జగన్‌తో నా అనుబంధం తెగిపోయేది కాదు: కేవీపీ
జగన్‌తో తన అనుబంధం తెగిపోయేది కాదని కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రారావు స్పష్టం చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరొందిన కేవీపీ.. జగన్ తనకు మేనల్లుడిలాంటి వాడని తెలిపారు. తమ అనుబంధం వ్యక్తిగతమని, రాజకీయాలకు సంబంధం లేదని ఆయన చెప్పుకొచ్చారు. ఇక జగన్ తాను ఎంచుకున్న దారిలో నడుస్తున్నారని కేవీపీ పేర్కొన్నారు. యూపీఏలో జగన్‌ను కలపాలని తనను అధిష్టానం కోరలేదని.. ఒకవేళ ఆ బాధ్యతలు తనకు అప్పగిస్తే, నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన తెలిపారు. […]
జగన్‌తో తన అనుబంధం తెగిపోయేది కాదని కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రారావు స్పష్టం చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరొందిన కేవీపీ.. జగన్ తనకు మేనల్లుడిలాంటి వాడని తెలిపారు. తమ అనుబంధం వ్యక్తిగతమని, రాజకీయాలకు సంబంధం లేదని ఆయన చెప్పుకొచ్చారు.
ఇక జగన్ తాను ఎంచుకున్న దారిలో నడుస్తున్నారని కేవీపీ పేర్కొన్నారు. యూపీఏలో జగన్‌ను కలపాలని తనను అధిష్టానం కోరలేదని.. ఒకవేళ ఆ బాధ్యతలు తనకు అప్పగిస్తే, నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన తెలిపారు. జగన్‌కు సీట్లు పెరిగతే తమతో కలుపుకోవాలని యూపీఏ చూస్తుందన్న విషయం కూడా తనకు తెలీదని చెప్పారు. ఇక ప్రస్తుతం తాను జగన్‌తో ఎందుకు లేనన్న విషయాన్ని ఓపెన్‌గా చెప్పలేనని.. దాని గురించి చర్చించే సమయం ఇది కాదని వివరించారు.