ఆ ఒక్క కారణంతో ఎంఎస్ ధోని సినిమాను వదిలేసిన రకుల్ ప్రీత్ సింగ్

11 January 2025

Basha Shek

ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు కేవలం బాలీవడ్ కే పరిమితమైంది

మహేష్ బాబు ,అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ తదితర హీరోలకు జోడీగా నటించి టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్ గా ఎదిగిందీ బ్యూటీ.  

అయితే ఆ తర్వాత బాలీవుడ్ కు చెక్కేసింది. కానీ అక్కడ కూడా ఈ ముద్దుగుమ్మ సినిమాలు పెద్దగా విజయం సాధించడం లేదు

సినిమాల సంగతి పక్కన పెడితే.. కొన్ని నెలల క్రితం బాలీవుడ్ ప్రముఖ నిర్మాత జాకీ భగ్నానీ ని ప్రేమించి మరీ వివాహం చేసుకుందీ అందాల తార.   

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రకుల్ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.

కాగా టీమిండియా స్టార్ క్రికెటర్ ఎంఎస్ ధోని బయోపిక్ ఆధారంగా తెరకెక్కించిన ఎమ్మెస్ ధోని సినిమాలో నటించే అవకాశం రకుల్ కే వచ్చిందట.

ఎంఎస్ ధోని నిర్మాతలు కూడా ఆమెనే సెలెక్ట్ చేశారట. అయితే డేట్స్ అడ్జెస్ట్ చేయలేక ఈ ఆఫర్ ను వదలుకుందట ఈ అందాల తార.

రామ్ చరణ్ తో బ్రూస్లీ సినిమాలో నటిస్తున్న సమయంలోనే ఎంఎస్ ధోని సినిమా ఆఫర్ రావడంతో  డేట్లు అడ్జస్ట్ చేయలేకపోయానంది.