Andhra Pradesh: కోరుకొండలో కుంగిన రోడ్డు.. నాసిరకం పనులతో 5 అడుగులు కుంగిన రహదారి
ఇప్పుడు గోతులు కాకుండా ఏకంగా రహదారులే కుంగిపోతున్నాయి. పనుల్లో అంతలా నాణ్యత లోపిస్తోంది. గోతులుంటే పడుతూ లేస్తూ ఎలాగోలా వెళ్లొచ్చు. రహదారే కుంగిపోతే ముందుకు వెళ్లే మార్గమే ఉండదు. ఇప్పుడు అదే దుస్థితి కాకినాడ ప్రజలకు ఎదురవుతోంది. కోరుకొండ రోమ్ సిటీ దగ్గర రోడ్డు కుంగిపోయింది.
ఆంధ్రప్రదేశ్ లో రోడ్ల దుస్థితి గురించి గత కొంతకాలంగా విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. పది కాలాల పాటు మన్నికగా సేవలందించాల్సిన రహదారులు నిర్మించిన కొద్ది నెలలకే.. రూపు కోల్పోతున్న తీరు పనుల నాణ్యతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. రోడ్ల మీద ప్రయాణిస్తున్న వాహనాలు హఠాత్తుగా భూమిలోకి కుంగిపోతూ ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి నెలకొంది. తాజాగా రాజమండ్రి నుంచి లంబసింగి, అరకు వెళ్లే రహదారి కుంగిపోవడం చూస్తే.. పనులు ఎంత లోపభూయిష్టంగా జరిగాయనేది స్పష్టమవుతోంది.
రహదారుల పరిస్థితి గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. నాసిరకం పనుల వల్ల నిర్మించిన కొద్దికాలానికే గోతులు పడుతున్నాయి. ఇదే ఇప్పటివరకు అనుభవం. రహదారి నిర్మించే సమయంలో ఆ ప్రాంతాన్ని ముందుగా ఇంజనీర్ సందర్శిస్తారు. అక్కడ నెల స్వభావాన్ని అంచనా వేసి ప్రమాణాల ప్రకారం రోడ్ల నిర్మాణం చేసే విధానాన్ని సూచిస్తారు. ఇలా నిర్మించిన రోడ్లు కనీసం పదేళ్లయినా ఉండాలి. కానీ ఆలోపే రహదారుల నాణ్యత తేలిపోతోంది. కోట్లాది రూపాయలు మట్టిలో కలిసిపోతున్నాయి. ఇప్పుడు గోతులు కాకుండా ఏకంగా రహదారులే కుంగిపోతున్నాయి. పనుల్లో అంతలా నాణ్యత లోపిస్తోంది. గోతులుంటే పడుతూ లేస్తూ ఎలాగోలా వెళ్లొచ్చు. రహదారే కుంగిపోతే ముందుకు వెళ్లే మార్గమే ఉండదు. ఇప్పుడు అదే దుస్థితి కాకినాడ ప్రజలకు ఎదురవుతోంది. కోరుకొండ రోమ్ సిటీ దగ్గర రోడ్డు కుంగిపోయింది. నాసిరకం పనులతో 5 అడుగులు రహదారి కుంగిపోయింది. రాజమండ్రి నుంచి లంబసింగి, అరకు వెళ్లే రహదారి దెబ్బతింది .
ఇటీవల వరుసగా వర్షాలు, నాణ్యతలేకపోవడం, జాతీయ రహదారికి ఇరుపక్కల ఉన్న కెనాల్‌కి గోడ నిర్మించకపోవడంతో రోడ్డు కుంగినట్లు చెబుతున్నారు. వాహనదారులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో… రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. దీంతో ప్రమాదం తప్పింది.
రహదారి కుంగిపోవడం అంటే చిన్న విషయం కాదని… ఎంత లోపభూయిష్టంగా పనులు జరిగాయనేది స్పష్టమవుతోందని వాహనదారులు విమర్శిస్తున్నారు. అంతేకాదు రహదారుల నిర్మాణంలోని లోపాలపై అధికారులు దృష్టి పెట్టి.. తగిన చర్యలు తీసుకోవాలని ..ఎటువంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.