వేడి నీటితో స్నానం చేస్తే నిజంగానే పిల్లలు పుట్టరా?
samatha
11 January 2024
తల్లిదండ్రులు కావాలని ఎవరు కోరుకోరు. పెళ్లైన ప్రతి జంట తల్లిదండ్రులు కావాలనుకుంటారు.కానీ ప్రస్తుతం చాలా మంది సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారు.
వివాహం జరిగి సంవత్సరాలు గడుస్తున్నా కొంత మందికి సంతానం కలగడం లేదు. దానికి అనేక కారణాలు ఉన్నాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
కొందరు పిల్లలు కలగకపోవడానికి మహిళలోనే ఏదో సమస్య ఉందని అనుకుంటారు. కానీ ప్రస్తుతం పురుషుల్లో సంతానోత్పత్తి దెబ్బతింటుంది.
మారుతున్న జీవన శైలి, తీసుకుంటున్న ఆహారం, ఒత్తిడి చాలా మంది మగవారిలో సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.
ముఖ్యంగా పురుషులు తెలియకుండా చేసే కొన్ని కారణాల వలన స్పెర్మ్ సామర్థ్యం తగ్గుతుందంట. ఆ కారణాలు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
అధిక ఒత్తిడి, ఆందోళన వలన హార్మోన్ల సమతుల్యత దెబ్బతిని, అది లైంగిక సామర్థ్యంపై ప్రభావం చూపిస్తుందంట. దీని వలన సంతానలేమి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది.
ప్రస్తుతం చాలా మంది ఆల్కహాల్‌కు అడెక్ట్ అయ్యారు. అయితే ఇలా ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం వలన స్పెర్మ్ సామర్థ్యం తగ్గి గర్భం దాల్చే అవకాశాలు తగ్గుతాయంట.
అంతే కాకుండా టైట్ దుస్తులు ధరించడం, ఎక్కువగా వేడిగా ఉన్న నీటితో స్నానం చేయడం వలన స్పెర్మ్ కౌంట్ తగ్గుతుందంటున్నారు నిపుణులు. అధిక వేడి కారణంగా శుక్రకణాల నాణ్యత దెబ్బతిని గర్భందాల్చడం కష్టం అవుతుందంట.