పాములంటే భయపడని వారు ఎవరుంటారు మీరే చెప్పండి. చాలా మంది పాములను చూస్తే చాలు ఆమడ దూరం పారిపోతుంటారు.
ఇక కొందరు పాములను దూరం నుంచి చూస్తనే వణికిపోతుంటారు. మరి అవి సడెన్‌గా ఇంట్లోకి వస్తే ఆ క్షణం మనలో ఉండే భయం టెన్షన్ మాటల్లో చెప్పలేము.
ఇక చాలా మంది పాములు ఎక్కువగా పల్లెటూర్లలోనే ఉంటాయని అనుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు నగరాల్లో కూడా పాములు ఇళ్లల్లోకి వస్తున్నాయి.
అయితే పాములు సడెన్‌గా ఇంట్లోకి వస్తే ఏం చేయాలో తెలియక చాలా మంది టెన్షన్‌కు గురి అవుతుంటారు. కాగా, అసలు పాము ఇంట్లోకి వస్తే ఏం చేయాలో తెలుసుకుందాం.
ఒక వేళ పాము ఇళ్లు లేదా ఆఫీసులోకి వచ్చిన ప్పుడు గట్టిగా అరవడం, భయపడి దానికి ఎదురుగా వెళ్లడం లాంటి పనులు అస్సలే చేయకూడదంటం.
మరీ ముఖ్యంగా కొంత మంది తమ ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నంలో ఇంటికి వచ్చిన పామును చంపడానికి ట్రై చేస్తుంటారు. కానీ అలా చేయకుండా, స్నేక్ క్యాచర్ వారికి సమాచారం ఇవ్వాలంట.
ప్రస్తుతం నగరంలో స్నేక్ క్యాచర్ సొసైటీలు చాలా వరకు అందు బాటులో ఉన్నాయి. ఇంటికి పాము వచ్చిన వెంటనే వారికి ఫోన్ చేస్తే చాలు వారు 20 నిమిషాల లోపే మీ ఇంటి వద్దకు వచ్చి పామును పట్టేసుకుంటారు
అంతే కాకుండా పామును పట్టేసుకొని వాటిని అటవీ ప్రాంతాల్లో వదిలి వేస్తుంటారు. వీరు ఇటు మనుషుల ప్రాణాలు, అటు పాముల ప్రాణాలు కూడా కాపాడుతున్నారు.