చట్టాన్ని ఉల్లంఘించారంటూ… సీఎస్‌ సుబ్రహ్మణ్యంపై ఫిర్యాదు

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంపై శాప్‌ మాజీ ఛైర్మన్‌ పీఆర్‌ మోహన్‌ డీజీపీ ఠాకూర్‌కు ఫిర్యాదు చేశారు. మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం డీజీపీని కలిసిన ఆయన తన నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయకుండా చట్టాన్ని ఉల్లంఘించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. 2015 జనవరి 28వ తేదీన ప్రభుత్వం రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్‌)కు తనను ఛైర్మన్‌గా నియమిస్తూ శాప్‌కు ఉత్తర్వులు జారీ చేసిందని పీఆర్‌ మోహన్‌ ఆ ఫిర్యాదులో […]

చట్టాన్ని ఉల్లంఘించారంటూ... సీఎస్‌ సుబ్రహ్మణ్యంపై ఫిర్యాదు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Srinu

Updated on: May 21, 2019 | 7:39 PM

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంపై శాప్‌ మాజీ ఛైర్మన్‌ పీఆర్‌ మోహన్‌ డీజీపీ ఠాకూర్‌కు ఫిర్యాదు చేశారు. మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం డీజీపీని కలిసిన ఆయన తన నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయకుండా చట్టాన్ని ఉల్లంఘించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. 2015 జనవరి 28వ తేదీన ప్రభుత్వం రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్‌)కు తనను ఛైర్మన్‌గా నియమిస్తూ శాప్‌కు ఉత్తర్వులు జారీ చేసిందని పీఆర్‌ మోహన్‌ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

అప్పటి క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం దానికి అనుబంధ ఉత్తర్వులు జారీ చేయలేదని పేర్కొన్నారు. ఆయన ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులనే నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. చట్టాన్ని కాపాడాల్సిన ఉన్నతాధికారి చట్టాన్ని నిర్లక్ష్యం చేసినందుకు వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. పీఆర్‌ మోహన్‌ చేసిన ఫిర్యాదుపై అవసరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీ ఠాకూర్‌ తిరుపతి అర్బన్‌ ఎస్పీని ఆదేశించారు.