AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Jagan: ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం జగన్‌.. ప్రధాని మోదీతో ప్రత్యేక భేటీ.. ఆ అంశాలే ప్రధాన అజెండా..

సీఎం జగన్‌ ఢిల్లీ టూర్‌ ఏపీ రాజకీయాల్లో సెన్సేషన్ సృష్టిస్తోంది. కొత్త సంవత్సరానికి సరిగ్గా మూడ్రోజుల ముందు ఢిల్లీ వెళ్లడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇంతకీ, జగన్‌ ఢిల్లీ ఎందుకెళ్లారు?. మెయిన్‌ అజెండా ఏంటి?. ప్రధానితోపాటు ఎవరెవర్ని కలవబోతున్నారు

CM Jagan: ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం జగన్‌.. ప్రధాని మోదీతో ప్రత్యేక భేటీ.. ఆ అంశాలే  ప్రధాన అజెండా..
CM Jagan meets PM Modi
Sanjay Kasula
|

Updated on: Dec 28, 2022 | 7:26 AM

Share

కొత్త సంవత్సరానికి సరిగ్గా మూడ్రోజుల ముందు ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి.. ప్రధాని మోదీతో సమావేశంకానున్నారు. విభజన సమస్యలే ప్రధాన అజెండాగా చర్చలు జరపనున్నారు. గురువారం మధ్యాహ్నం 12:30 కు ప్రధాని నరేంద్ర మోడీతో జగన్ భేటీ కానున్నారు. ఏపీకి రావాల్సిన పెండింగ్‌ నిధులు, పోలవరం ప్రాజెక్ట్‌పై మెమొరాండం ఇవ్వనున్నారు. మూడు రాజధానుల ఇష్యూని కూడా ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. త్రీ కేపిటల్స్‌పై కేంద్ర సహకారం కోరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మెయిన్‌గా విభజన ఇష్యూస్‌పైనే ఫోకస్‌ పెట్టబోతున్నారు సీఎం జగన్‌. షెడ్యూల్‌ 9 అండ్ 10 సంస్థల విభజన కోసం మరోసారి పట్టుబట్టనున్నారు. షెడ్యూల్‌ 9 అండ్ 10 సంస్థలపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకు కూడా వెళ్లిన నేపథ్యంలో ఇది మెయిన్‌ ఇష్యూగా ఉండబోతోంది.

ఏపీ ఆర్ధిక పరిస్థితిని కూడా ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నారు జగన్‌. ఏపీకి రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని కోరనున్నారు. నెక్ట్స్‌ ఇయర్‌ బడ్జెట్‌ అత్యంత కీలకం కానుండటంతో ఆర్ధికంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేసే అవకాశముంది. పోలవరం ప్రాజెక్టు-నిధుల విడుదలపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. రైల్వే ప్రాజెక్టులపైనా ప్రధానికి మెమొరాండం ఇవ్వనున్నారు జగన్‌. మెయిన్‌గా విశాఖ రైల్వే జోన్‌పై క్లారిటీ కోరడంతోపాటు త్వరగా వర్క్స్‌ మొదలుపెట్టాలని రిక్వెస్ట్‌ చేయనున్నారు.

ప్రధాని మోదీతో భేటీ తర్వాత కేంద్ర మంత్రులతోనూ సమావేశంకానున్నారు సీఎం జగన్‌. ఇప్పటికే పలువురు మంత్రుల అపాయింట్‌మెంట్స్‌ కోరిన సీఎం జగన్‌, గ్రీన్‌సిగ్నల్‌ రాగానే వాళ్లతో భేటీకానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలపై చర్చించనున్నారు. మెయిన్‌గా విభజన సమస్యలు, పెండింగ్‌ ఇష్యూస్‌, ఆర్ధిక అవసరాలపైనే మెమొరాండమ్స్‌ ఇవ్వనున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ ఆల్రెడీ ఎలక్షన్స్‌ మూడ్‌లోకి వెళ్లిపోయింది. విపక్షాలన్నీ ఎప్పట్నుంచో క్యాంపెయిన్‌ కూడా మొదలెట్టేశాయి. పెద్దఎత్తున ప్రజల్లోకి వెళ్తూ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. ఇలాంటి టైమ్‌లో నెక్ట్స్‌ బడ్జెట్‌ జగన్‌ సర్కార్‌కు అత్యంత కీలకంగా మారబోతోంది. ఎన్నికలకు ఇంకా ఏడాది మాత్రమే టైమున్న నేపథ్యంలో కేంద్రం నుంచి వీలైనంత ఎక్కువగా ప్రాజెక్టులు, ఆర్ధిక వనరులు సాధించేందుకు ప్రయత్నిస్తోంది వైసీపీ సర్కార్‌. ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతోన్నవేళ… సీఎం జగన్‌ ఢిల్లీ టూర్‌ లక్ష్యం నెరవేరుతుందా? లేదా?

మరిన్ని ఏపీ న్యూస్ కోసం