AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP CM YS Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్ కీలక ప్రకటన.. సంగం బ్యారేజ్‌ పేరు మారుస్తున్నట్లు అసెంబ్లీలో వెల్లడి

ఇటీవల మృతి చెందిన ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి ఘనంగా నివాళులర్పించింది ఆంధ్రప్రదేశ్ శాసనసభ. మరో ఆరు వారాల్లో పూర్తయ్యే సంగం బ్యారేజ్‌కు గౌతమ్‌ పేరు పెడుతామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు.

AP CM YS Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్ కీలక ప్రకటన.. సంగం బ్యారేజ్‌ పేరు మారుస్తున్నట్లు అసెంబ్లీలో వెల్లడి
Ys Jagan
Balaraju Goud
|

Updated on: Mar 08, 2022 | 1:17 PM

Share

AP CM YS Jagan Mohan Reddy: ఇటీవల మృతి చెందిన ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి(Mekapati Gowtham Reddy)కి ఘనంగా నివాళులర్పించింది ఆంధ్రప్రదేశ్ శాసనసభ(AP Assembly). మరో ఆరు వారాల్లో పూర్తయ్యే సంగం బ్యారేజ్‌(Sangam Baraggage)కు గౌతమ్‌ పేరు పెడుతామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. సంగం బ్యారేజ్‌ను మేకపాటి గౌతమ్ సంగం బ్యారేజ్‌గా వ్యవహరిస్తామని చెప్పారు. గౌతమ్‌రెడ్డి భౌతికంగా లేకపోయిన ఆయన కలలు, ఆకాంక్షలను కచ్చితంగా నెరవేరుస్తామన్నారు సీఎం జగన్. గౌతమ్‌ తండ్రి కోరిక మేరకు.. ఉదయగిరిలోని కాలేజ్‌కు కూడా గౌతమ్‌పేరు పెట్టి.. వ్యవసాయ, హార్టికల్చర్‌ కోర్సులను ప్రవేశపెడుతామన్నారు. అలాగే వెలిగొండ ప్రాజెక్ట్‌ను యుద్ధప్రాతిపదినక పూర్తిచేయడంతోపాటు.. ఉదయగిరిలోని డిగ్రీకాలేజ్‌ను కూడా అభివృద్ధి చేస్తామని సభలో ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు.

అంతకు ముందు మంత్రిగా గౌతమ్‌రెడ్డి సేవలను కొనియాడిన ఏపీ అసెంబ్లీ ఆయనకు ఘనంగా నివాళి అర్పించింది. 2 నిమిషాలు మౌనం పాటించిన తర్వాత అసెంబ్లీని ఎల్లుండికి వాయిదా వేశారు స్పీకర్‌ తమ్మినేని సీతారాం. గౌతమ్‌రెడ్డి లేని లోటు పూడ్చలేనిదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్ది తెలిపారు. గౌతమ్‌రెడ్డి మృతి తనకు,పార్టీకి, రాష్ట్రానికి తీరని లోటు అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా రెండోరోజు గౌతమ్‌రెడ్డి మృతిపై ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. సభ్యులు ప్రసంగించిన అనంతరం సీఎం వైఎస్‌ జగన్‌ ప్రసంగించారు. గౌతమ్‌రెడ్డి తనకు చిన్నప్పట్నుంచి మంచి స్నేహితుడని గుర్తు చేసుకున్నారు.మంచి స్నేహితుడ్ని కోల్పోవడం బాధాకరమని అన్నారు. గౌతమ్‌రెడ్డి అకాల మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని అన్నారు. చాలా సందర్భాల్లో గౌతమ్‌రెడ్డి తనకు అండగా నిలబడ్డారని సీఎం జగన్‌ గుర్తుచేశారు. ఆయన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించారని తెలిపారు. రాష్ట్రంలోకి కొత్త కంపెనీలు రావడంలో గౌతమ్‌రెడ్డి కీలక పాత్ర పోషించారని అన్నారు.

పారిశ్రామిక మంత్రిగా గౌతమ్‌రెడ్డి చాలా కృషి​ చేశారని తెలిపారు. గౌతమ్‌రెడ్డి లేకపోయినా ఆయన కన్న కలలు నెరవేరుస్తామని సీఎం జగన్‌ అన్నారు. వెలిగొండ ప్రాజెక్ట్‌ ద్వారా ఉదయగిరికి తాగునీటిని అందిస్తామని తెలిపారు. సంగం బ్యారేజీ పనులను 6 వారాల్లో పూర్తి చేస్తామని అన్నారు. సంగం బ్యారేజీకి మేకపాటి గౌతమ్‌రెడ్డి పేరు పెడతామని అసెంబ్లీలో సీఎం వైఎస్‌ జగన్‌ ప్రకటించారు.