేట్ యూనివర్శిటీల చట్టంలో సవరణ బిల్లు – మంత్రి బొత్స సత్యనారాయణ బిల్లును సభలో ప్రవేశపెట్టారు.అంతర్జాతీయ యూనివర్శిటీలతో డిగ్రీలు ఎంఓయూలు చేసుకునేలా రెండు యూనివర్శిటీలకు గుర్తింపు ఇచ్చేలా చట్టంలో సవరణలు.మోహన్ బాబు యూనివర్శిటీ,అపోలో యూనివర్శిటీల అభ్యర్ధన మేరకు ఈ రెండు యూనివర్శిటీలకు అవకాశం కల్పించేలా చట్టంలో మార్పులు.
- ఏపీ జీఎస్టీ చట్టంలో సవరణల బిల్లు – ఆర్ధిక మంత్రి బుగ్గన సభలో ప్రవేశపెట్టారు.ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్ల ద్వారా వస్తువుల సరఫరాకు సంబంధించి కాంపోజిట్ ట్యాక్స్ ల్లో మార్పులు చేసే బిల్లు.
- ఏపీఎస్ ఆర్టీసీ సవరణ బిల్లు – రవాణా శాఖ మంత్రి పినిపె విశ్వరూప్ బిల్లును సభలో ప్రవేశపెట్టారు.ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత సీసీఏ రూల్స్ సవరణ చేయకపోవడంతో పాత పద్దతిలోనే ఉద్యోగులపై చర్యలు తీసుకుంటున్నారు.దీనివల్ల న్యాయపరమైన సమస్యలు వస్తున్నాయి.దీంతో సీసీఏ రూల్స్ అమల్లోకి వచ్చే వరకూ ఏపీఎస్ ఆర్టీసీ రెగ్యులేషన్ ప్రకారమే చర్యలు తీసుకునేలా చట్టంలో సవరణలు.
- ఏపీ మోటార్ వెహికల్స్ టాక్సేషన్ మొదటి సవరణ బిల్లు – మంత్రి విశ్వరూప్ సభలో బిల్లు ప్రవేశపెట్టారు.మోటారు వాహనాల పన్నుల వసూళ్లలో మార్పులు.ఆటోలు వంటి మూడు చక్రాల రవాణా వాహనాలకు లైఫ్ ట్యాక్స్ కాకుండా త్రైమాసినక పన్ను విధానాన్ని అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం.
- ఏపీ మోటార్ వెహికల్స్ టాక్సేషన్ రెండో సవరణ బిల్లు – మంత్రి విశ్వరూప్ సభలో బిల్లు ప్రవేశపెట్టారు.మూడు వేల కేజీల కంటే ఎక్కువ బరువున్న వాహనాలు తీసుకెళ్లే వాటికి వాహన ధరను అన్ని పన్నులతో కలిపి చూసేలా మార్పులు.
- ఏపీ అసైన్డ్ ల్యాండ్స్ సవరణ బిల్లు – మంత్రి ధర్మాన ప్రసాదరావు సభలో బిల్లు ప్రవేశపెట్టారు.అసైన్డ్ భూములను 20 ఏళ్లు దాటిన తర్వాత అమ్మకాలు చేసుకునేలా ఇటీవల ప్రభుత్వం తీసుకున్న నిర్నయానికి చట్ట సవరణ చేసిన బిల్లు.
- ఆంధ్రప్రదేశ్ భూదాన్ అండ్ గ్రామ్ దాన్ సవరణ బిల్లు – మంత్రి ధర్మాన ప్రసాదరావు సభలో ప్రవేశపెట్టారు.ఉమ్మడి ఏపీలో భూదాన్ ఉద్యమం సమయంలో చేసిన చట్టంలో సవరణలు.ప్రభుత్వం కేటాచించిన భూమిని పలు రకాలుగా మార్చుకునేలా అవకాశం ఇచ్చే సవరణ.
- ఆంధ్రప్రదేశ్ హిందూ ధార్మిక చట్టంలో సవరణ బిల్లు – ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ సభలో బిల్లు ప్రవేశపెట్టారు.ఆలయాల ఆదాయాలను బట్టి వర్గీకరణలో మార్పులు చేయడం,అసిస్టెంట్ కమిషనర్ల పరిధిలు మార్చడం వంటి సవరణలు.
- ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయిమెంట్ రెగ్యులేషన్ యాక్ట్ లో సవరణ బిల్లు – మంత్రి బుగ్గన సభలో బిల్లు ప్రవేశపెట్టారు.డెఫ్ టెన్నిస్ క్రీడాకారిణి షేక్ జఫ్రీన్ కు డిప్యూటీ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ లో గ్రూప్ వన్ పోస్ట్ ఇస్తూ చట్ట సవరణ.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం