వైసీపీకి 130 సీట్లు కన్ఫార్మ్- కొరముట్ల
తిరుపతి: చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని, ఉనికి కోసం ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఎద్దేవా చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. టీడీపీ ఓడిపోతుందని చంద్రబాబుకు తెలుసినా కూడా ఆయన ఇప్పటికీ కూడా వ్యవస్థలను మేనేజ్ చెయ్యాలని చూస్తున్నారని అన్నారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని, జాతీయ సర్వేలు ఇదే చెబుతున్నాయని చెప్పారు. రాష్ట్ర ప్రజలు వైఎస్ జగన్‌ను నమ్ముతున్నారని, వైఎస్సార్‌సీపీకి పక్కాగా 130 సీట్లు వస్తాయని విశ్వాసం […]
తిరుపతి: చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని, ఉనికి కోసం ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఎద్దేవా చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. టీడీపీ ఓడిపోతుందని చంద్రబాబుకు తెలుసినా కూడా ఆయన ఇప్పటికీ కూడా వ్యవస్థలను మేనేజ్ చెయ్యాలని చూస్తున్నారని అన్నారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని, జాతీయ సర్వేలు ఇదే చెబుతున్నాయని చెప్పారు. రాష్ట్ర ప్రజలు వైఎస్ జగన్‌ను నమ్ముతున్నారని, వైఎస్సార్‌సీపీకి పక్కాగా 130 సీట్లు వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. లగడపాటి రాజగోపాల్ సర్వే చేయకుండా అబద్దాలు చెప్పారని ఆరోపించారు.