కుప్పంలో చంద్రబాబు ప్రత్యేక పూజలు..!
చిత్తూరు జిల్లా కుప్పంలోని శ్రీ తిరుపతి గంగమాంబ అమ్మవారిని దర్శించుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. సతీసమేతంగా కుప్పంలోని ప్రసన్న తిరుపతి గంగమాంబ విశ్వరూప ఆలయానికి వెళ్లి…అమ్మవారికి సీఎం పట్టువస్త్రాలు, వొడిబాల సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు చంద్రబాబు ఘన స్వాగతం పలికారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించారు. కుప్పం గంగమ్మ ఆలయ మార్గంతో పాటు, ఆలయ పరిసరాల్లో సైతం భద్రతా ఏర్పాట్లు చేశారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు […]
చిత్తూరు జిల్లా కుప్పంలోని శ్రీ తిరుపతి గంగమాంబ అమ్మవారిని దర్శించుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. సతీసమేతంగా కుప్పంలోని ప్రసన్న తిరుపతి గంగమాంబ విశ్వరూప ఆలయానికి వెళ్లి…అమ్మవారికి సీఎం పట్టువస్త్రాలు, వొడిబాల సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు చంద్రబాబు ఘన స్వాగతం పలికారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించారు. కుప్పం గంగమ్మ ఆలయ మార్గంతో పాటు, ఆలయ పరిసరాల్లో సైతం భద్రతా ఏర్పాట్లు చేశారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం చంద్రబాబు బెంగళూరు వెళ్లనున్నారు.