Varahi Yatra: నాలుగో విడత పవన్ కల్యాణ్ వారాహి యాత్ర షెడ్యూల్ ఖరారు.. ఎక్కడి నుంచంటే..
Pawan Kalyan Varahi Yatra: అక్టోబర్ 1వ తేదీ నుంచి కృష్ణాజిల్లా అవనిగడ్డలో జనసేనానికి పవన్ కళ్యాణ్ నాలుగో విడత వారాహి యాత్ర ప్రారంభమవుతుంది. మచిలీపట్నం, పెడన, కైకలూరు నియోజకవర్గాల మీదుగా ఈ యాత్ర కొనసాగుతుంది. అటు ఇప్పటికే నాలుగో విడత వారాహి యాత్ర నిర్వహణపై కృష్ణా జిల్లా జనసేన నేతలతో నాదెండ్ల మనోహర్ చర్చించారు. పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర ఏపీ రాజకీయాల్లో ఒక సెన్సేషనల్‌గా మారింది. మొదటి విడత వారాహి యాత్రలో వ్యక్తులపై... రెండో విడతలో..
నాలుగో విడత వారాహి యాత్రకు వేళయ్యింది. అక్టోబర్ 1వ తేదీ నుంచి కృష్ణాజిల్లా అవనిగడ్డలో జనసేనానికి పవన్ కళ్యాణ్ నాలుగో విడత వారాహి యాత్ర ప్రారంభమవుతుంది. మచిలీపట్నం, పెడన, కైకలూరు నియోజకవర్గాల మీదుగా ఈ యాత్ర కొనసాగుతుంది. అటు ఇప్పటికే నాలుగో విడత వారాహి యాత్ర నిర్వహణపై కృష్ణా జిల్లా జనసేన నేతలతో నాదెండ్ల మనోహర్ చర్చించారు.
మరోవైపు పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర ఏపీ రాజకీయాల్లో ఒక సెన్సేషనల్‌గా మారింది. మొదటి విడత వారాహి యాత్రలో వ్యక్తులపై… రెండో విడతలో వ్యవస్థలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన పవన్ కల్యాణ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించారు. అటు మూడో విడత యాత్రలో పాల్గొననున్నారు. వైసీపీని గద్దె దించడమే టార్గెట్‌గా పనిచేయాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.
మరో వైపు చంద్రబాబు కి బెయిల్ కూడా రాకుండా రిమాండ్ పొడిగిస్తున్న నేపథ్యంలో ఓవైపు నారా లోకేష్ పాదయాత్ర చేసి ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు జనసేనాని కూడా ఖచ్చితంగా వారాహి విజయ యాత్రను నిర్వహించాలని సిద్దమవుతున్నారు.
1వ తేదీ నుంచి నాలుగో విడత వారాహి విజయ యాత్ర#VarahiVijayaYatra pic.twitter.com/1jlPPpINoW
— JanaSena Party (@JanaSenaParty) September 25, 2023
కృష్ణా జిల్లాలో యాత్ర ప్రారంభం కానుందని పార్టీ ప్రకటించింది. మొదటి మూడు దశల్లో తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలతో పాటు విశాఖపట్నంలో పవన్ కల్యాణ్ యాత్ర చేశారు. తొలి దశలో గోదావరి జిల్లాల్లోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండో దశలో పశ్చిమగోదావరి జిల్లాలోని 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించిన పవన్ కల్యాణ్.. ఆగస్టు 10 నుంచి 19 వరకు విశాఖపట్నంలో కూడా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం