చాణక్య నీతి : ఈ తప్పులు చేశారో, సంపదను కోల్పోవడం ఖాయం!
samatha
11 January 2024
ఆచార్య చాణక్యుడి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆయన తన నీతి శాస్త్రంలో ఎన్నో విషయాల గురించి వివరంగా తెలియజేశారు.
మానవులు తెలిసి, తెలియక కొన్ని తప్పులను చేస్తుంటారు. దాని వలన వారు జీవితంలో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంటుంది.
అందు వలన ఆచార్య చాణక్యుడు మన జీవితాలకు సంబంధించిన అనేక విషయాల గురించి తన నీతి శాస్త్రంలో ప్రస్తావించడం జరిగింది.
అయితే కొంత మంది తెలియక చేసే కొన్ని తప్పులు, వారి జీవితంలోనే పెద్ద సమస్యకు కారణం అవుతాయంట. ఇంట్లో సంపద అంతా పోయే ప్రమాదం ఉన్నదని చెబుతుంది చాణక్య నీతి
ఇంతకీ ఆ తప్పులు ఏవో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. పూజ లేకుండా ఇళ్లు ఉండటం. ఏ ఇంట్లో అయితే ప్రతి రోజూ పూజ జరగదో ఆ ఇంట్లోకి లక్ష్మీ దేవి రాదంట.
అలాగే ఎవరైతే పెద్దలకు గౌరవం ఇవ్వకుండా వారిని అవమానిస్తారో, ఆ ఇంట్లో సంతోషం అస్సలే ఉండకపోగా, సంపద మొత్తం నశిస్తుందంట.
ఇక కొంత మంది ఎప్పుడూ గొడవలు పడుతూనే ఉంటరూ, ప్రతి చిన్న విషయానికి గట్టి గట్టిగా అరవడం లాంటిది చేస్తుంటారు. ఏ ఇంట్లో గొడవలు ఉంటాయో అక్కడ సంపద పెరగదు అంటున్నారు చాణక్యుడు.
అలాగే ఏ ఇంట్లోనైతే తులసి మొక్క ఎండిపోవడం, అద్దం పలిగిపోవడం జరుగుతుందో అక్కడ కూడా సమస్యలు మొదలవుతున్నట్లేనంట, ఇలా జరిగే ఇంట్లో ఆర్థిక సమస్యలు వస్తాయంటున్నారు చాణక్యుడు.